Bigg Boss Unseen: ఏందీ భాధ.. నాకు బ్యాడ్ టైమ్.. అఖిల్ తీరుతో మోనాల్ మరోసారి కంటతడి
బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ ముగిసిన తర్వాత అఖిల్ ప్రవర్తనతో మోనాల్ గజ్జర్ ఒక రకమైన ఇబ్బందికి గురైంది. హారికకు సపోర్ట్ చేయడంపై ఆగ్రహంతో ఉన్న అఖిల్.. మోనాల్‌ను కొంచెం దూరం పెడుతూ ముభావంగా కనిపించాడు. ఓ దశలో ఎమోషనలై కిందకూడా పడిపోయాడు. అఖిల్ ఎమోషనల్ కావడంతో సోహైల్ కూల్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో మోనాల్ ఎమోషనల్ అవుతూ..

మోనాల్ గజ్జర్‌పై అఖిల్ కోపంగా
కెప్టెన్సీ టాస్క్‌లో ఓడిపోయాక అఖిల్ కొంత మనస్తాపానికి గురయ్యాడు. మోనాల్ తనకు సపోర్ట్ చేయలేదనే విషయంపై అలిగాడు. ఆ సమయంలో మోనాల్ తన వద్దకు వస్తే నాకు మాట్లాడే మూడ్ లేదు. తర్వాత మాట్లాడుకొందాం అంటూ ముఖం మీదే చెప్పేశాడు.

బ్యాడ్ ఫీలింగ్ అంటూ...
అఖిల్ తీరుతో మోనాల్ బాధపడుతూ లాన్‌లో కూర్చొని తనలో తాను మట్లాుకొన్నది. నీవ్వు స్ట్రాంగ్. నువ్వు సూపర్ స్ట్రాంగ్, సూపర్ డూపర్ స్ట్రాంగ్ తనకు తాను ప్రశంసించుకొంటూ కనిపించింది. ఎందీ బాధ.. బాధ కాదు కొంచెం బ్యాడ్ ఫీలింగ్ అంటూ మోనాల్ తనకు తాను సర్ది చెప్పుకొన్నది.

అఖిల్‌కు ప్రతీసారి సపోర్ట్ చేస్తూ
ఎందుకు బ్యాడ్ ఫీలింగ్ అంటే.. నా టైమింగ్ బాగాలేదు. కెప్టెన్సీ పోటీకి నేను ఎక్కసారి కూడా నాకు అవకాశం రాలేదు. అఖిల్ కోసం ప్రతీసారి సపోర్ట్ చేస్తుంటాను. కానీ అతడి మైండ్‌లో ఏమీ ఉన్నదో తెలియడం లేదు. కెప్టెన్సీ టాస్క్‌లో ఓడిపోయాడు. అతడికి కెప్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అని భావించాడు. కానీ నా గేమ్ నేను ఆడాలి కాదా అంటూ మోనాల్ అన్నారు.

హారికకు సపోర్టు చేసి తప్పు చేయలేదు
నేను టాస్క్ ఆఢితే 100 శాతం ఇస్తాను. ఎవరికైనా సపోర్ట్ చేస్తే నేను పూర్తిగా, నిజాయితీగా ఉంటాను. హారికకు ఫుల్ సపోర్ట్ చేసి నేను తప్పు చేయలేదు. నాతో ఎందుకు మాట్లాడలేదు. అఖిల్ ప్రతీసారి చిన్నపిల్లాడిలా బిహేవ్ చేస్తుంటాడు అంటూ మదనపడి పోతుంటే అఖిల్ తన వద్దకు వచ్చాడు.
Recommended Video

మీ చెల్లెలు చెప్పినట్టే చేస్తున్నావా? అంటూ అఖిల్
మోనాల్ నువ్వేమైనా తిన్నవా? అని అఖిల్ అడిగితే.. బ్రెడ్ తిన్నాను అని సమాధానం ఇచ్చింది. ఏంటీ నీ చెల్లెలు డైటింగ్ చేయమంటే బ్రెడ్ తింటావా? కేవలం జ్యూస్ మాత్రమే తాగుతున్నావు అంటూ ప్రేమను చూపించాడు. అయితే నాకు బాగాలేదు. నేను ఏమి తినను అంటూ.. మరో బ్రెడ్ ముక్క తిను అంటూ అఖిల్ కిచెన్‌లోకి వెళ్లాడు. దాంతో ఈయన చూస్తే అర్ధం కాదు. ఏమని కంప్లయింట్ చేయాలో అర్ధం కాదు అంటూ మోనాల్ కామెంట్ చేసింది.


Click it and Unblock the Notifications











