నా లైఫ్‌ను సినిమా తీస్తే ప్రతి సీన్ క్లైమాక్సే.. బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల భావోద్వేగం!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజేత కళ్యాణ్ పడాల (Kalyan Padala)గురించి పరిచయం అవసరం లేదు. ఆయన జీవిత ప్రయాణం చూస్తే అది నిజంగానే ఒక సినిమాను తలపిస్తుంది. సాధారణ కుటుంబంలో జన్మించి, చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. దేశం కోసం సైనికుడిగా సేవలందించారు. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం బిగ్‌బాస్ రియాలటీ షోలో పాల్గొని టైటిల్ విన్నర్ అయ్యారు. అయితే.. ఈ సక్సెస్ స్టోరీ వెనుక ఎంతో కఠినమైన ప్రయాణం దాగి ఉంది. తాజాగా ఓ ఓటీటీ ప్లాట్ ఫామ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్యాణ్ పడాల తన జీవితంలోని బాధలు, త్యాగాలు, కుటుంబానికి దూరంగా గడిపిన రోజుల గుర్తుకు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల మాట్లాడుతూ తన జీవితంలో అత్యంత కష్టమైన కాలం ఆర్మీ ట్రైనింగ్ రోజులు అని చెప్పారు. సాధారణంగా ఒక సంవత్సరం ట్రైనింగ్ పూర్తయిన తర్వాత సైనికులకు కొంత విశ్రాంతి, సెలవులు లభిస్తాయని, కానీ తమ బ్యాచ్‌కు మాత్రం ఆ అవకాశం దక్కలేదని వెల్లడించారు. ట్రైనింగ్ ముగిసిన వెంటనే అస్సాంలో ఎన్నికల విధులకు పంపించడంతో మరో ఐదు నెలలు అదనంగా ట్రైనింగ్ తరహా పరిస్థితుల్లోనే గడపాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు.

Bigg Boss Winner Kalyan Padala Gets Emotional Recalling Army Life and Family Sacrifices

ఆ తర్వాత అయినా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపాలని ఆశించామని, కానీ అనుకోకుండా కాశ్మీర్ సరిహద్దుల్లో విధులకు నియమిస్తూ ఆదేశాలు రావడంతో ఆ ఆశ కూడా నెరవేరలేదన్నారు. తీవ్ర చలితో కూడిన ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తూ కుటుంబానికి దాదాపు రెండేళ్ల పాటు దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో పనిచేయడం ఎంత కష్టమో మాటల్లో చెప్పలేమని వెల్లడించారు.

అయితే కుటుంబానికి దూరంగా ఉండడం తనకు కొత్తేమీ కాదని కళ్యాణ్ పేర్కొన్నారు. రెండో తరగతి నుంచే హాస్టల్‌లో ఉండి చదువుకున్నానని, ఇంటర్మీడియట్ వరకు కూడా ఎక్కువ సమయం ఇంటి కంటే హాస్టల్‌లోనే గడిచిందని చెప్పారు. ఆ తర్వాత ఉద్యోగ జీవితం కూడా తనను కుటుంబానికి దూరంగానే ఉంచిందన్నారు. "చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో ఎక్కువ భాగం నా తల్లిదండ్రులకు దూరంగానే గడిచింది" అని కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

సైన్యంలో పనిచేసే సమయంలో సెలవులు పొందడం కూడా చాలా కష్టమని ఆయన చెప్పారు. ముఖ్యంగా సంక్రాంతి వంటి పండుగల సమయంలో ఇంటికి వెళ్లాలని అందరికీ ఉండేదని, కానీ సెలవులు వస్తాయో రావో తెలియని పరిస్థితుల్లో ఉండేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. తమ బెటాలియన్‌లో ఎక్కువ మంది తెలుగువారే ఉండటంతో ప్రతి ఒక్కరికీ పండుగకు ఇంటికి వెళ్లాలనే కోరిక ఉండేదని, అయితే అందరికీ ఒకేసారి సెలవులు ఇవ్వడం సాధ్యం కాక చాలామంది కుటుంబాలకు దూరంగానే పండుగలు జరుపుకోవాల్సి వచ్చేదని చెప్పారు. ఈ క్రమంలోనే తాను ఎన్నో ముఖ్యమైన కుటుంబ వేడుకలు, పండుగలు, ఆనంద క్షణాలను మిస్ అయ్యానని వెల్లడించారు.

అయితే అప్పట్లో దేశ సేవ అనే బాధ్యత ముందు వ్యక్తిగత భావోద్వేగాలను పక్కన పెట్టాల్సి వచ్చేదని పేర్కొన్నారు. అదే తన జీవితంలో అతిపెద్ద త్యాగమని కూడా తెలిపారు. అయితే బిగ్‌బాస్ తర్వాత తన జీవితంలో ఎంతో మార్పు వచ్చిందని కళ్యాణ్ చెప్పారు. ఈ షో ద్వారా వచ్చిన గుర్తింపు, ప్రజల ప్రేమ తనను కుటుంబానికి మరింత దగ్గర చేసిందన్నారు. "ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా ఒక రోజులో ఇంటికి చేరుకోగలను. కానీ ఆర్మీలో ఉన్నప్పుడు అది సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు నా తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపగలుగుతున్నాను" అని ఆనందం వ్యక్తం చేశారు.

ఇకపై గతంలో చేసిన పొరపాట్లను పునరావృతం చేయనని, ముఖ్యంగా తల్లిదండ్రులకు దూరంగా ఉండే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నానని చెప్పారు. చిన్నప్పటి హాస్టల్ జీవితం, ఆర్మీ ట్రైనింగ్, సరిహద్దు ప్రాంతాల్లో విధులు, ఆ తర్వాత బిగ్‌బాస్ ప్రయాణం.. ఇలా తన జీవితంలోని ప్రతి దశ ఒక పెద్ద సవాలుగా నిలిచిందని పేర్కొన్నారు. "నా జీవితాన్ని సినిమా తీస్తే ప్రతి సీన్ ఓ క్లైమాక్స్‌లా ఉంటుంది. ప్రతి మలుపులో కొత్త ట్విస్ట్ ఉంటుంది. కానీ ఆ కష్టాలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి" అంటూ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను భావోద్వేగానికి గురిచేశాయి. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: bigg boss telugu pawan tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X