బిగ్ బాస్ యూనిట్ సంచలన నిర్ణయం: కరోనా ప్రభావంతో షోలో కీలక మార్పులు.!

బుల్లితెర చరిత్రలోనే ఏ షోకూ అందని రెస్పాన్స్‌తో పాటు రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది బిగ్ బాస్. బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా రూపొందిన దీనికి ఇండియాలోని అన్ని భాషల్లో అద్భుతమైన స్పందన వచ్చింది. మరీ ముఖ్యంగా తెలుగులో ఈ షో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అందుకే ఏకంగా మూడు సీజన్లను పూర్తి చేసుకుని, నాలుగోది కూడా మొదలెట్టారు నిర్వహకులు. రసవత్తరంగా సాగుతోన్న ఈ సీజన్‌ విషయంలో బిగ్ బాస్ యూనిట్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం.!

అనుమానాల నడుమ ప్రారంభం

అనుమానాల నడుమ ప్రారంభం

తెలుగులో బిగ్ బాస్ షో ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ప్రతి ఏడాది ఈ షోను రన్ చేస్తున్నారు. అయితే, గతంలో మాదిరిగా ఇప్పుడు పరిస్థితులు అనుకూలించకపోయినా.. షోను మాత్రం ప్రసారం చేస్తున్నారు నిర్వహకులు. కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నో జాగ్రత్తలు తీసుకుని సక్సెస్‌ఫుల్‌గా ప్రసారం చేస్తున్నారు.

ముందే తీసుకొచ్చి.. దాచేశారు

ముందే తీసుకొచ్చి.. దాచేశారు

ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో బిగ్ బాస్ నిర్వహకులు పక్కా వ్యూహాన్ని అమలు చేశారు. కరోనా ప్రభావంతో అందరికీ పరీక్షలు చేయించారు. ఆ తర్వాత కంటెస్టెంట్లు అందరినీ క్వారంటైన్ సెంటర్‌లో ఉంచారు. ఈ పిరియడ్ పూర్తి చేసుకున్న వారిని మాత్రమే షోలోకి పంపించారు. ఈ కారణంగానే జబర్ధస్త్ అవినాష్‌ను రెండు వారాల తర్వాత ఎంట్రీ ఇప్పించారు.

అనుకూలంగా మారిన లాక్‌డౌన్

అనుకూలంగా మారిన లాక్‌డౌన్

కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ ఎక్కువైపోతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఇంకా తెరుచుకోకపోవడంతో వినోద ప్రియులంతా టీవీలకే అతుక్కుపోతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే బిగ్ బాస్ షో ప్రసారం అవుతుండడంతో, అందరూ దీన్ని వీక్షిస్తున్నారు. దీంతో గతంలో కంటే ఎక్కువ టీఆర్పీ రేటింగ్‌తో నాలుగో సీజన్ దూసుకుపోతోంది.

బిగ్ బాస్ సంచలన నిర్ణయం..!

బిగ్ బాస్ సంచలన నిర్ణయం..!

బయట పరిస్థితులు సరిగా లేని కారణంగా ఈ సారి హౌస్‌లోకి కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులను రానివ్వకపోవచ్చని జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయంలో షో నిర్వహకులు సైతం ఇదే తరహా నిర్ణయం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ, ఊహించని విధంగా దీనిపై బిగ్ బాస్ యూనిట్ సంచలన నిర్ణయం తీసుకుందని మంగళవారం జరిగిన ఎపిసోడ్ ద్వారా అర్థం అయింది.

అందరిలో ఒకే రకమైన సందేహం

అందరిలో ఒకే రకమైన సందేహం

బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో కొందరు ఇంటి సభ్యులు హౌస్‌లోకి ఎంటర్ కాబోతున్నారు. వారిలో అఖిల్ సార్థక్, అభిజీత్, దేత్తడి హారిక, అవినాష్‌ల తల్లలు ఉన్నారు. అలాగే, గురువారం మరికొందరు ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలుస్తోంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో బయటి వాళ్లను ఇంట్లోకి ఎందుకు రానిస్తున్నారన్న సందేహం అందరిలో కలుగుతోంది.

కరోనా ప్రభావంతో కీలక మార్పులు

కరోనా ప్రభావంతో కీలక మార్పులు

గతంలో జరిగిన సీజన్లలో బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు సాదాసీదానే తిరిగేవారు. అయితే, ఈ సారి మాత్రం ఈ విషయంలో కీలక మార్పులు చేశారని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. ఇంట్లోకి వచ్చే వారందరూ ఓ బోర్డర్ దాటి లోపలికి రాకూడదని బిగ్ బాస్ ఆదేశించాడట. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X