ఇకపై వేటాడుతానంటున్న బిగ్ బాస్ విన్నర్‌.. విలనిజం బయటపడిపోయింది.!

By Manoj Kumar P

తెలుగు రియాలిటీ షో 'బిగ్‌బాస్' ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. ఇదే షో కొందరిలో నిరుత్సాహాన్ని మిగల్చగా, మరికొందరిని మాత్రం ప్రేక్షకుల ముందు హీరోలను చేసింది. ఇలా పాపులర్ అయిన వాళ్లలో ప్రముఖ నటుడు కౌశల్ మండా ఒకరు. గత సంవత్సరం 'స్టార్ మా' చానెల్‌లో ప్రసారమైన బిగ్‌బాస్ సీజన్-2 ద్వారా తెలుగు రాష్ట్రాల్లో కౌశల్ స్టార్ అయిపోయాడు. అప్పటి నుంచి అతడు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. తాజాగా కౌశల్ మరోసారి హాట్ టాపిక్ అవుతున్నాడు. దీనికి కారణం ఏంటి..?

కౌశల్ పేరు మారుమ్రోగిపోయింది

కౌశల్ పేరు మారుమ్రోగిపోయింది

బిగ్ బాస్ సీజన్ - 2లో ఎన్నో కష్టాలను ఎదుర్కొనడంతో పాటు, హౌస్‌లోని అందరూ టార్గెట్ చేయడంతో చాలా మంది కౌశల్‌కు మద్దతుగా నిలిచారు. అతడు పడుతున్న కష్టాలు చూసి ప్రేక్షకులు భారీ స్థాయిలో ఓట్లు వేశారు. ఈ క్రమంలో కొందరు ఆర్మీలా తయారై అతడిని విన్నర్‌ను చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా కౌశల్ పేరు మారుమ్రోగిపోయింది.

సినిమాలు చేయడం లేదంటూ ట్రోల్స్

సినిమాలు చేయడం లేదంటూ ట్రోల్స్

కౌశల్.. ‘బిగ్ బాస్' విన్నర్ అయినప్పటికీ ఆయనతో సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదంటూ కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. అలాగే బుల్లి తెరపైనా కనిపించడం లేదని అన్నారు. దీన్ని ప్రస్తావిస్తూ చాలా మంది అతడిపై విమర్శలు చేశారు. దీంతో కౌశల్ ఫ్యాన్స్‌ కూడా.. సినిమా ఎందుకు తీయడం లేదంటూ అతడిని ప్రశ్నించారు.

భార్య కోసమే ఇలా చేశానంటూ ప్రకటన

సినిమాలు తీయడం లేదంటూ వస్తున్న వార్తలపై కౌశల్ ఇటీవల స్పందించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘‘నా జీవితాన్ని చూసుకోవడం కంటే నా భార్యను కాపాడుకోవడమే ముఖ్యం. ఆమె ఆరోగ్యం నా కెరీర్ కంటే ఎక్కువ. నా సినిమాల కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరికీ ఇదే నా ఆన్సర్. ఆమె ఆరోగ్యం మెరుగైన తర్వాతనే సినిమాలు చేస్తాను'' అంటూ తన భార్యతో ఉన్న ఫొటోను షేర్ చేశాడు.

హెబ్బా పటేల్‌లో కలిసి షాకిచ్చాడు

హెబ్బా పటేల్‌లో కలిసి షాకిచ్చాడు

సోషల్ మీడియా వేదికగా కౌశల్ కొద్ది రోజుల క్రితం కీలక ప్రకటన చేశాడు. త్వరలోనే ‘కుమారి 21F' ఫేం హెబ్బా పటేల్‌ను డైరెక్ట్ చేయబోతున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇద్దరూ దిగిన పిక్‌ను షేర్ చేశాడు. అంతేకాదు, ‘టైటిల్స్ వస్తుంటాయి.. పోతుంటాయి.. నా మల్టీటాస్కింగ్ మాత్రం అలాగే ఉండిపోతుంది. శ్రీరామ్ గోల్డ్ లోన్ యాడ్ ఫిల్మ్ కోసం హెబ్బా పటేల్‌ను డైరెక్ట్ చేస్తున్నా' అని రాసుకొచ్చాడు. ఆ తర్వాత ఆమెతో యాడ్ ఫిల్మ్ పూర్తి చేశాడు.

వేటాడుతానంటున్నాడు

వేటాడుతానంటున్నాడు

ఇక, తాజాగా కౌశల్ సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన చేశాడు. ఈ మేరకు ప్రముఖ చానెల్‌లో ప్రసారం అయ్యే సీరియల్‌కు సంబంధించిన వీడియో ప్రోను షేర్ చేస్తూ.. ‘ఆది శంకర వస్తున్నాడు. నన్ను ప్రతి రోజూ పది గంటలకు మిస్ అవకండి' అంటూ రాసుకొచ్చాడు. దీంతో టీవీ సీరియల్స్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలిపాడు. దీంతో కౌశల్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X