ఫాల్స్ ప్రామిస్ చేయకు.. మరొకరితో చనువుగా ఉండటం నచ్చదు.. మోనాల్‌కు అఖిల్ ఝలక్

బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్ ముగింపు దశకు చేరుకొంటుండగా ఇంటి సభ్యుల్లో భావోద్వేగాలు బయటకు వస్తున్నాయి. 93వ రోజున ఇంటిలో జరిగిన టాస్కుల సందర్భంగా ఇంటి సభ్యుల్లో పలు కోణాలు కనిపించాయి. రూలర్, రోబో టాస్క్ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య ఏం జరిగిందంటే...

రూలర్స్ టాస్క్ సమయంలో

రూలర్స్ టాస్క్ సమయంలో

సోమవారం రోజున మొదలైన రూలర్ టాస్క్‌ మంగళవారం కూడా కొనసాగింది. అరియానా గ్లోరి, మోనాల్ రూలర్స్‌గా వ్యవహరించారు. అరియానా, మోనాల్ రూలర్‌గా అంటే రాణులుగా వ్యవహరిస్తూ ఇంటి సభ్యులకు టాస్క్ ఇచ్చారు. వాటిని ఇంటి సభ్యులు పూర్తి చేసి రాణులను, ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు.

సోహెల్ మరింత ఎమోషనల్‌గా

సోహెల్ మరింత ఎమోషనల్‌గా

అరియానా ఇచ్చిన టాస్క్ ఇంటి సభ్యుల్లో భావోద్వేగాలను పంచింది. ఇంటిలో తమకు నచ్చిన వస్తువులను ఇంటి సభ్యులకు ఇచ్చి వారితో ఎమోషన్స్ పంచుకోవాలని చెప్పారు. సోహెల్ తనకు నచ్చిన తన వస్తువులను ఒక్కొక్కరికి ఇచ్చి తనకు వారితో ఉన్న అనుబంధాన్ని చెప్పారు.

అరియానాకు గోల్డెన్ మౌత్ పీస్

అరియానాకు గోల్డెన్ మౌత్ పీస్

ఇక రూలర్ టాస్క్ ముగిసిన తర్వాత ఎవరి ఫెర్ఫార్మెన్స్ బాగుందని బిగ్‌బాస్ అడిగిన ప్రశ్నకు మెజారిటీ సభ్యులు అరియానా పేరు చెప్పడంతో గోల్డెన్ మౌత్ పీస్ ఇచ్చారు. దాంతో ప్రేక్షకులకు తనకు ఓటు వేయమని అభ్యర్థించే అవకాశాన్ని అరియానా దక్కించుకొన్నారు. ఆ తర్వాత బిగ్‌బాస్ సూచన మేరకు ప్రేక్షకులను అభ్యర్థిస్తూ ఓటు వేయమని చెప్పారు.

అభిజిత్‌ను టార్గెట్ చేస్తూ

అభిజిత్‌ను టార్గెట్ చేస్తూ

మోనాల్ రాణిగా వ్యవహరించిన సమయంలో ఇంటి సభ్యులతో గేమ్స్ ఆడించారు. అభిజిత్‌ను నాకు కాఫీ చేసుకురమ్మని అడుగగా.. నాపై కక్ష తీర్చుకొంటున్నావా అంటూ ఆయన కిచెన్‌లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నేను బాగానే ఆడించానా? అంటే అఖిల్ ఒకే అన్నాడు.

Recommended Video

Niharika Konidela wedding Saree Speciality
బెస్ట్ ఫ్రెండ్.. ఫ్రెండ్‌కు తేడా అదే..

బెస్ట్ ఫ్రెండ్.. ఫ్రెండ్‌కు తేడా అదే..

ఆ తర్వాత అఖిల్‌తో సంభాషణను కొనసాగిస్తూ.. నాకు ఇప్పటి వరకు చెప్పని విషయాన్ని చెప్పు అంటే.. నిన్ను ఎవరైనా అసహ్యించుకొన్నా నీవు మనసు విప్పి మాట్లాడే విషయం నాక బాగా నచ్చుతుంది. సంతోషంలో ఉన్న సమయంలో నీవు చేసే ఫాల్స్ ప్రామిస్ నచ్చవు. అలాంటి పనులు చేయకు. నాతో కాకుండా మరొకరిని ఫ్రెండ్ అంటూ చెప్పడం నాకు నచ్చదు. బెస్ట్ ఫ్రెండ్, ఫ్రెండ్‌కు తేడా ఉంటుంది అంటూ అఖిల్ కామెంట్ చేయడం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X