నీ నోరు దరిద్రపుది రా... నీ నోట నుంచి మాట వస్తే ఎలిమినేషనే.. సోహైల్‌కు మెహబూబ్ పంచ్
అఖిల్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఇంటిలో ఓ రకమైన నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నది. ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయి తమకు తోచిన విధంగా మాట్లాడుకొంటూ కనిపించారు. అఖిల్ బయటకు పోవడంపై సోహైల్ షాక్ గురయ్యాడు. అలాంటి వాతావరణంలో మెహబూబ్‌తో ఆసక్తికరమైన సంభాషణలకు తెర తీశారు. వారు ఏమి మాట్లాడుకొన్నారంటే..

అరియానా గురించి సోహైల్ కామెంట్
సోహైల్, మెహబూబ్ ఓ చోట.. అవినాష్ అరియానా మరో చోట కూర్చొని ఇంటిలో ముచ్చట్లు పెట్టుకొంటూ కనిపించారు. అరియానా, అవినాష్ గురించి సోహైల్ కామెంట్ చేస్తూ.. వారిద్దరి ఏంటో అర్ధమే కాదు అంటూ అన్నాడు. అంతటి ఆగుకుండా ఐదు వేళ్లు చూపించి అరియానా అంటూ కామెంట్ చేశాడు.

ఆ దరిద్రపు నోటితో అనకురా
ఐదు వేళ్లతో సోహైల్ సైగ చేయడంతో ఏంటి.. టాప్ ఫైవ్‌లో అరియానా ఉంటుందా? నీరు నోరు దరిద్రం రా.. ఆ నోటితో అంటే బయటకు పోతున్నారు. మొన్న అమ్మా రాజశేఖర్ మాస్టార్‌తో కూడా నువ్వు టాప్ 5లో ఉంటావు అన్నావు. కానీ ఆయన ఆ వారమే బయటకు పోయాడు. నీ నోరు దరిద్రం రా అంటూ మెహబూబ్ కామెంట్ చేశాడు.

గతవారం మా ఇద్దరిని ఎలిమినేషన్ వరకు
నీవు ఏది చెబితే దానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. గతవారం మా ఇద్దరిని టాప్ 5లో ఉంటావని చెప్పావు.. ఎలిమినేషన్ ప్రక్రియలో చివరగా నేను, మాస్టర్ మిగిలాం. ఇద్దరం కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లి వచ్చాం. నీ నోటితో ఇలాంటి మాటలు అనకురా.. దరిద్రపు నోరు నీది అంటూ నవ్వుల్లో మునిగిపోయారు.

అరియానా తలపైనే ఎక్కువ బాటిల్స్
ఇక 10వ వారం ఎక్కువ మంది అరియానాను నామినేట్ చేయడంపై సోషల్ స్పందిస్తూ.. అన్ని బాటిల్స్ ఆమె తలపై పగిలాయి. కానీ ఆమె టాప్ 5లో ఉంటారు. ఇది కంపల్సరి అంటూ సోహైల్ చెబితే.. నేను ఆమెను తట్టుకోగలనా.. నేను ఆమెకు పోటీ ఇవ్వగలనా అంటూ మెహబూబ్ ఓ ప్రశ్నను వేస్తూ కనిపించారు.
Recommended Video

మూడు గ్రూపులుగా ఇంటి సభ్యులు
ఇక ఇంటిలో అఖిల్ వెళ్లిన తర్వాత ఇంటి సభ్యులు మూడు గ్రూపులుగా విడిపోయారు. అవినాష్, అరియానా ఓ గ్రూపుగా, అభిజిత్, లాస్య, హారిక మరో గ్రూపుగా, సోహైల్, మెహబూబ్ మరో గ్రూపుగా మిగిలిపోయారు. మోనాల్ అన్ని గ్రూపులతో కలిసి కనిపిస్తున్నది. ఇక ఇంటి సభ్యులు మాటలను క్వారంటైన్‌లో వింటూ అప్పుడప్పుడు రెస్పాండ్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











