Bigg Boss Unseen నీ లైఫ్‌లో ఒకరున్నారని గుర్తుంచుకో.. హాగ్స్‌తో అరియానా, అవినాష్ రొమాన్స్
ఇంటిలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అరియానా గ్లోరికి, అవినాష్ మధ్య చిన్న చిలిపి గొడవ చోటుచేసుకొన్నది. టాస్కు కేటాయించడంలో నీవు మరొకరి నిర్ణయంతో ప్రభావం చెందుతున్నావు. దాని వల్ల నాకు ఇబ్బందిగా మారింది. నాకు నచ్చిన పనిని వేరే వాళ్లకు కేటాయించడం వల్ల నేను కంఫర్ట్‌గా లేను అని అవినాష్ తన భావాలను అరియానాతో పంచుకొన్నారు. వారి మధ్య సంభాషణ ఎలా సాగిందంటే..

నాకు కంఫర్ట్ ముఖ్యం అంటూ అరియానా
అవినాష్ మాటలకు అడ్డుపడుతూ కెప్టెన్‌గా నా నిర్ణయమే ఫైనల్. నాకు కంఫర్ట్‌గా ఉండాలనే చూసుకొన్నాను. నీవు కావాలనుకొన్న పనిని మెహబూబ్‌కు ఇస్తే బాగా చేస్తాడని అనుకొన్నాను. నీ కంటే బాగా చేస్తాడని నమ్మకం ఉండటం వల్లే నేను నీకు ఆ పనిని అప్పగించలేదు. నీకు కంఫర్టు ఉండే జాబ్‌నే నేను ఇచ్చాను అనుకొంటున్నాను అని అరియానా చెప్పింది.

నీ జీవితంలో మరో వ్యక్తి ఉన్నాడని..
బిగ్‌బాస్‌లో గేమ్ ఆడటానికి వచ్చామనే విషయాన్ని గుర్తు పెట్టుకో. ఇతరుల వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ చెందవద్దు. నీ జీవితంలో మరో వ్యక్తి ఉన్నాడనే విషయాన్ని గుర్తు చేసుకో అని అవినాష్ సలహా ఇస్తే.. అలా మాట్లాడితే బయటకు రాంగ్ వే లో వెళ్తుంది. ఇంటిలో ఒక్కొక్కరితో ఒక్క రిలేషన్ ఉంది. మెహబూబ్‌తో ఒకరకంగా, మెహబూబ్‌తో ఒకరకంగా ఉంటుంది. మరొకరతో బ్లషింగ్ మూమెంట్స్ ఉంటాయి. అంతేకానీ ఇన్‌ఫ్లెయెన్స్ అవుతున్నాననంటే ఒప్పుకోను అని అరియానా చెప్పింది.

నీతోనే నాకు కంఫర్ట్ అంటూ
ఇక ఇలా హాట్ హట్‌గా డిస్కషన్ జరిగిన తర్వాత రాత్రి ఒంటరిగా నిలబడి.. నాకే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అంటూ మనసులో గొణుక్కొంటుండగా అరియానా అక్కడికి వచ్చింది. దాంతో సారీ.. నేను కంఫర్ట్ అనే విషయంలో ఏదైనా బాధపడితే అంటూ అరియానాతో అన్నాడు. ఇక నుంచి ఫ్రెండ్స్ అంటూ చేతులు చేతులు కలిపారు. ఆ తర్వాత ఫ్రెండ్‌గా నాకు నీతో కంఫర్ట్ ఉంది. నీ తర్వాతే ఎవరైనా.. కానీ కెప్టెన్‌గా అందరూ నాకు ముఖ్యం అంటూ అరియానా చెప్పింది. దాంతో వారిద్దరూ కౌగిలిచుకొని నడుచుకొంటూ వెళ్లారు.

కౌగిలించుకొని సారీ చెప్పు అంటూ
ఆ తర్వాత సీన్ ఇంటిలోకి మారింది. మోనాల్, అమ్మా రాజశేఖర్‌తో అవినాష్ ఉండగా, అరియానా అక్కడికి రాగా.. నాతో ఎందుకు గొడవ పడుతున్నావో అర్థం కావడం లేదు. నాకు సారీ చెప్పు అంటూ అరియానాను అవినాష్ అడిగాడు. అందుకు సారీ అని చెప్పింది. నేను నీకు ఇలానే సారీ చెప్పానా? హగ్ ఇచ్చి చెప్పలేదా? అంటే ఏదో మొక్కుబడిగా అరియానా హగ్ ఇచ్చింది. అయితే అలా నేను హగ్ ఇవ్వలేదుగా అంటే.. వచ్చి గట్టిగా కౌగిలించుకొన్నది. ఈ సీన్ చూసి మోనాల్, అమ్మా రాజశేఖర్ ఇద్దరు నవ్వుకుంటూ కనిపించారు.

మోనాల్, అరియానా, అవినాష్ కలిసి
ఆ తర్వాత మోనాల్‌ను పిలిచి కౌగిలించుకొందాం రా అని పిలిచింది.. దాంతో అవినాష్, అరియానా, మోనాల్ కలిసి కౌగిలించుకొన్నారు. అవినాష్, మోనాల్ పక్కపక్కనే కూర్చొంటే మధ్యలో అరియానా దూరింది. నన్ను మోనాల్ పక్కన కూర్చోనివ్వు అంటూ అవినాష్ గోలపెట్టాడు. అలా అమ్మా రాజశేఖర్, అవినాష్, మోనాల్, అరియానా నలుగురు కలిసి గుంపుగా కౌగిలించుకొన్నారు. అరియానా నా ఫ్రెండ్.. ప్రిన్సెస్.. మై డెవిల్ అంటూ అరియానాను అవినాష్ దగ్గరగా తీసుకొన్నాడు.


Click it and Unblock the Notifications











