బిగ్‌బాస్ విన్నర్ గెస్ట్ ఎంట్రీ.. స్టేజ్‌పై కళ్యాణ్ వల్ల అనుకోని ప్రమాదం!
Kalyan Padala: కళ్యాణ్ పడాల.. పరిచయం అవసరం లేని పేరు. ఒక సాధారణ కుటుంబానికి చెందిన కళ్యాణ్ దేశ సేవ కోసం ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. అయితే.. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి రావాలనే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో బిగ్ బాస్ రియాలిటీ షోలో కామనర్ గా ఎంట్రీ ఉప్పెనలా ఎగసిపడ్డారు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకుంటూ బీబీ ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. చివరి వరకూ కొనసాగి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఈవెంట్ లో స్పెషల్ గెస్ట్ పాల్గొన్నారు. ఈ సమయంలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
స్టార్ మా ప్రసారం చేస్తున్న బీబీ జోడీ సీజన్ -2 ప్రోగ్రామ్ గురించి తెలిసిందే. ఈ డ్యాన్స్ షోలో ఈ వారం ప్రత్యేకంగా సెలబ్రిటీ గెస్ట్ రౌండ్ నిర్వహించారు. ఈ రౌండ్‌లో ప్రతి జోడీ తమతో పాటు ఒక సెలబ్రిటీ అతిథిని తీసుకుని స్టేజ్‌పై డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రియాంక సింగ్ (పింకీ) - మణికంఠ జోడీ తమ పెర్ఫార్మెన్స్ కోసం బిగ్‌బాస్ సీజన్ 9 విజేత కళ్యాణ్ పడాల ను గెస్టుగా తీసుకొచ్చారు. ముగ్గురూ కలిసి స్టేజ్‌పైకి వచ్చి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. ముఖ్యంగా 'నాది నక్కిలీసు గొలుసు' పాటకు వీరు చేసిన డ్యాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

బిగ్‌బాస్ సీజన్ 9 టైటిల్ గెలుచుకున్న తర్వాత కళ్యాణ్ పడాల బాగా బిజీగా మారిపోయాడు. ఇంటర్వ్యూలు, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్, టెలివిజన్ షోలు ఇలా వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమానులతో టచ్‌లో ఉన్నాడు. షో ముగిసి రెండు నెలలు దాటినా కూడా సోషల్ మీడియాలో అతని క్రేజ్ తగ్గలేదు. ముఖ్యంగా స్టార్ మా షోలలో కళ్యాణ్ కనిపిస్తే ప్రోమోలు, రేటింగ్స్ బాగా వస్తాయని భావించి బీబీ జోడీ సీజన్2 లో అతన్ని ప్రత్యేక గెస్టుగా ఆహ్వానించారు. స్టేజ్‌పైకి వచ్చిన కళ్యాణ్ మాట్లాడుతూ 'బీబీ జోడీ చేయే అదృష్టం రాలేదు కానీ కనీసం ఈ స్టేజ్‌పైకి వచ్చే అవకాశం దొరికింది' అంటూ ఆనందం వ్యక్తం చేశాడు.
డ్యాన్స్‌లో అనుకోని ప్రమాదం
డ్యాన్స్ మొత్తం చాలా ఎనర్జీతో సాగింది. అయితే ప్రోమో చివరిలో అనుకోని ఘటన చోటుచేసుకుంది. డ్యాన్స్ ముగింపు సమయంలో ప్రియాంక సింగ్‌ను పైకి ఎత్తే స్టెప్ చేయడానికి కళ్యాణ్ ప్రయత్నించాడు. కానీ, సరిగ్గా మోయలేకపోవడంతో పింకీ అతని చేతుల్లో నుంచి జారి స్టేజ్‌పై పడిపోయింది. ఈ ఘటనతో అక్కడున్నవారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. జడ్జీలు, హోస్ట్ సహా అందరూ ఏమైందా అంటూ కంగారు పడ్డారు. పింకీకి గట్టిగా దెబ్బ తగిలినట్లు కనిపించడంతో వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి చూసుకున్నారు.
ఈ సంఘటనతో కళ్యాణ్ కూడా తీవ్రంగా బాధపడ్డాడు. అనుకోకుండా జరిగిన తప్పుకు కోపంతో తనని తానే స్టేజ్‌పై కొట్టుకుంటూ కనిపించాడు. పింకీకి ఏమైనా గాయం అయ్యిందా అని అందరూ ఆరా తీశారు. అయితే ప్రోమోలో పూర్తిగా ఏమైందో చూపించలేదు. పింకీ బాగానే ఉందా లేదా గాయం అయ్యిందా అనే విషయం పూర్తి ఎపిసోడ్‌లో తెలుస్తుంది. నిజానికి బిగ్‌బాస్ సీజన్ 9 తర్వాత బీబీ జోడీ సీజన్ 2 కోసం రెండు జోడీలను పరిశీలించినట్లు సమాచారం.
అందులో ఒకటి డీమాన్ పవన్-రీతూ చౌదరి, మరో జోడీ కళ్యాణ్ పడాల - తనూజ గౌడ. అయితే డీమాన్ పవన్, రీతూ చౌదరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షోలోకి వచ్చి త్వరగానే ఎలిమినేట్ అయ్యారు. మరోవైపు కళ్యాణ్-తనూజ జోడీ మాత్రం షోలోకి రాలేదు. దీంతో కళ్యాణ్ ఇప్పుడు ప్రత్యేక గెస్టుగా బీబీ జోడీ స్టేజ్‌పై కనిపించాడు.
ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రేక్షకులు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. అయితే చాలా మంది నెటిజన్లు కళ్యాణ్‌కు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. 'ఇలాంటి ఘటనలు స్టేజ్ పెర్ఫార్మెన్స్‌ల్లో అప్పుడప్పుడూ జరుగుతుంటాయి', 'అది ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదు' అంటూ కళ్యాణ్‌ను సపోర్ట్ చేస్తున్నారు. బీబీ జోడీ సీజన్ 2 తాజా ప్రోమోలో కనిపించిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పింకీకి నిజంగా ఏమైనా గాయం అయిందా లేదా అన్నది వచ్చే ఎపిసోడ్‌లో స్పష్టమయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











