Bigg Boss Telugu 6: గీతూ, ఫైమా, ఇనయాకు బిగ్ బాస్ వార్నింగ్.. బాత్రూమ్ లో చేసింది అందరిముందు చేయాలంటూ

బిగ్ బాస్ తెలుగు 6 రియాలిటీషో నాలుగో వారం నామినేషన్లు హోరెత్తిపోయాయి. ఈ నామినేషన్లలో ఇంటి సభ్యులందరూ ఇనయా సుల్తానాను టార్గెట్ చేశారు. ఇనయాను నామినేట్ చేసిన మెరీనా అండ్ రోహిత్ వచ్చి ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక నామినేషన్ల తర్వాత వచ్చేది కెప్టెన్సీ కంటెండర్లకు ఎంపిక చేసే టాస్క్. ప్రతి సీజన్ లో మాదిరిగానే ఈ 6వ సీజన్ లో కూడా హోటల్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ ఫన్నీగా ఎవరీ స్ట్రాటజీస్ తో గేమ్ ఆడారు. ఈ టాస్క్ లో భాగంగా ఫైమా, ఇనయా సుల్తానాకు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకా బిగ్ బాస్ తెలుగు 6 సెప్టెంబర్ 27 మంగంళవారం ప్రసారమైన 23వ రోజు 24వ ఎపిసోడ్ వివరాళ్లోకి వెళితే..

కెమెరాలు ఫోకస్ అయ్యేలా..

కెమెరాలు ఫోకస్ అయ్యేలా..

బిగ్ బాస్ తెలుగు 6 నాలుగో వారం నామినేషన్ల పర్వం తర్వాత ఇనయాను నామినేట్ చేసిన మెరీనా అండ్ రోహిత్ వచ్చి ఓదార్చే ప్రయత్నం చేశారు. ఎప్పటిలానే శ్రీహాన్ ఒక్కడే పడుకుని బయటకు మాట్లాడుకుంటూ షో చేశాడు. నిజానికి, ఎవరైనా సరే మనసులో మాట్లాడుకుంటారు. కానీ శ్రీహాన్ మాత్రం మైక్ లో వినిపించేలా, కెమెరాలు ఫోకస్ అయ్యేలా పైకి మాట్లాడుతుంటాడు. ఈ నామినేషన్స్ ఏంటో.. ఒకడేమో ఏం మాట్లాడతాడే వాడికే తెలియదు.

మరోసారి అలకలతో ఆరోహి, సూర్య

మరోసారి అలకలతో ఆరోహి, సూర్య

ఈమె (ఇనయ) ఏమో.. అన్నది ఒకటి అయితే నానార్థాలు, పర్యాయపదాలు తీస్తుంది. నా వయసు తక్కువ అని నేను చెప్పుకుంటే నాకు ఏజ్ ఎక్కువనా, బాడీ షేమింగ్ అంటుంది. ఈమెకు ఆస్కారు ఇచ్చిన తక్కువే అంటూ ప్రేక్షకుల మెప్పు పొందేందుకు మాట్లాడిని మాటల్లా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఆరోహి రావు, సూర్య మరోసారి అలకలతో కనిపించారు. స్టోర్ రూమ్ లో పెట్టిన ముచ్చట్లు సిల్లీగా ఉన్నాయి. మ్యాటర్ ఉన్నట్లు ఏం అనిపించదు. కానీ వీళ్లు మాత్రం అలకలు మొదలుపెడతారు.

నువ్ ఇచ్చే మార్క్ ఎప్పటికీ అలానే ఉంటుంది..

నువ్ ఇచ్చే మార్క్ ఎప్పటికీ అలానే ఉంటుంది..

ఆ తర్వాత ఆరోహి రావు మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత ఫోకస్.. ఫోకస్.. ఈ రిలేషన్ షిప్ బాండింగ్ కలకాలం ఉండొచ్చు. ఉండకపోవచ్చు. కానీ బిగ్ బాస్ లో నువ్ ఇచ్చే మార్క్ ఎప్పటికీ అలానే ఉంటుంది అంటూ తెగ పర్ఫామెన్స్ ఇచ్చినట్లు అనిపిస్తోంది. ఇక మంగళవారం ప్రతి సీజన్ లో ఇచ్చే హోటల్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ గురించని కన్ఫెషన్ రూమ్ కు చలాకి చంటి రమ్మంటాడు బిగ్ బాస్.

 సీక్రెట్ టాస్క్ గురించి..

సీక్రెట్ టాస్క్ గురించి..

లోపల సీక్రెట్ టాస్క్ గురించి చంటికి వివరిస్తాడు బిగ్ బాస్. కన్ఫెషన్ రూమ్ లో చంటికి ఏం చెబుతున్నారో అనే ఉత్సుకతో ఆ గది వద్ద ఉండి వినే ప్రయత్నం చేస్తుంది గీతూ రాయల్. ఇది గమనించిన బిగ్ బాస్.. గీతూ.. మీకు అక్కడ ఏం పని అని వారిస్తాడు. దీంతో అక్కడి నుంచి వచ్చేస్తుంది గీతూ. ఆ తర్వాత హోటల్ టాస్క్ ప్రారంభం అవుతుంది.

మేనేజర్ గా ఫైమా..

మేనేజర్ గా ఫైమా..

ఈ టాస్క్ లో ఎవరీ స్ట్రాటజీలు వాళ్లు వాడతారు. గ్లామ్ పారడైజ్ కు మేనేజర్ గా ఫైమా వ్యవహరిస్తుంది. తండ్రి చేత అత్యంతా గారాబంగా పెరిగిన రిచెస్ట్ సింగిల్ అమ్మాయిగా ఇనయా సుల్తానా ఉంటుంది. ఈ హౌజ్ లో ఫైమా, ఇనయా సుల్తానా మంచి ఫ్రెండ్స్. అయితే ఫైమాకు కొన్ని డబ్బులు ఇస్తూ డీల్ మాట్లాడుకుంటుంది ఇనయా. నీకు డబ్బులు ఇస్తాను వాష్ రూమ్, నామినేషన్లలో తనకు హెల్ప్ చేయాలని అడుగుతుంది ఇనయా.

ఇంటి సభ్యుల అందరిముందు..

ఇంటి సభ్యుల అందరిముందు..

ఆ తర్వాత తమ డీల్ మాట్లాడుకునేందుకు ఇద్దరు ఒకే బాత్రూమ్ లోకి వెళతారు. అక్కడ మైక్ లకు వినపడకుండా ఏదో డీల్ మాట్లాడుకున్నట్లు అర్థం అవుతుంది. ఇది చూసిన బిగ్ బాస్.. ఫైమా, ఇనయా.. మీకు మైక్ లు ఇచ్చింది మాటలు వినిపించేందుకే. బాత్రూమ్ లో మీరు మాట్లాడుకున్న విషయం ఇంటి సభ్యుల అందరిముందు మాట్లాడాలని ఆదేశిస్తాడు. దీంతో వాష్ రూమ్ గురించి హెల్ప్ చేయడం, ఫైమాకు డబ్బులు ఇస్తానని చెప్పడం వంటి విషయాల గురించి ఇంటిసభ్యులకు చెబుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X