దటీజ్ పల్లవి ప్రశాంత్.. కష్టాల్లో ఉన్న కుటుంబానికి భారీ సాయం.. ఆట సందీప్ ఎంత ఇచ్చాడంటే!
పల్లవి ప్రశాంత్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా అతడు సోషల్ మీడియాలో క్రేజ్‌ను సొంతం చేసుకుని.. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. అసాధారణ ఆటతీరుతో విజేతగా నిలిచాడు. తద్వారా తన రేంజ్‌ను భారీ స్థాయిలో పెంచుకున్నాడు. అయితే, షోలో ఉన్నప్పుడు తనకు వచ్చిన డబ్బును రైతుల కుటుంబాలకు పంచుతానని చెప్పిన అతడు.. ఆ పని చేయకపోవడంతో విమర్శలపాలు అయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా పల్లవి ప్రశాంత్ గొప్ప మనసును చాటుకుంటూ భారీ సాయం చేశాడు. ఆ పూర్తి వివరాలను మీరే చూడండి!
బిగ్ బాస్ విన్నర్‌గా ప్రశాంత్:బిగ్ బాస్ ఏడో సీజన్ ఉల్టా పుల్టా కాన్సెప్టుతో గత ఏడాది ప్రసారం అయింది. ఇందులోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వారిలో కామన్ మ్యాన్ కోటాలో వచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా బాగానే హైలైట్ అయ్యాడు. ఆ తర్వాత అతడు అదిరిపోయే ఆటతో మెప్పించాడు. ఇలా కోట్ల మంది హృదయాలను గెలుచుకుని ప్రశాంత్ ఏడో సీజన్ విజేతగా మారాడు.

గెలిచిన ఆనందం లేకుండా:బిగ్ బాస్ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత జరిగిన హింసకు విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను బాధ్యుడిని చేస్తూ 9 సెక్షన్ల కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అతడికి 14 రోజుల రిమాండ్ విధించగా.. చంచల్‌గూడ జైలులో పెట్టారు. అయితే, ప్రశాంత్ కోసం కొందరు లాయర్లు బెయిల్ పిటీషన్ వేయగా.. నాంపల్లి కోర్టు మంజూరు చేసింది.
రైతులకు డబ్బు ఇస్తానని:బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ తనకు వచ్చే ప్రైజ్ మనీ మొత్తాన్ని నిరుపేద రైతులకు పంచుతానని ప్రకటించాడు. సీజన్ ముగిసిన తర్వాత కూడా అతడు ఇదే ప్రకటన చేశాడు. అంతేకాదు, ఓ ఇంటర్వ్యూలో 'నా నేల తల్లి సాక్షిగా చెప్తున్నా.. నా పంటచేను సాక్షిగా చెప్తున్నా.. నేను ప్రతి రూపాయి రైతులకే ఖర్చుపెడతాను' అని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

రైతులను మోసం చేసేశాడని:బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు రైతులకు తన ప్రైజ్ మనీని పంచుతానని చెప్పిన పల్లవి ప్రశాంత్ ఆ తర్వాత మాత్రం అలా చేయలేదు. దీనిపై ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. దీంతో అతడు రైతులను మోసం చేశాడని కొందరు సోషల్ మీడియా ద్వారా ఆరోపించారు. అంతేకాదు, అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ పోస్టులు కూడా చేసిన విషయం తెలిసిందే.
డబ్బు అందించిన ప్రశాంత్:ముందుగా ప్రకటించినట్లుగానే పల్లవి ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కుటుంబాన్ని ఆదుకున్నాడు. శివాజి, భోలే షావలి సమక్షంలో ఆ రైతు ఫ్యామిలీకి తన వంతుగా లక్ష రూపాయల నగదును అందించాడు. అంతేకాదు, ఆ మొత్తాన్ని పిల్లల పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయిస్తున్నట్లు ప్రకటించాడు. అలాగే, ఆ ఫ్యామిలీకి ఏడాదికి సరిపడా బియ్యాన్ని కూడా ఇచ్చాడు.
ఆట సందీప్ కూడా సాయం:బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ సదరు రైతు కుటుంబానికి నగదు, బియ్య సహాయం చేయడంతో మరో కంటెస్టెంట్ ఆట సందీప్ కూడా ఇన్‌స్పైర్ అయ్యాడు. ఆ నిరుపేద రైతు కుటుంబానికి తన వంతుగా రూ. 25 వేలు ఇస్తానని ప్రకటించాడు. త్వరలోనే ఆ డబ్బును ఆ ఫ్యామిలీకి అందించబోతున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని శివాజి మీడియాకు వివరించాడు.
ప్రాణం పోయిన మరువను:నిరుపేద రైతు కుటుంబానికి సహాయం చేసిన విషయాన్ని పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఆ వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ.. 'ప్రాణం పోయిన ఇచ్చిన మాట మరువను. జై జవాన్ జై కిషాన్' అంటూ పోస్ట్ చేశాడు. ఇక, పల్లవి ప్రశాంత్ చేసిన పనితో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీంతో విమర్శించిన వాళ్లంతా సైలెంట్ అయిపోయారు.


Click it and Unblock the Notifications











