Bigg Boss Telugu 8: మంటల్లో చేయిపెట్టిన కంటెస్టెంట్.. లేడి కంటెస్టెంట్ ఆరోపణలతో షాకింగ్‌గా!

బిగ్‌బాస్ తెలుగు 8 రియాలిటీ షో రసవత్తరంగా సాగుతున్నది. ఈ షో ఐదో వారంలోకి గ్రాండ్‌గా ప్రవేశించింది. ఇప్పటికే మంచి బజ్‌తో దూసుకెళ్తున్న ఈ షో వివాదాలు, ఎమోషన్స్ హైలెట్‌గా అవుతున్నాయి. ఆటగాళ్ల తీరు అత్యంత వివాదాస్పదంగా మారుతున్నాయి. అయితే తాజాగా ఐదో వారం ఇంటిలో ఉండటానికి అర్హత లేని వ్యక్తి అంటూ జరిగిన నామినేషన్ ప్రక్రియలో తెలుగు హీరో ఆదిత్య ఓం చేసిన ఓ పని అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

నాలుగో వారంలో ఇంటి నుంచి సోనియా ఆకుల బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇంట్లో జరిగిన నామినేషన్ ప్రక్రియ సందర్భంలో గందరగోళం నెలకొన్నది. ఒకరిపై మరొకరు నామినేషన్ వేసుకొంటూ తీవ్ర ఆరోపణలు చేసుకొన్నారు. దాంతో ఓ సందర్భంలో కంటెస్టెంట్ల మధ్య ఘర్షణ వాతావరణ నెలకొన్నది. ఆ సందర్బంగా ఆదిత్య ఓం, ప్రేరణ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Bigg Boss Warning to Aditya Om in 5th Week Nominations of Bigg Boss Telugu 8

ప్రేరణ మాట్లాడుతూ.. టాస్క్‌లలో మీరు కాన్ఫిడెన్స్‌తో ఆడటం లేదు. మీకు ఆ విషయం చెబితే అర్ధం కావడం లేదు. మీరు నేను చెప్పే మాటలు వినడం లేదు అని ప్రేరణ కామెంట్ చేసింది. అయితే నిఖిల్, పృథ్వీనితో నాకు కంపారిజన్ వద్దు. వారు నాకంటే 20 ఏళ్లు చిన్నవాళ్లు. నేను వాళ్లతోపాటు నేను ఫిజికల్‌గా గట్టిపోటీ ఇస్తున్నాను అంటూ ఆదిత్య ఓం డిఫెండ్ చేసుకొన్నాడు.

అయితే నాకు కాన్ఫిడెన్స్ లేకపోవడం కాదు అసలు సమస్య. నేను ఎవరినైనా పొగిడితే.. వాళ్లకు కాంప్లిమెంట్ ఇస్తే తట్టుకోవడం లేదు. అందుకే నాపై మీరు నామినేషన్ వేస్తున్నారు అని ఆధిత్య అన్నాడు. దాంతో మీరు ఏమైనా ఊహించుకోండి. నా నామినేషన్ పాయింట్ ఇదే అంటూ ఆదిత్య ఓం ఫోటోను మంటల్లో వేసి.. మీరు కాన్ఫిడెన్స్ తెచ్చుకొండి అంటూ ప్రశ్నించింది.

Bigg Boss Warning to Aditya Om in 5th Week Nominations of Bigg Boss Telugu 8

దాంతో హార్ట్ అయిన ఆదిత్య ఓం సరాసరిగా మంట వద్దకు వెళ్లి తన కాలుతున్న ఫోటోను చేయిపెట్టి బయట పడేశాడు. ఆ సంఘటనను చూసి ఇంటి సభ్యులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆదిత్య ఓంను మంటల నుంచి దూరంగా పెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈ చర్యను బిగ్‌బాస్ తీవ్రంగా ఖండించాడు. ఇంటిలో ఇలాంటి చేష్టలకు పాల్పడితే తీవ్రమైన పరిణామలు ఉంటాయి. మరోసారి ఏ కంటెస్టెంట్ కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదు అని బిగ్‌బాస్ వార్నింగ్ ఇచ్చాడు.

ఇదిలా ఉండగా, నామినేషన్ ఓటింగ్ తర్వాత ఐదోవారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం ఉన్న వారిని బిగ్‌బాస్ ఎంపిక చేశాడు. అయితే ఇంటిలో చీఫ్‌గా ఉండే వారిని నామినేట్ చేయడానికి అవకాశం లేదు. కానీ ఇంటి సభ్యులకు చీఫ్ నిఖిల్, కిర్రాక్ సీతలో ఒక్కరిని నామినేట్ చేయడానికి పవర్ ఇస్తున్నాను. మీరు ఒకరిని నామినేట్ చేయమని చెప్పారు. దాంతో ఇంటి సభ్యుల్లో మెజారిటీ సభ్యులు నిఖిల్‌ను నామినేట్ చేశారు. దాంతో ఈ వారం మణికంఠ, విష్ణుప్రియ, ఆదిత్య ఓం, నైనిక, నబిల్ ఆఫ్రిది, నిఖిల్ నామినేట్ అయ్యారు అని బిగ్‌బాస్ ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X