అఖిల్, సోహెల్‌కు బిగ్‌బాస్ చివాట్లు.. భోరుమంటూ అరియానా వార్నింగ్
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో జరుగుతున్న రోడ్ టూ ఫినాలే టాస్క్‌లో ఇంటి సభ్యులు మధ్య కోపాలు తాపాలు కనిపించాయి. ఈ టాస్క్‌లో భాగంగా ఇంటి పై నుంచి పూలు పడితే మట్టి గుంటలో నాటాలి. ఎవరి గుంటలో ఎక్కువగా పూలు ఉంటాయో వారు మరో లెవెల్‌కు అర్హత సాధిస్తారు. తక్కువగా ఉన్న వాళ్లు గేమ్ నుంచి అవుట్ అవుతారని రూల్స్ చెప్పారు.

అఖిల్, సోహెల్‌కు వార్నింగ్
అయితే పూలను సేకరించిన అఖిల్, సోహెల్ తమ బనియన్‌లో దాచుకోవడంపై బిగ్‌బాస్ చివాట్లు పెట్టారు. ఇది వ్యక్తిగతమైన గేమ్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. సేకరించిన పూలను పూలతొట్టిలో నాటాలని సూచించారు. దాంతో వారిద్దరూ తమ బనియన్స్‌లో నుంచి పూల మొక్కలను తీసి మట్టిలో నాటారు.

మాకు అలా అన్యాయం..
దాంతో నిన్నటి గేమ్‌లో ఈ విషయం చెప్పరా మీరు? మాకు అన్యాయం చేస్తారా? ఒకరికి ఒక రకంగా మరోకరికి మరో రకంగా గేమ్ రూల్స్ విధిస్తారా? అంటూ భోరుమని అరియానా ఏడ్చింది. దాంతో అరియానాను ఓదార్చాడు. తమకు అన్యాయం జరుగుతుందని చెప్పినా మీరు నిన్న స్పందించలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

నా పెయిన్ మీకు తెలుసా?
మీరు సరిగా గేమ్స్ రూల్స్ పాటించడం లేదు. మీకు నా బాధ అర్ధం కావడం లేదు. నా గుండెలో ఉన్న పెయిన్ మీకు తెలుసా. ఈ గేమ్ కోసం నేను ఎంతగా ప్రాణం పెడుతానో మీకు తెలియదు అంటూ అరియానా కామెంట్ చేసింది. అలా మనస్తాపం చెందిన అరియానాను ఓదార్చేందుకు అవినాష్ ప్రయత్నించాడు.
Recommended Video

బిగ్‌బాస్‌కు అరియానా వార్నింగ్
బిగ్‌బాస్‌పై అరియాన ఓ దశలో అరియానా హెచ్చరించింది. ఇది మీ మీద బాధతో చెబుతున్నాను. ఇది మీ కోసం మాత్రమే. బయటకు ప్రసారం చేయవద్దు అంటూ అరియానా, అవినాష్ తమ బాధను చెప్పుకొన్నారు. అలా అరియానా, అవినాష్ బిగ్‌బాస్ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











