వరుణ్ సందేశ్, తమన్నాను జైల్లో పెట్టిన బిగ్‌బాస్.. భోరుమని ఏడ్చిన సావిత్రి
Recommended Video
బిగ్‌బాస్ రియాలిటీ షోలో బుధవారం జాలీగా, పోటీతత్వంతో కూడిన సంఘటనలతోపాటు, విభేదాలు, గొడవలు యదావిధిగా కొనసాగాయి. ఓ టాస్క్ సందర్భంగా సావిత్రి, వరుణ్ మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత మూడు టాస్క్‌లను పూర్తి చేయాలని సూచించాడు. ఈ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచుకొన్నది. ఇంతకు ఇంటిలో ఏం జరిగిందంటే..

మహేష్ విట్టాకు ఫస్ట్ టాస్క్..
హౌస్ యాక్సెరీస్ పొందడానికి బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఒకవేళ ఆ టాస్క్ విజయవంతంగా పూర్తి చేస్తే ఇంటి వస్తువులు ఇస్తారు. అందుకోసం ఒకరిని ఎంపిక చేయాలని సూచించారు. దాంతో మహేష్ విట్టా తాను రెడీ ముందుకువచ్చాడు. ఫిజికల్ టాస్క్ బాయ్స్, లేకపోతే లేడిస్ చేయాలని శ్రీముఖి సూచిస్తే కొందరు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. దాంతో మహేష్ విట్టకు దీపం ఇచ్చి ఆరిపోకుండా చూడాలని ఆదేశించాడు. మహేష్ దీపం పట్టుకోగా, చుట్టూ ఆరిపోకుండా జాగ్రత్తలు తీసుకొన్నాడు.

సావిత్రి వర్సెస్ వరుణ్ సందేశ్
కానీ బిగ్‌బాస్ దీపం చుట్టు ఎవరూ ఉండకూడదని, అది ఆరిపోకుండా ఎవరూ కూడా కవర్ చేయకూడదని బిగ్ బాస్ షాక్కిచ్చాడు. దాంతో వితిక చప్పట్లు కొట్టడంతో సావిత్రి ఫీలై కోపగించుకొన్నది. ఇంటి సభ్యులందరి కోసమే టాస్క్ చేస్తున్నాం. ప్రత్యర్థుల మాదిరిగా ట్రీట్ చేసి చప్పట్లు కొట్టడం ఎందుకని సావిత్రి ప్రశ్నించింది. దాంతో వరుణ్ సందేశ్ మధ్యలో దూరాడు. దాంతో వారి మధ్య గొడవ చోటుచేసుకొన్నది. ఆ గొడవలో తన తప్పు లేకున్నా తనను పాయింట్ చేయడంతో సావిత్రి భోరుమని ఏడ్చింది.

గొడపై పిడకలు కొట్టిన శ్రీముఖి
ఇంటికి అవసరమైన గ్యాస్ కోసం పిడకలు కొట్టే టాస్క్ ఇచ్చారు. ఇందులో శ్రీముఖి, అలీరెజా పాల్గొన్నారు. వారిద్దరూ కలిసి 100కుపైగా పిడకలకు గోడకు కొట్టారు. దాంతో ఆ టాస్క్ వారిద్దరూ విజయవంతగా పూర్తి చేశారు. అనంతరం వాటర్ సైకిల్ తీసివేసేందుకు బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. అక్వేరియంలో ఉన్న 50 కాయిన్స్‌ని బయటకు తీస్తే వాటర్ సైకిల్‌ను తొలగిస్తానని అన్నాడు. ఆ టాస్క్‌ను వితిక సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది.

లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఫినిష్
ఈ మూడు టాస్క్‌లను ఇంటి సభ్యులు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడంతో లగ్జరీ బడ్జెట్ టాస్క్ పూర్తయినట్టు బిగ్ బాస్ ప్రకటించారు. ఇంటి సభ్యులను అభినందించాడు. ఆ తర్వాత బిగ్‌బాస్ ఇంటిలోని హాలులో అందరిని సమావేశ పరిచి ఈ టాస్క్‌లో ఎవరు చెత్త ఫెర్ఫార్మెన్స్ చేసిన ఇద్దరిని ఎన్నుకోవాలని సూచించగా.. తమన్నా, వరుణ్‌లు తాము సరిగా టాస్క్‌లో పాల్గొనలేదని చెప్పాడు.

వరుణ్, తమన్నాలు జైలులోకి..
టాస్క్‌లో సరిగా పార్టీసిపేట్స్ చేయనందున్న ఇద్దరు ఇంటిసభ్యులైన తమన్నా, వరుణ్‌ను తదుపరి ఆదేశాల వరకు జైలులో బంధిస్తున్నట్టు బిగ్‌బాస్ హకుం జారీ చేశాడు. జైలులో వారికి కావాల్సిన వస్తువులను ఇచ్చే బాధ్యతను వితిక తీసుకొన్నది. జైలు ఉండటం ఇష్టంలేని తమన్నా కంటతడి పెట్టుకొన్నది. ఏసీ లేనిది నేను ఉండలేను అంటూ రోదించింది. తమన్నా కంటతడి పెట్టుకోవడంతో శ్రీముఖి ఆమెకు ఓదార్పు ఇచ్చింది.


Click it and Unblock the Notifications











