పడక గదిలో సుఖం లేదంటూ.. బిగ్‌బాస్ విన్నర్‌కు భార్య విడాకులు

సినీ పరిశ్రమలో ప్రేమ,పెళ్లి, విడాకులు అనే అంశాలు కొత్తవి కావు. ఒకప్పుడు సెలబ్రిటీ జంట విడిపోతున్నారనే అదోక సంచలనంగా మారేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు కూడా చిన్న చిన్న కారణాలతో విడిపోతున్నారు. వారి వ్యక్తిగత జీవితాలను బయటపెట్టుకున్నారు. తాజాగా ఓ ప్రముఖ సెలబ్రెటీ జంట తమ పదేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకడానికి సిద్దమైంది. పడక గదిలో సుఖం లేదనే కారణంతో బిగ్‌బాస్ విన్నర్‌కు అతని భార్య విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ జంట ఎవరు? అసలేం జరిగింది?

ఆ సెలబ్రెటీ జంట ఎవరో కాదు.. ప్రముఖ టెలివిజన్ నటుడు, హిందీ బిగ్‌బాస్ 19 విన్నర్ గౌరవ్ ఖన్నా, ఆయన భార్య నటి ఆకాంక్ష చమోలా. వీరిద్దరూ చాలాకాలం ప్రేమించుకున్న తర్వాత 2016 నవంబర్ 14న కాన్పూర్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వివాహానంతరం ఇద్దరూ టెలివిజన్ రంగంలో తమ కెరీర్‌ను కొనసాగిస్తూ ఆదర్శ జంటగా గుర్తింపు పొందారు. పలు సందర్భాల్లో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం, సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకోవడం వల్ల అభిమానులు వీరి దాంపత్య జీవితం ఎంతో సంతోషంగా సాగుతోందని భావించారు.

Bigg Boss Winner Gaurav Khanna and Akanksha Chamola Announce Divorce

కానీ తెర వెనుక పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయని ఇప్పుడు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ తమ వివాహ బంధానికి ముగింపు పలకడానికి సిద్దమయ్యారు. విడాకులు తీసుకోబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇటీవల ప్రారంభమైన 'లాక్ అప్ 2' ప్రీమియర్ ఎపిసోడ్‌లో పాల్గొన్న ఆకాంక్ష చమోలా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఇప్పటి వరకు తమ వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచిన ఈ జంట ఒక్కసారిగా విడాకుల విషయాన్ని బయటపెట్టడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.

షోలో మాట్లాడిన ఆకాంక్ష చమోలా.. "నేను,గౌరవ్ ఖన్నా విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. ఏడాదిగా మేమిద్దరం విడివిడిగానే ఉంటున్నాం. ఈ విషయం ఇప్పటి వరకు బయటకు చెప్పలేదు. గత ఏడాదిగా మేము ఈ విషయంపై మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇది మేమిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం. మా కుటుంబ సభ్యులు కూడా కొంతకాలం విడిగా ఉండాలని సూచించారు" అని వెల్లడించారు. ఈ నిర్ణయం ఒక్కసారిగా తీసుకున్నది కాదనీ, గత ఏడాది నుంచి తామిద్దరం ఆలోచించి, చివరకు పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. తమ మధ్య ద్వేషం లేదని, ఒకరిపై ఒకరికి గౌరవం ఇప్పటికీ ఉందని కూడా ఆమె స్పష్టం చేశారు.

వైరల్ అవుతున్న పాత ఇంటర్వ్యూ
ఆకాంక్ష విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించిన తరువాత గతంలో ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఇంటర్వ్యూలో తమ వివాహ బంధం గురించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ వైవాహిక జీవితంలో శారీరకంగా సంతృప్తి పొందకపోతే, ఆ కారణంగా కూడా విడాకులు తీసుకోవచ్చు. అది చట్టబద్ధమైన కారణమే" అని కామెంట్ చేసింది. అలాగే మహిళల శరీరం, పీరియడ్స్, లైంగిక అవసరాలు, విడాకులు వంటి అంశాలపై సమాజంలో ఇంకా బహిరంగంగా మాట్లాడరని, ఇప్పటికీ వాటిని నిషిద్ధ అంశాలుగానే పరిగణిస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

పాత కామెంట్స్ మరోసారి వైరల్ అవుతుండటంతో, కొందరూ వాటిని ప్రస్తుత విడాకుల ప్రకటనను జోడిస్తూ విడాకులకు కారణం ఇదేనా ? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆకాంక్ష మాత్రం తన విడాకులకు కారణంగా అలాంటి అంశాలను ఎక్కడా ప్రస్తావించలేదు. ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ సమయంలో గౌరవ్ ఖన్నా తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతూ.. తాను తండ్రి కావాలని కోరుకుంటున్నానని, కానీ ఆకాంక్ష మాత్రం ఆ దశకు సిద్ధంగా లేరని చెప్పారు.

అయినప్పటికీ ఆమెపై తన ప్రేమ తగ్గలేదని, ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు గౌరవమేనని అన్నారు. ఆ కామెంట్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా, పదేళ్ల ఎంతో సంతోషంగా ఉన్నా గౌరవ్ ఖన్నా-ఆకాంక్ష చమోలా జంట తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Read more about: Bigg Boss 19 bollywood akanksha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X