అద్భుతమైన పనికి శ్రీకారం చుట్టిన బిగ్ బాస్ విన్నర్ కౌశల్.. ప్రశంసల వర్షం
కౌశల్ మండా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. తెలుగు రియాలిటీ షో 'బిగ్‌బాస్' ద్వారా ఈయన హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. గత సంవత్సరం 'స్టార్ మా' చానెల్‌లో ప్రసారమైన బిగ్‌బాస్ సీజన్-2 ద్వారా కౌశల్ స్టార్ అయిపోయాడు. ఈ షోలో ఎన్నో కష్టాలను ఎదుర్కొనడంతో పాటు, హౌస్‌లోని అందరూ టార్గెట్ చేయడంతో చాలా మంది కౌశల్‌కు మద్దతుగా నిలిచారు. అతడు పడుతున్న కష్టాలు చూసి ప్రేక్షకులు భారీ స్థాయిలో ఓట్లు వేశారు. ఈ క్రమంలో కొందరు ఆర్మీలా తయారై అతడిని విన్నర్‌ను చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా కౌశల్ పేరు మారుమ్రోగిపోయింది. ఈ నేపథ్యంలో అతడు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.

గెలిపించిన సానుభూతి
ఆ షోలో ఎన్నో కష్టాలను ఎదుర్కొనడంతో పాటు, హౌస్‌లోని అందరూ టార్గెట్ చేయడంతో చాలా మంది కౌశల్‌కు మద్దతుగా నిలిచారు. అతడు పడుతున్న కష్టాలు చూసి ప్రేక్షకులు భారీ స్థాయిలో ఓట్లు వేశారు. ఈ క్రమంలో కొందరు ఆర్మీలా తయారై అతడిని విన్నర్‌ను చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా కౌశల్ పేరు మారుమ్రోగిపోయింది.

సినిమాలు చేయడం లేదంటూ ట్రోల్స్
కౌశల్.. ‘బిగ్ బాస్' విన్నర్ అయినప్పటికీ ఆయనతో సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదంటూ కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని ప్రస్తావిస్తూ చాలా మంది అతడిపై విమర్శలు చేశారు. దీంతో కౌశల్ ఫ్యాన్స్ కూడా.. సినిమా ఎందుకు తీయడం లేదంటూ అతడిని ప్రశ్నించారు.

కౌశల్ స్పందన
సినిమాలు తీయడం లేదంటూ వస్తున్న వార్తలపై కౌశల్ ఇటీవల స్పందించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘‘నా జీవితాన్ని చూసుకోవడం కంటే నా భార్యను కాపాడుకోవడమే ముఖ్యం. ఆమె ఆరోగ్యం నా కెరీర్ కంటే ఎక్కువ. నా సినిమాల కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరికీ ఇదే నా ఆన్సర్. ఆమె ఆరోగ్యం మెరుగైన తర్వాతనే సినిమాలు చేస్తాను'' అంటూ తన భార్యతో ఉన్న ఫొటోను షేర్ చేశాడు
హెబ్బా పటేల్‌తో ఫిల్మ్
సోషల్ మీడియా వేదికగా కౌశల్ కీలక ప్రకటన చేశాడు. త్వరలోనే ‘కుమారి 21F' ఫేం హెబ్బా పటేల్‌ను డైరెక్ట్ చేయబోతున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇద్దరూ దిగిన పిక్‌ను షేర్ చేశాడు. అంతేకాదు, ‘టైటిల్స్ వస్తుంటాయి.. పోతుంటాయి.. నా మల్టీటాస్కింగ్ మాత్రం అలాగే ఉండిపోతుంది. శ్రీరామ్ గోల్డ్ లోన్ యాడ్ ఫిల్మ్ కోసం హెబ్బా పటేల్‌ను డైరెక్ట్ చేస్తున్నా' అని రాసుకొచ్చాడు.

అద్భుతమైన పనికి శ్రీకారం
ఈ మధ్య కౌశల్.. తన ఎన్జీవో ద్వారా చాలా మందికి సహాయం చేశాడు. ఇక, తాజాగా మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. హైదరాబాద్ నగరంలో ఆహారం దొరకక అలమటించే వారి కోసం కౌశల్ ఆర్మీ ‘సంజీవనీ రథం' అనే పథకం ప్రారంభించబోతుంది. అంటే.. ఏదైనా ఫంక్షన్లలో మిగిలిన ఆహారాన్ని తీసుకుని అందరికీ పంచుతారు. దీన్ని వివరిస్తూ కౌశల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను కూడా విడుదల చేశాడు.


Click it and Unblock the Notifications











