నా వల్లే రష్మికి జబర్తస్త్ ఆఫర్.. బిగ్ బాస్ విన్నర్ షాకింగ్ సీక్రెట్ రివీల్

ప్రముఖ యాంకర్‌, నటి రష్మీ గౌతమ్ (Rashmi Gautam) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్‌గా, వెండితెరపై నటిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ బ్యూటీ, తన టాలెంట్‌తోనే కాదు సామాజిక అంశాలపై స్పందిస్తూ కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఎన్నో ఎత్తుపల్లాలను దాటుకుంటూ ఈ స్థాయికి చేరుకున్న రష్మీ, ఇప్పటికీ తనదైన స్టైల్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అయితే తాజాగా ఆమె కెరీర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. రష్మీ ఎదుగుదల వెనుక తన పాత్ర ఉందని, ఆమెకు ఇండస్ట్రీలో అవకాశాలు రావడంలో తాను కీలకంగా సహాయం చేశానని ఓ బిగ్ బాస్ విన్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఆ బిగ్ బాస్ విన్నర్ ఎవరంటే?

ఆ షాకింగ్ కామెంట్స్ చేసింది ఎవరో కాదు.. బిగ్ బాస్ తెలుగు 2 విన్నర్ కౌశల్ మందా. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, ఇండస్ట్రీ అనుభవాలు, ఇతరులకు చేసిన సహాయం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మోడలింగ్ తన జీవితంలో కీలక పాత్ర పోషించిందని చెప్పాడు కౌశల్. అది కేవలం అందం ప్రదర్శన మాత్రమే కాదని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే పాఠశాలలాంటిదని వివరించారు. కష్టమైన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా మెరుగుపరుచుకోవాలి, ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి వంటి అనేక విషయాలు మోడలింగ్ ద్వారా నేర్చుకున్నానని తెలిపారు.

Bigg Boss Winner Kaushal Manda Claims He Helped Jabardasth Rashmi Gautam Career Growth

ఇండస్ట్రీలో తాను కేవలం తన కెరీర్‌కే పరిమితం కాలేదని, చాలా మందికి అవకాశాలు కల్పించేందుకు కృషి చేశానని కౌశల్ పేర్కొన్నారు. కొత్తగా వచ్చే నటీనటులు ఎదగాలని ఎప్పుడూ ఆశించానని, వారికి సహాయం చేయడం తనకు ఆనందంగా అనిపిస్తుందని చెప్పారు. డబ్బు రాకపోయినా వారు పేరు సంపాదిస్తే చాలని భావించే స్వభావం తనదని వెల్లడించారు. అనేక మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు తమకు తెలియకుండానే తన ద్వారా అవకాశాలు పొందారని, కొన్ని షోల కోసం వారిని సజెస్ట్ చేసి వారి కెరీర్‌కు దారితీసిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు.

ఈ సందర్భంలో యాంకర్ రష్మి గురించి చెప్పిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జబర్దస్త్ షో నుంచి అనసూయ బయటకు వచ్చిన తర్వాత కొత్త యాంకర్ కోసం వెతుకుతున్న సమయంలో, మేనేజర్ ఏడుకొండలు తనను సంప్రదించారని కౌశల్ తెలిపారు. అప్పుడు వైజాగ్‌కు చెందిన తన స్నేహితురాలు రష్మి పేరు సూచించానని, ఆ తర్వాత ఆమె ఆడిషన్ ద్వారా ఎంపికై జబర్దస్త్ యాంకర్‌గా ఎదిగిందని చెప్పారు. అయితే ఈ విషయాన్ని తాను రష్మికి ఎప్పుడూ చెప్పలేదని, క్రెడిట్ ఎవరికి దక్కిందన్నది ముఖ్యం కాదని స్పష్టం చేశారు.

తనతో కలిసి పని చేసిన చాలా మంది ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌లో ఉన్నారని కౌశల్ పేర్కొన్నారు. తన "చేయి అదృష్టం తీసుకొస్తుంది" అని నమ్ముతున్నానని, తనతో మొదటిసారి యాడ్ ఫిలిం లేదా ర్యాంప్ షో చేసినవారు మంచి స్థాయికి చేరుకున్నారని చెప్పారు. దీనికి ఉదాహరణగా నటి తమన్నా పేరును ప్రస్తావించారు. 'హ్యాపీ డేస్' తర్వాత తాను డైరెక్ట్ చేసిన భీమా సిమెంట్ యాడ్‌లో ఆమె నటించిందని గుర్తుచేశారు.

ఇప్పటివరకు 200కు పైగా యాడ్ ఫిలింలను డైరెక్ట్ చేసిన కౌశల్, తనకు సినిమా తెరకెక్కించే సామర్థ్యం ఉన్నప్పటికీ ఎందుకు ఆ దిశగా అడుగు వేయలేదో కూడా వివరించారు. సినిమా నిర్మాణం చాలా పెద్ద రిస్క్ అని, ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును ఒకేసారి పెట్టి మళ్లీ మొదటినుంచి ప్రారంభించడం తనకు ఇష్టం లేదని చెప్పారు. బిగ్ బాస్ విజేత శివ బాలాజీ తన సంపాదన మొత్తాన్ని సినిమా కోసం పెట్టి నష్టపోయిన ఉదాహరణను కూడా ప్రస్తావించారు.

అదేవిధంగా తన భార్య నీలిమ కూడా సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తుందని, అది "బూడిదలో పోసిన పన్నీరు" లాంటిదని భావిస్తుందని తెలిపారు. సినిమా తీసిన తర్వాత దాన్ని విడుదల చేయడం, ప్రమోషన్ చేయడం కోసం భారీగా డబ్బు అవసరమవుతుందని, ఆ స్థాయి రిస్క్ తీసుకునే పరిస్థితి తమకు లేదని అన్నారు. మొత్తంగా కౌశల్ మందా చెప్పిన ఈ విషయాలు ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా వస్తాయో, ఒకరి సపోర్ట్ ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నాయి. తనకు వచ్చిన గుర్తింపును మాత్రమే కాకుండా, ఇతరులను ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్న కౌశల్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X