twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Winner బిందుమాధవి డ్రెస్సింగ్ స్టైల్ పై నెగిటివ్ కామెంట్స్.. స్లిప్పర్ షాట్ కౌంటర్ ఇచ్చిన బ్యూటీ!

    |

    బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన తరువాత బిందు మాధవి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయిందనే చెప్పాలి. అందులో ఆమె ఉన్నన్ని రోజులు కూడా ఆడియెన్స్ సపోర్ట్ ఒక రేంజ్ లో అందింది. విన్నర్ అయ్యే వరకు కూడా ఓటింగ్స్ ఊహించని రేంజ్ లోనే అందికుంది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గ్లామరస్ అందాలతో ఆకట్టుకుంటున్న బిందుమాధవి ఇటీవల పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలకు ఊహించని విధంగా కొన్ని నెగిటివ్ కామెంట్స్ ను ఎదుర్కొంది. అయితే ఆ విషయంలో బిందుమాధవి ఒక కౌంటర్ ఇచ్చిన విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

    బిగ్ బాస్ షోలో

    బిగ్ బాస్ షోలో

    బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వారిలో బిందు మాధవి కూడా టాప్ లిస్టులో ఉంటుంది అనే చెప్పాలి. టెలివిజన్లో సక్సెస్ అయిన తర్వాత బిగ్ బాస్ షోను మొదటిసారి తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ షోలో అందరికంటే ఎక్కువ ఓట్లు అందుకని టైటిల్ విన్నర్ గా నిలిచిన మొదటి లేడీ కంటెస్టెంట్ గా కూడా గుర్తింపును అందుకుంది.

    బిందుమాధవి రికార్డు

    బిందుమాధవి రికార్డు

    బిగ్ బాస్ టెలివిజన్ రంగంలో భారీ స్థాయిలో రేటింగ్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఓటీటీ మొదటి సీజన్ స్టార్ట్ చేసినప్పుడు సక్సెస్ కాదేమో అని అనుకున్నారు. కానీ కంటెస్టెంట్స్ పర్వాలేదు అని విధంగా మంచి పోటీ ఇవ్వడంతో షో స్థాయిని పెంచేశారు. ఇక తెలుగులో మొదటిసారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ నిలిచిన లేడీ కంటెస్టెంట్ గా బిందు మాధవి రికార్డు క్రియేట్ చేసింది.

    మంచి లాభం

    మంచి లాభం

    అత్యదిక ఓట్లతో బిందు మాధవి క్రేజ్ అందుకోవడమే కాకుండా బిగ్ బాస్ ద్వారా మరోవైపు మంచి ఆదాయం కూడా అందుకుంది టైటిల్ విన్నర్ గా ప్రైజ్ మనీతో పాటు బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులకు గాను ప్రత్యేకంగా పారితోషికం కూడా ఇచ్చారు. ఇక బిందుమాధవికి సినిమా ఇండస్ట్రీలో కొన్ని అవకాశాలు కూడా వచ్చాయి గాని ఇంకా పూర్తిస్థాయిలో అయితే నటిగా ఆమె నిలదొక్కుకోలేదు.

    నెగిటివ్ రియాక్షన్

    నెగిటివ్ రియాక్షన్

    ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో బిందుమాధవి పోస్ట్ చేస్తున్న కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా గ్లామర్ ఫొటోలతో ఆమె ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఇటీవల ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలపై నెగటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. గతంలో బిగ్ బాస్ లో ఆమెకు సపోర్ట్ చేసిన వారు ఇప్పుడు నెగిటివ్ గా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది.

    గౌరవం పోయింది అంటూ..

    గౌరవం పోయింది అంటూ..

    బిగ్ బాస్ లో ఆమెను చాలా లైక్ చేశాను. ఎందుకంటే మిగతా కంటెస్టెంట్స్ తో పోలిస్తే ఆమె ఎక్కువగా ట్రెడిషనల్ లుక్ తోనే కనిపించారు. కానీ ఇప్పుడు మాత్రం ఆమె కనిపిస్తున్న విధానం చూస్తుంటే ఆ గౌరవం మొత్తం పోయింది. పేరు హైలెట్ అవ్వడానికి ఈ విధంగా గ్లామర్ షో చేస్తోంది.. అని ఒక నెటిజన్ ఊహించిన విధంగా కామెంట్ చేశారు. ఇక వెంటనే బిందు మాధవి ఆ మాటలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.

    స్లిప్పర్ షాట్ కౌంటర్

    స్లిప్పర్ షాట్ కౌంటర్

    నాకు ఆ తరహాలో డ్రెస్సింగ్ స్టైల్ ను చూసి రెస్పెక్ట్ అనేది వస్తే అలాంటి గౌరవం ఏమాత్రం తనకు అక్కరలేదు అని బిందు మాధవి దండం పెడుతున్న ఒక ఏమోజీ పోస్ట్ చేసింది. దీంతో ఆ కామెంట్స్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. బిందు మాధవిని ఇష్టపడేవారు స్లిప్పర్ షాట్ ఇచ్చింది అంటూ ఆమెకు మద్దతు పలుకుతున్నారు.

    English summary
    Bigg Boss winner bindu madhavi slipper shot counter to netizen comments
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X