twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ వారం ఎలిమినేషన్‌లో భారీ సర్‌ప్రైజ్: పండుగ సందర్భంగా రివీల్ చేయనున్న నాగార్జున.!

    By Manoj
    |

    మునుపెన్నడూ చూడని ఎన్నో అంశాలతో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇక్కడి ప్రేక్షకులకు అస్సలు పరిచయం లేని కంటెంట్‌తో రూపొందినప్పటికీ.. ఆకట్టుకునే అంశాలను జోడించి సక్సెస్ అయ్యారు షో నిర్వహకులు. అందుకే మూడు సీజన్లను పూర్తి చేసుకుని, నాలుగో దాన్ని మొదలెట్టారు. ఎన్నో అంచనాల నడుమ ప్రారంభమైన నాలుగో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ప్రియుల కోసం అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారు నిర్వహకులు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

    దాన్ని కంటిన్యూ చేసేలా వ్యూహాలు

    దాన్ని కంటిన్యూ చేసేలా వ్యూహాలు

    గతంలో ఏ ఎపిసోడ్‌కూ రాని రేటింగ్‌తో ప్రారంభం అయింది నాలుగో సీజన్. సెప్టెంబర్ 6న అంగరంగ వైభవంగా సాగిన ప్రీమియర్ ఎపిసోడ్‌తో అక్కినేని నాగార్జున ఇండియన్ టెలివిజన్ రికార్డులనే బద్దలు కొట్టేశాడు. ఆ తర్వాత అదే స్పందనను కంటిన్యూ చేసేలా నిర్వహకులు అదిరిపోయే ప్లాన్లతో ముందుకు వచ్చారు. ఫలితంగా షో మంచి స్పందనతో దూసుకుపోతోంది.

    సరికొత్తగా.. ఎలిమినేషన్‌పై ఆగ్రహం

    సరికొత్తగా.. ఎలిమినేషన్‌పై ఆగ్రహం

    బిగ్ బాస్ నాలుగో సీజన్ సరికొత్త అంశాలతో ఆసక్తికరంగా సాగుతోంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సారి కొత్త టాస్కులు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, లవ్ కహానీలు, మసాలా సీన్లు సహా ఎన్నో జోడించడంతో దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే, ఎలిమినేష్ ప్రక్రియ విషయంలో మాత్రం బిగ్ బాస్‌పై విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు, ఓటింగ్ సిస్టమ్‌పై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

     ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు వీళ్లే

    ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు వీళ్లే

    మొదటి వారం సూర్య కిరణ్, రెండో వారం కరాటే కల్యాణీ, మూడో వారం దేవీ నాగవల్లి, నాలుగో వారం స్వాతీ దీక్షిత్, ఐదో వారం జోర్ధార్ సుజాత, ఆరో వారం కుమార్ సాయి, ఏడో వారం దివి వద్యా, తొమ్మిదో వారం అమ్మ రాజశేఖర్ ప్రేక్షకులు ఇచ్చిన తీర్పుతో షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. గంగవ్వ, నోయల్ సీన్ ఆనారోగ్య కారణంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు.

     ఈ వారం నామినేటైన కంటెస్టెంట్లు

    ఈ వారం నామినేటైన కంటెస్టెంట్లు

    పదో వారానికి సంబంధించి సోమవారం నిర్వహించిన నామినేషన్ ప్రక్రియలో ఆరుగురు సభ్యులు ఎలిమినేషన్ జోన్‌లోకి వచ్చారు. బీరు బాటిల్‌తో జరిపిన ఈ ప్రాసెస్‌లో అభిజీత్, దేత్తడి హారిక, మోనాల్ గజ్జర్, మెహబూబ్ దిల్ సే, సోహెల్ రియాన్, ఆరియానా గ్లోరీ నామినేట్ అయ్యారు. మిగిలిన వారిలో గత వారం ఇమ్యూనిటీ రావడంతో అవినాష్‌ దీని నుంచి తప్పించుకున్నాడు.

    బిగ్ బాస్ ప్రియులకు భారీ సర్‌ప్రైజ్

    బిగ్ బాస్ ప్రియులకు భారీ సర్‌ప్రైజ్

    ఈ వారం మధ్యలోనే అఖిల్ సార్థక్‌ను ఎలిమినేషన్ రూపంలో సీక్రెట్ రూమ్‌లోకి పంపించారు. దీంతో ఈ వారం నామినేట్ అయిన సభ్యుల్లో ఎవరైనా ఎలిమినేట్ అవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వారం ఎలిమినేషన్ విషయంలో ఎవరికి తోచిన విధంగా వాళ్లు చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ఓ న్యూస్ బయటకు వచ్చింది.

    Recommended Video

    Chiranjeevi Tests Positive For COVID-19, Under Home Quarantine | Filmibeat Telugu
     ఆరోజు రివీల్ చేయనున్న నాగార్జున.!

    ఆరోజు రివీల్ చేయనున్న నాగార్జున.!

    దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ వారం ఎలిమినేషన్‌ను బిగ్ బాస్ రద్దు చేసినట్లు తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ విషయాన్ని ఆదివారం ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున రివీల్ చేయనున్నారని తెలుస్తోంది. అలాగే, ఆరోజునే సీక్రెట్‌ రూమ్‌లో ఉన్న అఖిల్ సార్థక్ రీఎంట్రీకి సంబంధించిన ప్రకటన కూడా చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

    English summary
    Noel Sean is an Indian rapper, composer and film actor, currently working in the Telugu film industry. Well known as the first rapper of Tollywood as well as a versatile actor, he has also garnered recognition and appreciation as an independent music producer, television host, Radio Jockey, lyricist and composer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X