బిగ్ బాస్ 2: సంచలనం రేపుతున్న ప్రోమో, విసిరికొట్టిన దీప్తి.. చావుకబురు చల్లగా చెప్పిన నాని!

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 22 Highlights

వారాలు గడిచే కొద్దీ బిగ్ బాస్ 2 పై ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అవుతోంది. ప్రతి వారం ఒక్కొక్కరిపై ఎలిమినేషన్ పిడుగు పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సంజన, నూతన్ నాయుడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరనే ఉత్కంఠ నెలకొనివుంది. నేడు జరగబోయే ఎపిసోడ్ లో హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాని సంచలన ప్రకటన చేయబోతున్నాడు. తాజాగా విడులా చేసిన బిగ్ బాస్ ప్రోమో ఉత్కంఠ రెట్టింపు చేసింది.

 అదిరిపోయేలా ఎంట్రీ

అదిరిపోయేలా ఎంట్రీ

ఉత్సాహభరితమైన సంగీతానికి డాన్స్ చేసుకుంటూ నాని ఈరోజు షోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. స్టార్ మా విడుదల చేసిన ప్రోమో ప్రకారం ఆరంభం మొత్తం షో ఉత్సాహవంతంగా జరగబోతోంది.

మహేష్ డైలాగ్ తో

మహేష్ డైలాగ్ తో

హౌస్ లోని సభ్యులందరి చేత నాని ఎదో ప్రమాణం చేయించబోతున్నాడు. రాజకీయనాయకులు చేసే విధంగా అంతఃకరణశుద్దితో అంటూ హౌస్ మేట్స్ చేత నాని ప్రమాణం చేయిస్తున్నాడు. అంతఃకరణ శుద్దితో అనే పదం మహేష్ భరత్ అనే నేను చిత్రంలో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

 సభ్యులందరి అభిప్రాయం

సభ్యులందరి అభిప్రాయం

హౌస్ లో ఒక్కొక్కరిగురించి ఇతరుల అభిప్రాయాన్ని నాని తెలుసుకోబోతున్నాడు. హౌస్ లో యాంకర్ శ్యామల సేఫ్ గేమ్ ఆడుతోందని నాని వ్యాఖ్యానించాడు. గీతా మాధురి చాలా బద్దకస్తురాలని తెలిపాడు.

 విసిరికొట్టిన దీప్తి

విసిరికొట్టిన దీప్తి

యాంకర్ దీప్తి గురించి కూడా నాని ఇతర సభ్యుల అభిప్రాయం తెలుసుకున్నట్లు ఉన్నాడు. దీనికి దీప్తి తీవ్ర అసహనానికి గురైంది. చేతిలో ఉన్న ప్లకార్డుని విసిరికొట్టి నాని ముందే తన అసహనాన్ని తెలియజేసింది.

ఎలిమినేషన్ ఎవరిపై

ఎలిమినేషన్ ఎవరిపై

ఈ వారం ఎలిమినేషన్ లో భాగంగా ఇంటినుంచి వెళ్లిపోయే వారి పేర్లని నాని నేను ప్రకటించబోతున్నాడు. గీతామాధురి, కిరీటి, కౌశల్, గణేష్ మెడపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతున్నట్లు అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

చావు కబురు చల్లగా

ప్రోమో చివర్లో నాని పిడుగులాంటి వార్తచెప్పాడు. గీతామాధురి, గణేష్, కిరీటి నేడు ఇంటిని విడిచి వెళ్లిపోవాలని నాని సంచలనం సృష్టించాడు. కాగా నేడు జరగబోయే ఎపిసోడ్ లో మీరు ముగ్గురూ ఎలిమినేట్ అవుతారా లేక ఒకరుమాత్రమేనా అనే విషయం తేలనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X