Bigg Boss Unseen మైండ్ పాడు చేయకు.. ఎలిమినేటైతే నువ్వే.. సుజాత, అరియానా ఫైట్
బిగ్‌బాస్ ఇంటిలో ఐదోవారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియపై ఇంకా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా అరియానా గ్లోరి, జోర్దార్ సుజాత మధ్య వాగ్వాదం గట్టిగానే జరిగింది. నామినేషన్ విషయంలో తన అభిప్రాయాన్ని సుజాత సమర్ధించుకోనే ప్రయత్నం చేస్తే.. అందుకు అరియానా అభ్యంతరం వ్యక్తం చేసింది. అరియానా, సుజాత, యాంకర్ లాస్య మధ్య చర్చ ఇలా సాగింది.

అరియానా, లాస్య, సుజాత ముచ్చట్లు
అరియానాతో యాంకర్ లాస్య మాట్లాడుతూ.. ఇంట్లో ముందుగా నీతో నాకు పెద్దగా పరిచయం జరగలేదు అని అన్నారు. యాంకర్ దేవీతో నేను మాట్లాడుతున్న సందర్భంలో నీవు కూడా తరచుగా డిస్కషన్‌లో కలవడంతో మీతో నాకు చాలా ర్యాపో పెరిగింది. అలా అప్పటి నుంచి మనం క్లోజ్ అయ్యాం అని లాస్య అనడంతో అవును అక్క.. దేవీ కారణంగానే మన మధ్య పరిచయం ఎక్కువైంది అని అరియానా అన్నారు.

నామినేట్ చేయడం కర్టెక్టే
ఇక నామినేట్ చేయడంపై అరియానాతో సుజాత మాట్లాడుతూ.. నాకు ఉన్న క్లారిటీతో నిన్ను నామినేట్ చేయడం కరెక్ట్ అనిపించింది. ఆ సమయంలో నేను తీసుకొన్న నిర్ణయం కరెక్ట్ అని భావించాను. నీవు ఒకదానికి ఫిక్స్ అయితే నేను ఒకదానికి ఫిక్స్ అయ్యాను. ఆ విషయంలో నేను బాధపడటం లేదు. అందుకే నేను నా వెర్షన్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అని సుజాత అన్నారు.

నామినేషన్ల గురించి చర్చ వద్దు
కిచెన్‌లో జరిగిన విషయం గురించి ఇప్పుడు చర్చించవద్దు. నామినేషన్ గురించి ఇప్పుడు మాట్లాడొద్దని బిగ్‌బాస్ చెప్పారు. కాబట్టి దాని గురించి మాట్లాడకూడదు. బిగ్‌బాస్ తర్వాత కెప్టెన్ నిర్ణయాన్ని నేను పాటిస్తాను. కెప్టెన్ చెప్పిన విషయాలను అనుసరిస్తాను. ఆయనకు ఎదురు చెప్పను. నీలా నేను చీల్చి చెండాడను. కాబట్టి నేను ఆ విషయంలో నిన్ను వ్యతిరేకించాను. ఇప్పుడు ఈ విషయాలు చెప్పి నా మైండ్ ఖరాబు చేయకు. నీ వల్ల నేను బయటకు పోతే అందుకు చాలా బ్యాడ్‌గా ఫీలవుతాను అని అరియానా సీరియస్ కామెంట్ చేసింది.
Recommended Video

కావాలంటే నన్ను నామినేట్ చేసుకో
అరియానా చెప్పిన విషయంలపై సుజాత స్పందిస్తూ.. ఇక ముందు నామినేషన్ చేయాలంటే నన్ను చేసుకో. నా విషయంలో హర్ట్ అయితే నేనేమి చేయలేను. నీ విషయంలో ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తే.. ఆ విషయంలో విఫలమవుతున్నాను. అసలు కారణాలు చెప్పడంలో నేను సక్సెస్ కాలేదు అని సుజాత ఆవేదన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











