ఇక భరించేది లేదు.. పోలీసులను ఆశ్రయించిన బిగ్ బాస్ బ్యూటీ

తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా, రియాలిటీ షోల్లో తన స్టైల్‌తో గుర్తింపు సంపాదించుకున్న విష్ణు ప్రియ (Vishnu Priya)మరోసారి వివాదాల కేంద్రంగా నిలిచారు. ఇటీవల సోషల్ మీడియా, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ కంటెంట్ కారణంగా ఆమెపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై అసత్య ప్రచారం చేస్తూ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ఆమె నేరుగా పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న కొందరు యూట్యూబ్ ఛానెల్స్‌పై విష్ణుప్రియ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 'రోస్టింగ్' పేరుతో తన వ్యక్తిగత జీవితం, వృత్తి గురించి వాస్తవాలను వక్రీకరిస్తూ వీడియోలు రూపొందించారని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో 'సోనాలి' అనే మహిళా యూట్యూబర్‌పై హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో అధికారిక ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

Bigg boss Vishnu Priya Files Police Case Against YouTuber Over Defamation and Online Abuse

ఇటీవల విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ప్రారంభించడం పెద్ద చర్చకు దారితీసింది. కొందరు ఆమె కంటెంట్‌ను విమర్శిస్తూ, అది అసభ్యకరంగా ఉందని ఆరోపించగా, మరికొందరు వ్యూస్ కోసం వ్యక్తిగత దాడులు చేయడం ప్రారంభించారు. ఈ వివాదాన్ని ఆసరాగా తీసుకున్న కొందరు కంటెంట్ క్రియేటర్లు ఆమెపై మరింత ఘాటైన విమర్శలు చేస్తూ వీడియోలు రూపొందించడం, సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. దీంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది.

ఈ నేపథ్యంలో విష్ణుప్రియ స్పందిస్తూ, "ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో ఉన్నందున ప్రేక్షకులను అలరించడం నా బాధ్యత. కానీ దాన్ని వక్రీకరించి నా వ్యక్తిత్వంపై దాడి చేయడం అస్సలు సమంజసం కాదు" అని స్పష్టం చేశారు. తాను తప్పు చేసినప్పుడు విమర్శలను స్వీకరిస్తానని, కానీ తప్పుడు ఆరోపణలు, వ్యక్తిగత అవమానాలు మాత్రం సహించబోనని హెచ్చరించారు.

ముఖ్యంగా మహిళగా ఉండి మరో మహిళపై ఇలాంటి కంటెంట్ చేయడం బాధాకరమని ఆమె అభిప్రాయపడ్డారు. "ఇన్నాళ్లు సహించాను.. ఇక మౌనం వహించను. నా పరువు తీసేలా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను" అని గట్టిగా చెప్పారు. తనపై నెగిటివ్ పబ్లిసిటీ చేస్తూ, రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రచారం చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని ఆమె స్పష్టం చేశారు.

ఈ ఘటనతో సోషల్ మీడియా వినియోగంపై మరోసారి చర్చ మొదలైంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ పేరుతో వ్యక్తిగత దూషణలు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసి వ్యూస్ కోసం కంటెంట్ తయారు చేసే ట్రెండ్‌పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం విష్ణుప్రియ ఫిర్యాదు చేసిన కేసు దర్యాప్తులో ఉండగా, ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X