Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌లో ఉండగానే ప్రశాంత్‌కు బంపర్ ఆఫర్... లీక్ చేసిన వైల్డ్ కార్ట్ కంటెస్టెంట్
రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్... ఓ కామన్ మ్యాన్. బిగ్ బాస్ హౌజ్ లో సామాన్య వ్యక్తిగా అడుగుపెట్టి.. తనదైన రీతిలో గేమ్ ఆడుతూ ప్రేక్షకుల మదిని గెలుచుకుంటున్నాడు. మొదటి క్యాప్టెన్ గా పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నాడు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన బోలే షావలి.. పల్లవి ప్రశాంత్ గురించి లీక్ చేశాడు. అది కూడా బిగ్ బాస్ హౌజ్ లో పల్లవి ప్రశాంత్ కు వచ్చిన ఆఫర్ గురించి ప్రస్తావించాడు. ఇప్పుడు ఆ న్యూస్ వైరల్ గా మారింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కామన్ మ్యాన్ గా పల్లవి ప్రశాంత్ అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అతి తక్కువ రెమ్యూనరేషన్ తో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్... ఆరో వారంలోనూ దుసుకుపోతున్నాడు. కేవలం వారానికి లక్ష రూపాయలు తీసుకుంటూ బిగ్ బాస్ హౌజ్ లో తనదైన స్టైల్ లో ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్నాడు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. మొదట్లో ఆయన్ని రైతుబిడ్డ ట్యాగ్ యూజ్ చేస్తున్నారు అని ఇంటి సభ్యులు మొత్తం ఫైర్ అయ్యారు.

ఇక మొదటి నుంచి శివాజీ... పల్లవి ప్రశాంత్ కు సపోర్ట్ ఇస్తూ వచ్చాడు. ఇక ఇంటి సభ్యులు మొత్తం రైతు బిడ్డను టార్గెట్ చేస్తూ.. నామినేట్ చేసినవిషయం తెలిసిందే. ఇక రైతు బిడ్డతో రతిక లవ్ ట్రాక్ కూడా నడిపిన విషయం అప్పట్లో చర్చగా మారింది. ఇక ఆమె హ్యాండ్ ఇవ్వడం.. ఆ తర్వాత ఆమెను అక్క అంటూ పిలవడం... ఇవన్నీ నెట్టింట బాగా వైరల్ గా మారాయి. ముఖ్యంగా నాలుగో వారం నుంచి పల్లవి ప్రశాంత్ ఆడటం స్టార్ట్ చేశాడు.
ఇక అక్కడి నుంచి ఆయన కెప్టెన్ అయ్యాడు అంతా బాగానే ఉంది. ఇక వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన బోలే షావాలి హౌజ్ లో వింతగా ప్రవర్తిస్తున్నాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక హౌజ్ మేట్స్ తో సంబంధం లేకుండా మాట్లాటం.. ఏదో చెప్పడం.. ఇలాంటి వికృత చేష్టలు చేస్తూ... ఆయన ట్రోలింగ్ గురువుతున్నాడు. అయితే బోలే షావాలి రైతు బిడ్డతో ఓ విషయం చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన బయట జరిగిన విషయాన్ని హౌజ్ లో లీక్ చేశాడు.

అసలు విషయం ఏంటంటే... రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఫేమస్ చూసి ఆయనకు ఓ సినిమా ఆఫర్ వచ్చిందట. అయితే ఆ విషయాన్ని బోలే షావలి.. పల్లవి ప్రశాంత్ కు చెప్పాడు. నీకు బిగ్ బాస్ హౌజ్ నుంచి వెళ్లగానే ఓ బంపర్ ఆఫర్ ఉంటది.. అది కూడా సినిమా ఛాన్స్... రైతుల కాన్సెప్టుతో తీయబోతున్నారు. నిన్ను హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు... అంటూ బయట విషయాలు లీక్ చేశాడు బోలే. ఇక ఇలా బయట విషయాలను రూల్ ప్రకారం అయితే లీక్ చేయకూడదు.
బోలే షావలి లీక్ చేసిన విషయం నెట్టింట వైరల్ గా మారుతోంది. ఇక బోలే వికృత చేష్టలు, మాటలు ... సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్నాయి. ఇక ఆ విషయం పక్కన పెడితే.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ మాత్రం బంపర్ ఆఫర్ కొట్టేశాడు అని అర్థం అవుతుంది. ఇక ఆయన హీరోగా రైతుల మీద ఓ సినిమా రాబోతుందని తెలుస్తోంది. చూడాలి మరి ఇందులో నిజ నిజాలు ఎంత ఉన్నాయో.


Click it and Unblock the Notifications











