Bigg Boss: కంట్రోల్ తప్పా.. అందుకే పృథ్వితో అలా..

బిగ్ బాస్ బుల్లి తెర పేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసిన ప్రోగ్రాం. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ తో దిమ్మతిరిగే ట్విస్ట్ లు, టర్నులతో దుమ్ము రేగిపోయింది హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్లింది. ఎవరు ఊహించని విధంగా టాప్ 5 లో నిఖిల్, గౌతమ్, అవినాష్, నబిల్, ప్రేరణలు నిలిచారు. అయితే ఇందులో నిఖిల్ బిగ్బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ నిఖిల్ కాగా.. గౌతమ్ రన్నర్ గా నిలిచారు. అయితే..విష్ణు ప్రియ, పృథ్విల వ్యవహార శైలి మాత్రం కాస్త కాంట్రవర్సీగా మారింది. అయితే విష్ణు ప్రియ అలా వ్యవహరించడానికి కారణమేంటో? అసలు విషయాన్ని బయట పెట్టేసింది. ఇంతకీ ఏమన్నదంటే?

విష్ణు ప్రియ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితం. ఆ అమ్మడు తనమాటతీరుతో ఎంతోమందిని అట్రాక్ట్ చేసింది. బిగ్ బాస్ వెళ్ళక ముందుకు బుల్లితెర ఈవెంట్స్ లలో , ప్రోగ్రామ్స్ లలో యాంకర్ గా వ్యవహరిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. అలాగే అడపాదడపా సినిమాలలో, షార్ట్ ఫిలిమ్స్ లలో, వెబ్ సిరీస్ లలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది విష్ణు ప్రియ. ఈ ఫేం తోనే బిగ్ బాస్ సీజన్ 8 లో అడుగుపెట్టింది. తొలుత తన ఆటతీరుతో అందరిని అట్రాక్ట్ చేసి కింగ్ నాగార్జున తోనే బిగ్ బాస్ కళామతల్లిగా గుర్తింపు తెచ్చుకుంది.

Bigg boss Vishnu Priya comments on Bigg Boss and Prithvi

అయితే ఏ సీజన్లో తన కో కంటెస్టెంట్ అయినా పృద్వితో విష్ణు ప్రియ వ్యవహరించిన తీరు కాస్త కాంట్రవర్సీగానే మారిందని చెప్పాలి. అంత ముందుకు ఎప్పుడు మగవారినే చూడలేదన్నట్లుగా.. మగవాసనే తగలలేదు అన్నట్లుగా పృద్వి కోసం విష్ణు ప్రియ ఎంతగానో పరితపించిపోయింది. నిజమైన ఆలుమగలు అయినట్లు పృద్వి పై విష్ణు ప్రియ ప్రేమను కురిపించింది. అప్పుడప్పుడు కాస్త తేడా గాని ప్రవర్తించింది. అందరి ముందు పృద్విని హగ్ చేసుకోవడం, కిస్ చేయడం వంటి పిచ్చి చేష్టలు చేస్తూ నెగిటివ్ ఇమేజిని తెచ్చుకుంది.

అయితే కొంతమంది గేమ్ ప్లాన్ లోనే భాగంగా విష్ణు ప్రియ ఇలా కాంట్రవర్సీగా వ్యవహరించిందనేది మరో వాదన. ఏది ఏమైనా బిగ్ బాస్ గేట్లో ఒక రొమాంటిక్ లవ్ బర్డ్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు పృథ్వి అండ్ విష్ణు ప్రియ. అయితే పృద్వితో అలా వ్యవహరించడానికి ఓ కారణం ఉందంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

విష్ణు ప్రియ మాట్లాడుతూ.. తాను గత రెండేళ్లుగా దైవ చింతనలో ఉంటున్నానని, తనకు కోపం ఎక్కువ అలాగే ఈగో కూడా ఎక్కువ అని చెప్పింది. వాటిని కంట్రోల్ చేసుకోవడానికి తాను ఎంతగానో ప్రయత్నిస్తున్నానని చెప్పింది. సీజన్ 3 నుండి తనకు బిగ్ బాస్ ఆఫర్ వస్తూనే ఉన్నాయని, చివరిగా తన గురువు గారి సలహాతో బిగ్ బాస్ 8 లో అడుగు పెట్టానని వెల్లడించింది. అయితే తాను చేసిన ప్రాక్టీస్ అంతా ఎంతవరకు అప్లై చేయగలననేనది, తనను తాను ఎలా నిరూపించుకోవాలనేది బిగ్ బాస్ లో తనకు తాను పెట్టుకున్న టాస్క్ అని వెల్లడించింది. బిగ్ బాస్ హౌస్ తాను 98 రోజులు ఉన్నానని, ఎంతోమంది తనని అభిమానించాలని అందుకే తాను అన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండగలిగానని చెప్పుకొచ్చింది.

