రొమాన్స్‌లో ముగినిపోయారు.. అవినాష్ అరియానా రచ్చ.. అంతా దానికోసమే?
అవినాష్ అరియానాలు బిగ్ బాస్ ఇంట్లో ఎంత సందడి చేశారో బయటకు వచ్చాక అంతకు మించి అనేలా రచ్చ చేస్తున్నారు. ఈవెంట్లు, స్పెషల్ షోలంటూ దుమ్ములేపుతున్నారు. బిగ్ బాస్ షో కథ ముగిసినా కూడా కంటెస్టెంట్ల హవా మాత్రం కొనసాగుతూనే ఉంది. రోజూ ఏదో ఒక పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటూ ఫాలోవర్లను పెంచుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్లందరూ కూడా ఒకే చోటకు వస్తోన్న సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ ఉత్సవం..
బిగ్ బాస్ ఉత్సవం పేరిట జరుగుతున్న ప్రోగ్రాంను ఫిబ్రవరి 7న సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం చేయబోతోన్నారు. ఈ ఈవెంట్‌లో బిగ్ బాస్ మొత్తం నాలుగు సీజన్ల కంటెస్టెంట్లు పాల్గొనబోతోన్నారు. అయితే ఇందులో మొదటగా నాల్గో సీజన్ కంటెస్టెంట్లకు సంబంధించిన ప్రోగ్రాం రాబోతోన్నట్టుంది.

ప్రోమోల రచ్చ..
బిగ్ బాస్ ఉత్సవం పేరిట బయటకు వస్తోన్న ప్రోమోలు బాగానే క్లిక్అవుతున్నాయి. వాటికి కంటే ముందుగా బిగ్ బాస్ కంటెస్టెంట్లతో షూటింగ్ జరుపుతున్నప్పుడే కొన్ని ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అవి కూడా బాగానే వైరల్ అయ్యాయి. ఇప్పుడు వస్తోన్న ప్రోమోలు మరింత రచ్చ చేస్తోన్నాయి.

అవినాష్ అరియానాలపై..
బిగ్ బాస్ ఉత్సవంలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉండేట్టు కనిపిస్తోంది. బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో ఏవేవీ హైలెట్ అయ్యాయో వాటిని మళ్లీ రీ క్రియేట్ చేయాలని చూశారు. అందులో భాగంగా అరియానా అవినాష్‌ల మధ్య రొమాంటిక్ పర్ఫామెన్స్ ప్లాన్ చేశారు.

క్యూట్ జంటగా..
అరియానా అవినాష్ జోడికి ప్రస్తుతం ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో అవినాష్ అరియానా ఎంత ఎంటర్టైన్ చేశారో బయటకు వచ్చాక కూడా సోషల్ మీడియాలో అంతే సందడి చేస్తున్నారు. అటు కామెడీ స్టార్స్, ఇటు బిగ్ బాస్ ఉత్సవంతో ఇప్పుడు బిజీ బిజీగా ఉన్నారు.

రొమాన్స్‌లో రచ్చ..
అవినాష్ అరియానా మధ్య ఏదో ఉందని క్రియేట్ చేసేలా ఓ రొమాంటిక్ పర్ఫామెన్స్‌ను ప్లాన్ చేశారు. తరగతి గది దాటి అనే పాటకు ఇద్దరూ చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ ప్రోమో తెగ వైరల్ అవుతోంది. ఇక ఇప్పుడు అరియానా తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి గోవాలో రచ్చ చేస్తోంది.


Click it and Unblock the Notifications











