twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షారుక్ ఖాన్‌తో నేను.. బిగ్‌బాస్‌లో షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన సల్మాన్ ఖాన్

    |

    బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ 14 వివాదాలతో ముగింపు దశకు చేరుకొన్నది. ఈ వారం వీకెండ్‌ కా వార్‌లో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూడనున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో బిగ్‌బాస్‌లో స్పెషల్‌గా ప్లాన్ చేసిన ఈవెంట్స్‌ను సల్మాన్ ఖాన్ వెల్లడించారు. వీకెండ్ కా వార్‌లో ఏం జరుగబోతున్నదంటే..

    బిగ్‌బాస్ 15 ఏర్పాట్లు షురూ!

    బిగ్‌బాస్ 15 ఏర్పాట్లు షురూ!

    బిగ్‌బాస్ 14 రియాలిటీ షో ఫైనల్ ఎపిసోడ్‌కు రంగం సిద్ధమైంది. ప్రస్తుత సీజన్‌ ముగియక ముందే బిగ్‌బాస్‌ 15 సీజన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొద్ది నెలల్లోనే బిగ్‌బాస్ మరో సీజన్ ప్రారంభం కానున్నదని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు.

    షారుక్ ఖాన్ పఠాన్ మూవీలో సల్మాన్

    షారుక్ ఖాన్ పఠాన్ మూవీలో సల్మాన్

    ఇక వీకెండ్ కా వార్‌లో సల్మాన్ ఖాన్ మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. షారుక్ ఖాన్ నటిస్తున్న పఠాన్ చిత్రంలో తాను కీలక పాత్రను పోషిస్తున్నానని చెప్పారు. ఈ చిత్రంలో దీపిక పదుకోన్, జాన్ అబ్రహం కూడా నటిస్తుండటం గమనార్హం. ఈ వార్తతో అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరిస్తున్నది. షారుక్, సల్మాన్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వాతావరణం నెలకొన్నది.

     పఠాన్ చిత్రంలో సల్మాన్ ఖాన్

    పఠాన్ చిత్రంలో సల్మాన్ ఖాన్

    ఇదిలా ఉండగా, సల్మాన్ ఖాన్ మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. జీవితం ముందుకెళ్తుంటుంది. అలాగే షో కూడా ముందుకు సాగుతుంది. ఒకసారి షో ముగిసిన తర్వాత పఠాన్ షూటింగ్‌లో పాల్గొంటాను. ఆ తర్వాత టైగర్ 3 చిత్ర షూటింగ్‌కు ప్రిపేర్ కావడం మరో ఛాలెంజ్ అంటూ సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు.

    టైగర్ పాత్రలో సల్మాన్

    టైగర్ పాత్రలో సల్మాన్

    అయితే షారుక్ ఖాన్ నటిస్తున్న పఠాన్ చిత్రంలో తనకు బ్రాండ్‌గా మారిన టైగర్ పాత్రలో కనిపిస్తారనేది బాలీవుడ్ మీడియాలో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ షూటింగ్ కోసం సల్మాన్ ఖాన్ దుబాయ్‌కి వెళ్లనున్నారు. దాదాపు 12 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం.

    Recommended Video

    Allu Arjun’s Ala Vaikunthapurramuloo in Top Of Netflix's TOP 10 Most Watched Films Of 2020
     సల్మాన్ ఖాన్‌కు విలన్‌గా ఇమ్రాన్ హష్మి

    సల్మాన్ ఖాన్‌కు విలన్‌గా ఇమ్రాన్ హష్మి

    ఇక సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే.. టైగర్ 3 చిత్రం త్వరలోనే ప్రారంభం కానున్నది. ఈ చిత్రంలో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించబోతున్నారు. మార్చిలో ప్రారంభమయ్యే ఈ చిత్రాన్ని మనీష్ శర్మ రూపొందిస్తున్నారు.

    English summary
    Bigg Boss Weekend Ka vaar is going to interesting one this week. Latest prome of Bigg Boss 14 reveals that Salman Khan doing a cameo role in Shah Rukh Khan's Pathan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X