అయితే కొంతమంది ఎపిసోడ్స్ చూడకుండానే తనని ప్రశ్నిస్తున్నారని, అలాగే కోటి రూపాయలు ఇచ్చిన కూడా తాను బిగ్ బాస్ లోకి వెళ్ళనని చెప్పిన వీడియోను ట్రోల్ చేస్తూ తను ఇబ్బంది పెడుతున్నారని చెప్పుకొచ్చింది. అయితే.. తాను బిగ్ బాస్ లోకి వెళ్లడానికి కారణం కూడా వెల్లడించింది. తనకు నేచర్ అంటే చాలా ఇష్టమని బిగ్ బాస్ లోకి వెళ్లి నేచర్ కు తాను దూరంగా ఉండలేనని, అక్కడ ఉండే గడ్డి కూడా ప్లాస్టిక్ వేనని చెప్పుకొచ్చింది. అలాగే తాను లోపల ఉన్నప్పుడు తన గురించి వస్తున్న కామెంట్స్ విని తాను కాస్త బాధపడ్డానని, తన క్యారెక్టర్ ను ఎందుకు అలా విమర్శిస్తున్నారని తనకు తాను పరిశీలించుకున్నారని చెప్పింది.

తనని ఇప్పటికి కూడా ఎంతోమంది ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అని వెల్లడించింది విష్ణు ప్రియ. అయితే పృథ్వి తో అంత క్లోజ్ గా ఉండడానికి గల కారణాలను వెల్లడించింది. కొన్ని సందర్భాలలో తాను కంట్రోల్ తప్పని ఎమోషనల్ గా వీక్ కావడం , జెన్యూన్ గా అక్కడ సపోర్ట్ తనకు లభించలేదని బాధపడింది. బిగ్బాస్ హౌస్ అనేది ఎడారి లాంటిది హౌస్ లో పీరియడ్ వచ్చినప్పుడు, పీరియడ్ రావడానికి ఐదు రోజుల ముందు హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ జరిగేదని, ఆ కారణంగానే అలా ప్రవర్తించానని వ్యవహరించింది. కానీ, తన గ్రౌండ్, తన కాంప్రమైజ్, తన ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంచుకోవాలనేది తన మెయిన్ అజెండాగా పెట్టుకున్నారని, అందుకే తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నించానని వెల్లడించింది విష్ణుప్రియ.

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కాకపోయినా తాను బాధపడటం లేదని, టైటిల్ ని మించిన ప్రేమ తనకు దొరికిందని, తాను ఇప్పటివరకు చేసిన షోలు అన్నిటికంటే బిగ్ బాస్ షో ద్వారా ఎక్కువ ప్రేమ లభించిందని చెప్పుకొచ్చింది. అలాగే తాను పడ్డ కష్టానికి ఫలితం దొరికిందంటూ విష్ణు ప్రియ ఎమోషనల్ అయింది. అలాగే.. తనని తాను పొగుడుకుంటూ తనకు బిగ్ బాస్ షో లాగా మంచి పేరు వచ్చిందని, తన లోపాలను తెలుసుకోవడానికి ఓ వేదిక గా బిగ్ బాస్ గెలిచిందని విష్ణు ప్రియ పేర్కొంది. బిగ్ బాస్ షో ద్వారా విష్ణు ప్రియ కాస్త నెగిటివ్ ఇమేజ్ ను తెచ్చుకున్న వ్యక్తిగతంగా మాత్రం తన రియాల్టీని ఎక్కడ కూడా పోగొట్టుకోలేదు. తాను బయట ఎలా ఉంటుందో.. లోపల కూడా అలానే ఉందనేది అర్థమవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X