twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss unseen: మోనాల్ ముందే హారికతో అఖిల్ రొమాన్స్.. సున్నుండలతో అరియానాకు గాలం!

    |

    బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌కు సంబంధించిన తొలి ఫైనల్‌లోకి వెళ్లిన అఖిల్‌ సార్థక్ ఇంటిలో చిల్ అవుతున్నాడు. అమ్మాయిలతో మరింత రొమాంటిక్‌గా వ్యవహరిస్తూ కనిపిస్తున్నారు. అరియానా, హారికను పదే పదే కౌగిలించుకొంటూ నాటుగా కనిపించాడు. ఇంటిలో నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత అరియానా, అఖిల్, హారికకు అఖిల్ మధ్య జరిగిన సంభాషణ, వారి కెమిస్ట్రీ ఇలా ఉంది..

    హారిక భుజంపై ముద్దులు పెడుతూ

    హారిక భుజంపై ముద్దులు పెడుతూ

    ఇంటిలోని కిచెన్ శుభ్రం చేసే పని విషయంలో అఖిల్‌‌తో హారిక మాట్లాడుతూ.. నీవు కిచెన్ క్లీన్ చేయి. లాస్ట్ వీక్ నువ్వు ఏమీ పనిచేయలేదు అంటూంటే.. వెనుక నుంచి వచ్చి గట్టిగా కౌగిలించుకొన్నాడు. భుజంపై ముద్దులు పెడుతూ రొమాంటిక్‌గా ఫీల్ అయ్యాడు. ఆ పక్కనే ఉన్న మోనాల్ వారిద్దరి కెమిస్ట్రీని ఒక విధంగా చూస్తూ కనిపించింది.

    90 రోజులపాటు అలిసిపోయా

    90 రోజులపాటు అలిసిపోయా

    తనతో రొమాంటిక్‌గా ఉన్న అఖిల్‌ను ఉద్దేశించి పని తప్పించుకోవడానికి బాగానే చేష్టలు చేస్తున్నావు అంటూ కామెంట్ చేసింది. దాంతో ఇంత చెత్తనా? 90 రోజుల నుంచి పని చేసి చేసి అలసిపోయాను అంటూ అఖిల్ సమాధానం ఇచ్చాడు. దాంతో జిమ్‌లో భారీగా వెయిట్ ఎత్తే నీవు.. కిచెన్‌లో చిన్న ప్లేస్‌ను క్లీన్ చేయడానికి కష్టమా అంటూ హరిక ఝలక్ ఇచ్చింది.

    అరియానాతో సున్నుండలు అంటూ

    అరియానాతో సున్నుండలు అంటూ

    ఇక కిచెన్‌లోకి వచ్చిన అరియానాను ఫ్లర్ట్ చేసేందుకు అఖిల్ ప్రయత్నించాడు. సున్నుండలు చేస్తున్నా రా అంటే.. నాకు ఇష్టం ఉండదంటూ సమాధానం ఇచ్చింది. అయితే మొన్న ఎందుకు తిన్నావు అంటూ.. అడిగితే.. బరువు పెరుగుతున్నానంటూ కామెంట్ చేసింది. ఎంత పెరిగావంటే నాకు తెలియదు.. కొలవలేదు అంటూ కామెంట్ చేస్తుంటే దగ్గరికి వచ్చి కౌగిలించుకొన్నాడు.

    Recommended Video

    Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Slams Trollers
    నేను ఫ్లర్టింగ్ చేస్తే నెక్ట్స్ లెవెల్

    నేను ఫ్లర్టింగ్ చేస్తే నెక్ట్స్ లెవెల్

    ఇక అఖిల్ ఫ్లర్టింగ్‌ను చూసి.. నేను కూడా నా మాటలతో బట్టలోకి వేసుకోవడం తెలుసు. నేను చేస్తే మరో లెవెల్ ఉంటుంది. కానీ నేను ఫ్లర్టింగ్ చేస్తే మరోలా తీసుకోకుండా ఉంటే ఓకే.. వేరే రకంగా తీసుకొంటారంటే నేను అలాంటి వ్యవహారాన్ని తగ్గించేస్తాను అని అెఖిల్ మాట్లాడుకొంటూంటే మధ్యలో మోనాల్ దూరింది. నేను కూడా బాగా ఫ్లర్ట్ చేస్తాను అంటూ మోనాల్ కామెంట్ చేసింది.

    English summary
    Bigg Boss unseen in 92 day: Akhil Sarthak romance with Harika Dettadi and Ariana Glory in BIgg Boss Telugu 4 in front of Monal Gajjar. Akhil is trying to heart both Harika and Ariana Glory.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X