Bigg Boss Telugu 7 శోభా శెట్టికి మొట్టికాయలు.. బిగ్‌బాస్‌కు అడ్డంగా దొరికిన మోనిత
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో రంజుగా సాగుతున్నది. ఇంటిలో కంటెస్టెంట్లు ఎవరి వ్యూహాలతో వారు రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఒక గ్రూపుగా మరికొందరు ఓ గ్రూపుగా ఏర్పడి ఆటను ఆసక్తికరంగా మార్చారు. అయితే ఇంటిలో నిబంధనలను విస్మరించే కంటెస్టెంట్లను బిగ్‌బాస్ మందలిస్తూనే ఉన్నారు. ఇలాంటివేమీ పట్టించుకోకుండా శోభా శెట్టి చేసిన పనికి బిగ్‌బాస్ గట్టిగానే తలంటాడు. శోభా శెట్టి చేసిన పని ఏమిటి? ఆమెకు క్లాస్ ఎందుకు పీకాడు? అనే వివారాల్లోకి వెళితే...
శోభాశెట్టి విషయానికి వస్తే.. ఇంటిలో బలమైన కంటెస్టెంట్లలో ఒకరనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అనవసరమైన విషయాల్లో తలదూర్చడం ద్వారా గేమ్‌పై ఫోకస్ కోల్పోయిందనే విషయాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. అయితే తన గేమ్ మీద కాకుండా కంటెస్టెంట్లను టార్గెట్ చేయడం ప్రతికూలంగా మారింది.

బిగ్‌బాస్ తెలుగు 7 ఎనిమిదో వారాంతంలో నాగార్జున అంతా ఆమెపైనే ఫోకస్ పెట్టి ఆమె చేసిన తప్పిదాలను బయటపెట్టారు. ఇంటి సభ్యులను కించపరిచే విధంగా మాట్లాడటం తగదని చెప్పారు. అయితే తాను చేసిన తప్పులకు క్షమాపణ కోరింది. అయితే ఇంటిలో తాజాగా మరో తప్పు చేసి బిగ్‌బాస్‌కు దొరికింది.

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో మంగళవారం జరిగిన ఎపిసోడ్‌లో టేస్టీ తేజాతో కలిసి ముచ్చట్లు పెడుతూ కనిపించింది. అయితే ఉద్దేశపూర్వకంగా తేజా మెడలోని మైక్‌ను తొలగించి చెవిలో గుసగుసలు పెట్టింది. చాలా సేపు ఆయన చెవిలో బయటకు వినిపించకుండా మాట్లాడటం కనిపించింది. ఆ విషయం బిగ్‌బాస్ కెమెరాకు చిక్కింది.
అయితే ఇంటి నిబంధనలకు విరుద్ధంగా మైక్‌లో వినిపించకుండా ఉండేలా వ్యవహరించిన శోభాశెట్టిని గట్టిగా పిలిచాడు. మీకు ఎలా చెబితే అర్ధమవుతుంది అని గట్టిగా అరిచాడు. దాంతో సారీ బిగ్‌బాస్ అంది. మళ్లీ మీకు ఎలా చెబితే అర్ధమవుతుందో చెబితే.. అలా చెప్పడానికి బిగ్‌బాస్ రెడీగా ఉన్నాడు అంటూ మళ్లీ గద్దించాడు. దాంతో సారీ అంటూ క్షమాపణ కోరింది.

బిగ్‌బాస్ గట్టిగా అరిచిన శబ్దం విన్న ప్రియాంక జైన్ బయటకు వచ్చి ఏమైంది అని అడిగింది. దాంతో ఏదో ఫ్యామిలీ మ్యాటర్ చెబుతున్నది. అది బయటకు వినిపించకుండా నా చెవిలో చెప్పింది. అందుకు బిగ్‌బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు అని టేస్టీ తేజా అన్నారు.


Click it and Unblock the Notifications











