రైతుల పేరుతో పల్లవి ప్రశాంత్ మోసం: ఒక్క పోస్టుతో రివీల్ చేసిన బిగ్ బాస్ విన్నర్
తెలుగు బుల్లితెర చరిత్రలో కొన్ని షోలు మాత్రమే ప్రత్యేకంగా నిలుస్తూ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ ఒకటి. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా ఇది సెన్సేషనల్ హిట్ అయింది. దీని ద్వారా ఎంతో మంది పెద్ద సెలెబ్రిటీలు అయ్యారు. అందులో కామన్ మ్యాన్‌గా వచ్చి సీజన్ విన్నర్‌గా నిలిచిన పల్లవి ప్రశాంత్ ఒకడు. షోలో ఉన్నప్పుడు రైతులకు సాయం చేస్తానన్న అతడు.. ఇప్పుడు వాళ్లను మోసం చేశాడని టాక్ వస్తోంది. దీంతో తాజాగా దీనిపై రైతు బిడ్డ స్పందించాడు. వివరాల్లోకి వెళ్తే...
కామన్ మ్యాన్.. విజేతగా
బిగ్ బాస్ ఏడో సీజన్ ఉల్టా పుల్టా కాన్సెప్టుతో గత ఏడాదిలో ప్రసారం అయింది. ఇందులోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వారిలో కామన్ మ్యాన్ కోటాలో వచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా బాగానే హైలైట్ అయ్యాడు. ఆ తర్వాత అతడు అదిరిపోయే ఆటతో ఆకట్టుకున్నాడు. ఇలా కోట్ల మంది హృదయాలను గెలుచుకుని ప్రశాంత్ ఏడో సీజన్ విజేతగా నిలిచాడు.

గెలిచిన వెంటనే అరెస్ట్
బిగ్ బాస్ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత జరిగిన గొడవలకు విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను బాధ్యుడిని చేస్తూ 9 సెక్షన్ల కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అతడికి 14 రోజుల రిమాండ్ విధించగా.. చంచల్‌గూడ జైలులో పెట్టారు. అయితే, ప్రశాంత్ కోసం కొందరు లాయర్లు బెయిల్ పిటీషన్ వేశారు. దీంతో నాంపల్లి కోర్టు దాన్ని మంజూరు చేసింది.
రైతులకు ఇస్తానంటూ
బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఒకవేళ విన్నర్ అయితే తనకు వచ్చే ప్రైజ్ మనీ మొత్తాన్ని నిరుపేద రైతులకు పంచుతానని పల్లవి ప్రశాంత్ ప్రకటించాడు. సీజన్ ముగిసిన తర్వాత కూడా అతడు ఇదే ప్రకటన చేశాడు. అంతేకాదు, ఓ ఇంటర్వ్యూలో 'నా నేల తల్లి సాక్షిగా చెప్తున్నా.. నా పంటచేను సాక్షిగా చెప్తున్నా.. నేను ప్రతి రూపాయి రైతులకే ఖర్చుపెడతాను' అన్నాడు.

మోసం చేసేశాడంటూ
బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు రైతులకు తన ప్రైజ్ మనీని పంచుతానని చెప్పిన పల్లవి ప్రశాంత్ ఇప్పటి వరకూ అలా చేయలేదు. దీనిపై ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. దీంతో అతడు రైతులను మోసం చేశాడని కొందరు సోషల్ మీడియా ద్వారా ఆరోపిస్తున్నారు. అంతేకాదు, అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ పోస్టులు చేస్తున్నారు. దీంతో ఇది హాట్ టాపిక్‌గా మారింది.
స్పందించిన ప్రశాంత్
రైతులను మోసం చేశాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తాజాగా స్పందించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ గుడిలో దిగిన ఫొటోలను షేర్ చేసిన అతడు.. 'ప్రాణం పోయినా ఇచ్చిన మాటను మరువను. నేను ఇచ్చిన మాట కోసం ఎంత దూరం అయినా వెళ్తాను' అంటూ ప్రైజ్ మనీని పంచబోతున్నట్లు స్పష్టం చేసేశాడు.
త్వరలోనే వస్తున్నాను
అదే పోస్టులో పల్లవి ప్రశాంత్ 'నిరూపేద రైతు కుటుంబాల కోసం బిగ్ బాస్ ప్రైజ్ మనీతో త్వరలోనే మీ ముందుకు వస్తున్నాను. జై జవాన్.. జై కిసాన్. జై హనుమాన్.. జై శ్రీరామ్' అంటూ ప్రకటించాడు. తద్వారా తనపై వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేశాడు. ఇదిలా ఉండగా.. ప్రశాంత్ బిగ్ బాస్‌లో రూ. 35 లక్షలు ప్రైజ్ మనీగా గెలుచుకున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











