twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ఇద్దరంటే నాకు నచ్చదు.. వాళ్లు తవ్వుకొన్న గోతిలో వాళ్లే పడ్డారు.. కౌశల్

    |

    బిగ్‌బాస్ తెలుగు 2 విజేత కౌశల్ తన ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత బిగ్‌బాస్‌లో జరిగిన విషయాలను పూసగుచ్చినట్టు వెల్లడిసున్నారు. తనకు వ్యతిరేకంగా కూటమి కట్టడం వల్లనే నాలో కసి పెరిగింది. అందుకే పట్టుదలగా ఆడాను అని కౌశల్ ఇటీవల ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆయన ఏమన్నారంటే..

    తేజస్వి, బాబు గోగినేని అంటే

    తేజస్వి, బాబు గోగినేని అంటే

    ఇంట్లో తేజస్వి మదివాడ, బాబు గోగినేని నాకు నచ్చని వాళ్లు. డైనింగ్ టేబుల్ వద్ద భోజనం చేస్తుండగా సిగ్గులేకుండా తింటున్నాడు అని నన్ను ఉద్దేశించి కామెంట్ చేసింది. చాలా సార్లు నాతో, నాపై చెడుగా మాట్లాడింది. అందుకే నాకు ఆమె అంటే నచ్చదు.

    Recommended Video

    Bigg Boss Winner Kaushal Speaks About His Journey
    బాబు గోగినేనితో గొడవ గురించి

    బాబు గోగినేనితో గొడవ గురించి

    ఇక బాబు గోగినేనికి నాకు చాలా విషయాల్లో గొడవ జరిగింది. ప్రారంభంలో నాకు, ఆయన మధ్య మంచి రిలేషన్ ఉండేది. కానీ మూవీ ఆర్టిస్టు అసోసియేషన్, రాజమౌళిపై కామెంట్ చేయడం నాకు నచ్చలేదు. అందుకే దూరమయ్యాను.

    నా పర్సనల్ విషయాలపై

    నా పర్సనల్ విషయాలపై

    ఇంట్లో నాకు, బాబు గోగినేని మధ్య మంచి రిలేషన్ ఉన్నప్పుడు నా వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకొన్నాను. అలాంటివి నాని ముందు చెప్పడంతో నేను చాలా బాధపడ్డాను. అలాగే నన్ను బయటకు పంపించేందుకు ప్రయత్నం కూడా చేశారు.

    తనీష్ నన్ను బెదిరించాడు

    తనీష్ నన్ను బెదిరించాడు

    ఇంట్లో జరిగిన ఓ వివాదం సందర్భంగా తనీష్ నన్ను బెదిరించినట్టు మాట్లాడాడు. బయటకు వెళ్లిన తర్వాత నా అంతు చూస్తానని బెదిరించాడు. ఆ విషయంపై నాని కూడా అభ్యంతరం చెప్పారు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు అని కౌశల్ చెప్పాడు.

    వారు తొవ్వుకొన్న గోతిలో వాళ్లే

    వారు తొవ్వుకొన్న గోతిలో వాళ్లే

    నా గేమ్‌ను అర్ధం చేసుకోలేక వాళ్లు తవ్వుకొన్న గోతిలో వారే పడ్డారు. నేను చేసిందేమీ లేదు. బిగ్‌బాస్ హౌస్‌లో 113 రోజులు ఉన్నప్పుడు ట్రాప్‌లో పడినట్టు వాళ్లు తెలుసుకోలేకపోయారు. నేను గెలిచిన తర్వాత కనీసం నిలబడి చప్పట్లు కొట్టలేదు అని కౌశల్ చెప్పారు.

    English summary
    Bigg Boss Telugu 2 winner Kaushal is busy with the interviews. He has shared his experiences in house to media. Kaushal said that he does not like Babu Gogineni and Tejaswi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X