Bigg Boss Telugu 8: గంగవ్వ నా మజాకా.. తొలిరోజే మణికంఠకు దిమ్మతిరిగే పంచ్!
Bigg Boss Telugu 8: తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. గతంలో ఏ సీజన్లో లేని విధంగా ఈ సీజన్ టన్నుల కొద్దీ ట్విస్టులు, టర్నులతో కొనసాగుతున్నది. బిగ్ బాస్ రీలోడ్ పేరిట 5వ వారం చివరలో బిగ్‌బాస్ సరికొత్తగా భారీగా వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇచ్చారు. ఇప్పటికే ఇంటిలో 8 ఉండగా.. వైల్డ్ కార్డ్ ద్వారా 8 మందిని గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇలా వైల్డ్ కార్డుల ద్వారా వచ్చిన కొత్త కంటెస్టెంట్లు రచ్చ రచ్చ చేస్తున్నారు.
అన్ లిమిటెడ్ సీజన్ కు ఫర్పెక్ట్ గా సెటయ్యారు. ఇలా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ తొలి రోజే ఎమోషనల్ స్టార్ మణికంఠకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇంతకీ ఏమైందంటే?
అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్ అనే ట్యాగ్ లైన్ తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో సందడి షూరూ అయ్యింది. హౌస్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా.. వారిని ఢీకొట్టడం కోసం మరో ఎనిమిది మందిని వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇంతకు ముందు సీజన్స్‌లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసినవారే కంటెస్టెంట్లే వైల్డ్ కార్డు ద్వారా మరోసారి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో హరితేజ, టేస్టీ తేజ, రోహిణి, గౌతమ్, నయని పావని, మెహబూబ్, ముక్కు అవినాష్, గంగవ్వ లు మరోసారి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమయ్యింది.

ఇందులో బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గంగవ్వ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అక్షర ముక్క కూడా తెలియకుండా అంతర్జాలంలో హల్ చల్ చేస్తున్నాయి.
సోషల్ మీడియా అంటే ఏంటో తెలియకుండా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా మారింది. ఏడు పదుల వయసులో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ.. తన కామెడి టైమింగ్ తో నవ్వుల పువ్వులను పూయిస్తోంది. బిగ్ బాస్ 4 వ సీజన్ లో కంటెస్టెంట్ గా వచ్చిన గంగవ్వ ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో ఈ సీజన్ మధ్యలో నుండి ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్. తాజాగా మరోసారి బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్‌గా ఏంట్రీ ఇచ్చింది గంగవ్వ. ః
ఇలా వచ్చిందో లేదో .. తగ్గదేలే అన్నట్టుగా యంగ్ కంటెస్టెంట్లతో పోటీపడి టాస్క్ ఆడి గెలిచింది గంగవ్వ. గంగవ్వ నా మాజాకా అన్నట్లు సత్తా చాటుతోంది.
ఇదిలా ఉంటే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వెళ్లిన వారు ఓజీ పాత కంటెస్టెంట్లను పరిచయం చేసుకుంటున్నారు. ఈ సమయంలో మణికంఠపై గంగవ్వ షాకింగ్ కామెంట్లు చేసింది. 'నా పెళ్లాం,నా పిల్ల యాదికొస్తున్నాయంటున్నావ్? పెళ్లాం, పిల్లా యాదికి వస్తే ఎందుకొచ్చినవ్? మరీ నామినేషన్ వేస్తా.. వెళ్లు మరీ' అంటూ మణికంఠకు గంగవ్వ జలక్ ఇచ్చింది. దీనికి మణికంఠ ఎంత ముద్దుగా అడిగావో నువ్వు అనుకుంటూ.. గంగవ్వ పక్కకు వచ్చి కూర్చొన్నాడు మణికంఠ. 'గంగవ్వ నాకు ఏం వచ్చినా.. నేను తట్టుకోలేను' అంటూ సమాధానమిచ్చాడు. 'మరీ ఈ వారం పోతావా ? ఈ వారం నామినేషన్ వేశా?' అని గంగవ్వ అనగా.. ' ఆ నేను పోను'అని మణికంఠ అన్నాడు.

మరీ ఎందుకు ఏడుస్తున్నావ్? యాదికి వస్తే నామినేషన్ వేస్తా.. ఇకపో మరి అని గంగవ్వ పంచ్ వేస్తుంది. దీంతో నేను గంగవ్వ.. నన్ను నామినేషన్ చేయకు' అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు. 'నేను టీవీ చూసినప్పుడు ఈ మొగబాయి గాడు ఏదీ.. ఎప్పుడూ ఏడుస్తున్నాడేంటీ?' అనుకునే దాని గంగవ్వ అనగా.. ' లేదు గంగవ్వ .. ఈ వారం ఏడిస్తే.. నన్ను కచ్చితంగా నువ్వే నామినేట్ చేసి..' అని మణికంఠ చిన్న పిల్లాడిలా రిక్వెస్ట్ చేసుకున్నాడు. దీంతో హౌస్‌లో నవ్వులు పూస్తాయి. ప్రస్తుతం మణికంఠ-గంగవ్వ సంభాషణ నెట్టింట్లో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











