సుడిగాలి సుధీర్ తర్వాత అభిజీత్: బిగ్ బాస్ విన్నర్ ఖాతాలో మరో రికార్డు.. దేశ వ్యాప్తంగా హైలైట్!
అభిజీత్.. చాలా రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కాక, దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోన్న పేరిది. దీనికి ఒకే ఒక్క కారణం.. అతడు కొద్ది రోజుల క్రితం ప్రసారం అయిన రియాలిటీ షో బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనడమే. అద్భుతమైన ఆటతీరుతో ఎంతో మంది హృదయాలను దోచుకుని.. పలుమార్లు నేషనల్ లెవెల్‌లో ట్రెండ్ అయ్యాడీ యంగ్ హీరో. ఈ క్రమంలోనే నాలుగో సీజన్‌కు విన్నర్‌గానూ అయ్యాడు. బయటకు వచ్చిన తర్వాత ఫుల్ బిజీ అయిన అభిజీత్‌కు తాజాగా సుడిగాలి సుధీర్ తర్వాత అరుదైన ఘనత దక్కింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్.. కెరీర్ మాత్రం బ్యాడ్‌గా
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు లోకల్ బాయ్ అభిజీత్. అయితే, ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ క్రమంలోనే తర్వాత 'రామ్ లీలా', 'మిర్చి లాంటి కుర్రాడు' వంటి చిత్రాల్లో నటించినా.. హిట్‌ను మాత్రం అందించలేదు. అయితే, అతడు చేసిన 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది.

రియాలిటీ షోలోకి ఎంట్రీ... సెన్సేషన్‌గా మారి
పలు సినిమాల్లో నటించినా అభిజీత్ పేరు చాలా మందికి తెలియదు. అలాంటి సమయంలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడతను. ఏమాత్రం అంచనాలు లేకుండా లోపలికి వెళ్లిన ఈ కుర్రాడు.. చాలా తక్కువ సమయంలోనే ఫేమస్ అయ్యాడు. వ్యక్తిగతంగా, ఆట పరంగా మంచి పేరు తెచ్చుకుని సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయాడు.

లవర్ బాయ్ అనే పేరు.... అది కూడా ట్రెండ్
బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించినప్పటి నుంచే హీరోయిన్ మోనాల్ గజ్జర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు అభిజీత్. అలా కొద్ది రోజుల పాటు ఆమెతో క్లోజ్‌గా ఉన్న అతడు.. ఆ తర్వాత దేత్తడి హారికకు దగ్గరయ్యాడు. అప్పటి నుంచి దాదాపు షో ముగిసే వరకూ ఆమెతో ప్రేమాయణం సాగించినట్లుగా వ్యవహరించాడు. దీంతో వీళ్లిద్దరి పేర్లను కలిపి 'అభిక'గా ట్రెండ్ సెట్ చేశారు ఇరువురి ఫ్యాన్స్.

వేరేలా ఆడాడు.. ప్రేక్షకుల మద్దతుతో గెలిచి
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన అభిజీత్.. కొన్ని టాస్కుల్లో మైండ్ గేమ్ ఆడి తన జట్టుకు విజయాన్ని అందించి తక్కువ సమయంలోనే ప్రేక్షకులను గెలిచాడు. దీంతో ఏకంగా 11 సార్లు ఎలిమినేషన్‌ను తప్పించుకుని సత్తా చాటాడు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ఓట్లు సాధించి బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు విన్నర్‌గా నిలిచాడీ యంగ్ సెన్సేషన్.

అందరూ ఫుల్ బిజీగా.. అభి ప్రకటించలేదు
ఈ రియాలిటీ షో ముగిసిన తర్వాత అందులో కంటెస్టెంట్లుగా పాల్గొన్న సయ్యద్ సోహెల్ రియాన్, ఆరియానా గ్లోరీ, అవినాష్, మోనాల్ గజ్జర్ సహా ఎంతో మంది వరుస ఆఫర్లు అందుకుంటూ ఫుల్ బిజీ అయిపోయారు. దీంతో బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ మాత్రం ఏమీ మొదలెట్టలేదన్న టాక్ వినిపించింది. దీంతో అతడి అభిమానులు సోషల్ మీడియా వేదికగా అతడికి రిక్వెస్టులు కూడా పెట్టారు.
Recommended Video

బిగ్ బాస్ విన్నర్ అభి ఖాతాలో మరో రికార్డు
దేశ వ్యాప్తంగా బుల్లితెరపై ఉత్తమ నటులను ఎంపిక చేసే ఆర్మాక్స్ మీడియా తాజాగా 2020 సంవత్సరానికి సంబంధించిన జాబితాను విడుదల చేసింది. ఇందులో ఉత్తమ ఎంటర్‌టైనర్ విభాగంలో తెలుగు నుంచి సుడిగాలి సుధీర్ (ఢీ షో) ఎంపికయ్యాడు. అతడి తర్వాతి స్థానంలో అభిజీత్ చోటు దక్కించుకుని రికార్డులకెక్కాడు. బిగ్ బాస్ నుంచి గతంలో ఈ ఘనత ఎవరికీ సొంతం కాలేదు.


Click it and Unblock the Notifications











