For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆస్పత్రిలో చేరిన అభిజీత్: రిస్క్ చేసి ప్రమాదంలో పడ్డ బిగ్ బాస్ విన్నర్.. ఎంతో ప్రయత్నించా అంటూ!

  |

  అభిజీత్.. ఈ పేరుతో పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ యంగ్ హీరో ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అంతేకాదు, ప్రేక్షకాదరణను అందుకుని బిగ్ బాస్ నాలుగో సీజన్ విన్నర్‌గా నిలిచాడు. షోలో ఉన్నంత సేపే దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయిన ఈ కుర్రాడు.. ఇప్పుడు మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ఇక, త్వరలోనే అతడి సినిమా ఉంటుందని అంతా అనుకుంటోన్న సమయంలో.. ఆస్పత్రి పాలయ్యానంటూ ఊహించని బ్యాడ్ న్యూస్ చెప్పాడు అభిజీత్. అసలు అతడికేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

   అలా మొదలైన అభిజీత్ ప్రయాణం

  అలా మొదలైన అభిజీత్ ప్రయాణం

  ఎంతో మంది యంగ్ స్టార్లను తెలుగు తెరకు పరిచయం చేసిన శేఖర్ కమ్ములనే అభిజీత్‌ను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన దర్శకత్వం వహించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే సినిమాతోనే అతడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇది మాత్రం అంతగా ఆడలేదు. దీని తర్వాత అభిజీత్ ‘రామ్ లీలా', ‘మిర్చి లాంటి కుర్రాడు' కూడా అతడికి హిట్‌ ఇవ్వలేదు. కానీ ‘పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్ హిట్టైంది.

  11 తప్పించుకుని... విజేతగా నిలిచి

  11 తప్పించుకుని... విజేతగా నిలిచి

  బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అభిజీత్ ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చాడు. కానీ, నిజాయితీతో ఆడుతూ.. కూల్‌గా ఉంటూ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నాడు. అదే సమయంలో టైటిల్ ఫేవరెట్లు అనుకున్న వాళ్లంతా బయటకు వెళ్లిపోవడం కూడా అతడికి కలిసొచ్చింది. దీంతో ఏకంగా 11 సార్లు ఎలిమినేషన్ తప్పించుకుని నాలుగో సీజన్‌కు విజేతగా నిలిచి సత్తా చాటాడు.

   వాళ్లు బిజీ... అభిజీత్ మాత్రం అలా

  వాళ్లు బిజీ... అభిజీత్ మాత్రం అలా

  బిగ్ బాస్ షో తర్వాత అభిజీత్ కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ, అతడు ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క సినిమాను కూడా ప్రకటించలేదు. అదే సమయంలో నాలుగో సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లు ఆరియానా గ్లోరీ, మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్, దివి వాధ్యా, అవినాష్ తదితరులు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

   అది మొదలెట్టిన బిగ్ బాస్ విన్నర్

  అది మొదలెట్టిన బిగ్ బాస్ విన్నర్

  ఇటీవల అభిజీత్ గతంలో దిగిన సిక్స్ ప్యాక్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు, ఒక్కో ఫొటో ఎప్పుడు ఎక్కడ దిగిందో వివరించాడు. అదే సమయంలో తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యను ప్రస్తావిస్తూ ఓ మెసేజ్ కూడా రాశాడు. అదే సమయంలో తాను వర్కౌట్‌ను మళ్లీ మొదలు పెడుతున్నానని, పాత రూపంలోకి వచ్చేందుకు శ్రమిస్తానని పేర్కొన్నాడు.

   ఆస్పత్రిలో చేరిన అభిజీత్.. పోస్టుతో

  ఆస్పత్రిలో చేరిన అభిజీత్.. పోస్టుతో

  ఈ మధ్య కాలంలో అభిజీత్ సోషల్ మీడియాలో పెద్దగా టచ్‌లో ఉండడం లేదు. దీంతో అసలు అతడికి ఏమైంది? ఎందుకని దూరంగా ఉంటున్నాడు? అని చాలా మందిలో సందేహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ అందరికీ చేదు వార్త చెప్పాడు అభిజీత్. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో భుజం సమస్య కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు రిపోర్టుతో సహా పోస్టును పెట్టాడు.

  ఎంతో ప్రయత్నించా అంటూ వెల్లడి

  ఎంతో ప్రయత్నించా అంటూ వెల్లడి

  అభిజీత్ ఆ పోస్టులో ‘సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేసి చాలా కాలమైందని నాకు తెలుసు. నేను మీతో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండేందుకు ఎంతగానో ప్రయత్నించాను. కానీ నా నొప్పి ఎక్కువవడం వల్ల సాధ్యం కాలేదు. వారం నుంచి భుజం గాయం మరింత బాధిస్తోంది. హాస్పిటల్‌కి వెళ్లాను.. త్వరలోనే తిరిగి వస్తాను' అంటూ అందులో ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు అభిజీత్.

  రిస్క్ చేసి ప్రమాదంలో పడిన అభి

  రిస్క్ చేసి ప్రమాదంలో పడిన అభి


  అభిజీత్ భుజం గాయం తిరగబెట్టడానికి కారణం.. ఇటీవలే అతడు వర్కౌట్స్ మొదలు పెట్టడమేనని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. సినిమాల కోసం సరైన ఫిజిక్‌తో కనిపించాలన్న ఉద్దేశంతో అతడు ఈ మధ్య వర్కౌట్ ప్రారంభించాడు. ఇప్పుడదే ఈ ప్రమాదంలో పడేసిందని తెలుస్తోంది. ఇక, ఈ విషయం తెలిసిన అభిజీత్ ఫ్యాన్స్ అతడు త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.

   Bigg Boss Winner Abijeet Admit in Hospital for Shoulder Injury
  English summary
  Bigg Boss Telugu 4 Winner Abijeet Duddala Admit in Hospital for Shoulder Injury. Recently He Shared his Pain in Social Media Post.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X