బిగ్‌బాస్‌లో మరో లీక్.. ఎవరికి ఎన్నెన్నీ ఓట్లు వచ్చాయంటే.. దీప్తి, తనీష్ బిగ్‌ఫైట్
బిగ్‌బాస్ రియాలిటీలో మరోసారి లీక్ వెలుగు చూసింది. గత కొద్దివారాలుగా ఇంటి నుంచి బయటకు వెళ్తున్నది ఎవరో అనే విషయం ప్రేక్షకులకు ముందే తెలుస్తున్నది. ఎలిమినేషన్ వివరాలు, ఓటింగ్ అంశాలు ముందే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వారం (ఆగస్టు 26) ముగింపు ఎపిసోడ్‌లో కౌశల్, తనీష్, దీప్తి నల్లమోతు, పూజా రాంచంద్రన్ ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. కానీ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన పూజా రాంచంద్రన్ బిగ్‌బాస్ నుంచి అవుట్ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. వివరాల్లోకి వెళితే.
Recommended Video


బిగ్‌బాస్ డాక్యుమెంట్ లీక్
ఎలిమినేషన్ ముప్పు ఎదుర్కొంటున్న కౌశల్, తనీష్, దీప్తి నల్లమోతు, పూజా రాంచంద్రన్‌కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం వరకు పోలైన ఓట్లకు సంబంధించిన డాక్యుమెంట్ ఇంటి నుంచి లీకైంది.

కౌశల్ టాప్.. పూజా చివరిస్థానంలో
లీకైన డాక్యుమెంట్ ప్రకారం కౌశల్ అత్యధికంగా ఓట్లు సంపాదించుకొన్నారు. ఇక రెండో స్థానంలో దీప్తి నల్లమోతు, మూడో స్థానంలో తనీష్, చివరి స్థానంలో పూజా రాంచంద్రన్ నిలిచారు. ఈ ఓటింగ్ ప్రక్రియ చివరి వరకు కూడా అదే స్థాయిలో జరిగినట్టు సమాచారం.

తనీష్‌కు ఘోరంగా ఓట్లు
ఈ వారం నామినేషన్‌లో తనీష్‌కు మద్దతుగా చాలా తక్కువ ఓట్లు షాకింగ్ గురిచేసే అంశం. బిగ్‌బాస్ హౌస్ నిద్రపోవడం, శిక్షకు గురికావడం అనే అంశాలు కౌశల్‌కు ప్రతికూలంగా మారుతున్నట్టు స్పష్టమైంది. అలాగే అనవసరపు వివాదాల్లో వేలు పెట్టడం తనీష్‌కు మైనస్ కావడంతో మూడోస్థానానికి పడిపోవడం జరిగిందనే మాట వినిపిస్తున్నది.

పూజా వైల్డ్ కార్డు ఎంట్రీ
ఇక వైల్డ్ కార్డు ద్వారా ప్రవేశించిన పూజా రాంచంద్రన్ మొదటి వారం బ్రహ్మండంగా రాణించింది. రెండు, మూడు వారాల్లో చాలా డల్ అయిపోయిందని తాజా నానీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆమెకు భాష సమస్య ఎక్కువగా బాధించింది. అంతేకాకుండా కౌశల్‌తో అనవసరం గొడవలు పెట్టుకోవడం ఆమె బయటకు వెళ్లడానికి కారణం కావొచ్చు.

పూజా ఎలిమినేషన్
ఒకవేళ పూజా రాంచంద్రన్ ఎలిమినేషన్ వార్త నిజమైతే అందుకు కారణం ఆమె స్వయంకృతమే. గేమ్ సరిగా ఆడకపోవడం, నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం, ఇతర కారణాలు ఆమెకు ప్రతికూలంగా మారి ఉంటాయి. అంతేకాకుండా పూజా ఎలిమినేషనైతే అందుకు కారణం కౌశల్ ఆర్మీ కూడా ఓ కారణం కావొచ్చు.


Click it and Unblock the Notifications











