Bigg Boss Unseen: నీవేమైనా కొత్త పెళ్లి కొడుకువా? ముక్కు అవినాష్‌కు అరియానా మొట్టికాయ

బిగ్‌బాస్ ఇంటిలో అరియానా గ్లోరి, అవినాష్‌ చిలిపితనం 89వ రోజు ఎపిసోడ్‌లో హైలెట్‌గా నిలిచింది. నిస్తేజంగా సాగుతున్న ఎపిసోడ్‌కు వీరిద్దరు అందించిన వినోదం కాస్త ఉపశమనం కలిగించింది. ఇంటిలో వారిద్దరూ పాటలు పాడుతూ.. అలాగే వినోదాన్ని పంచుతూ రోడ్ టూ ఫినాలే టాస్క్ వల్ల కలిగిన టెన్షన్ నుంచి రిలీఫ్ అయ్యారు. అరియానా, అవినాష్ ఇద్దరి అల్లరి ఇలా సాగింది..

ఎన్నెన్నో జన్మల బంధం అంటూ

ఎన్నెన్నో జన్మల బంధం అంటూ


అఖిల్, సోహెల్ టాస్క్ ఆడుతుండగా.. అభిజిత్ కోరికపై అరియానా, అవినాష్ పాట అందుకొన్నారు. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అంటూ అఖిల్, సోహెల్‌ను ఉడికిస్తూ పాటపడారు. టాస్క్ ఆడుతున్న ఇద్దరు వీరి పాటకు సిగ్గుపడుతూ కనిపించారు. అయినా అలానే అరియానా, అవినాష్ పాటను పాడుతూ హుషారు పెంచారు.

అభిజిత్‌కు అంకితం అంటూ

అభిజిత్‌కు అంకితం అంటూ


అభిజిత్ 1116 చదివించినందుకు ధన్యవాదాలు. వారికి ఈ పాటను అంకితం చేస్తున్నామంటూ అవినాష్ అన్నారు. దాంతో వీళ్ల లొల్లి మామూలుగా లేదంటూ అభిజిత్ కామెంట్ చేశాడు. దీంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

నీవేమైనా పెళ్లి కొడుకువా?

నీవేమైనా పెళ్లి కొడుకువా?


ఇక అరియానా, అవినాష్ టాపిక్ టాస్క్‌పైకి వెళ్లింది. టాస్క్ జరుగుతున్న సేపు ఇంటిలోని లైట్లను ఆర్పివేయం. టాస్క్ ముగిసేంత వరకు ఎవరూ నిద్రపోకూడదు అంటూ బిగ్‌బాస్ ఆంక్షలు విధించారు. దాంతో ఇంటి సభ్యులు చలిలో వణుకుతూ దుప్పట్లు కప్పుకొని కనిపించారు. ఓ దశలో లాన్‌లో కింద పడుకొని అవినాష్ నిద్ర పోతుంటే.. నీవేమైనా కొత్త పెళ్లికొడుకువా అంటూ అరియానా మందలించింది.

నిద్ర వేస్ట్ చేసుకోవడం అవసరమా?

నిద్ర వేస్ట్ చేసుకోవడం అవసరమా?

బిగ్‌బాస్ నిద్ర పోవద్దని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ అరియానా మాటల్లో మునిగిపోయింది. ఎవరైనా ఒకరే గెలుస్తారు. ఎవరో ఒకరు దిగిపోతే సరిపోతుంది కదా.. ఇంత నిద్ర వేస్ట్ చేసుకోవడం అవసరమా? ఎవరు గెలిచినా టాప్ 5 ఉంటారు అని అరియానా, అవినాష్ మాట్లాడుకొంటూ కనిపించారు.

ఉయ్యాల ఊగడం ఆగితే...

ఉయ్యాల ఊగడం ఆగితే...

ఏదైనా తప్పు జరిగితే నేను ప్రశ్నిస్తా. మనం వెళ్లి ఒకరు కాలు కింద పెట్టమని చెప్పడం తప్పు. ఒకరి భవిష్యత్తుకు సంబంధించిన విషయం అది. ఉయ్యాల ఊగడం ఆగిపోతే నేను గట్టిగా అడుగుతా. కాబట్టి ఆటను చూస్తూ ఉండాల్సిందే అని అరియానా చెప్పుకొచ్చింది అని అరియానా, అవినాష్ మాట్లాడుకోవడం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X