పల్లవి ప్రశాంత్ సంచలన ప్రకటన: వాళ్ల కోసం లక్షలు ఖర్చు.. ఆ వీడియోలు బయటపెడతానంటూ!
కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అవుతోన్న వ్యక్తుల్లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఒకడు. అంతలా ఇతగాడు దాదాపు మూడు నెలలుగా అటు సోషల్ మీడియాలోనూ, ఇటు వార్తల్లోనూ హైలైట్ అవుతూ వచ్చాడు. అంతేకాదు, బిగ్ బాస్ ఏడో సీజన్ విజేతగానూ నిలిచాడు.
అంతా సవ్యంగా సాగుతోన్న సమయంలోనే అతడు అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లాడు. ఈ అంశం సంచలనంగా మారిపోయింది. ఇక, ఇటీవలే తిరిగి వచ్చిన పల్లవి ప్రశాంత్.. తాజాగా ఓ సంచలన ప్రకటన చేశాడు. ఇంతకీ ఈ రైతు బిడ్డ ఏం చెప్పాడు? ఆ పూర్తి వివరాలను మీరే చూడండి!

గెలిచిన ఆనందం లేకుండా: 15 వారాల పాటు మజాను పంచిన బిగ్ బాస్ షో ఇటీవలే ముగిసింది. గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత జరిగిన గొడవలకు విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను బాధ్యుడిని చేస్తూ 9 సెక్షన్ల కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీని ప్రకారం అతడిని అరెస్ట్ చేసి జడ్జ్ ముందు హాజరు పరిచారు. న్యాయమూర్తి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్ విధించగా.. చంచల్‌గూడ జైలులో పెట్టారు.

బెయిల్‌పై వచ్చిన ప్రశాంత్: 14 రోజుల రిమాండ్‌పై చంచల్‌గూడ జైలుకు వెళ్లిన పల్లవి ప్రశాంత్ కోసం దాదాపు 50 మంది లాయర్లు స్వచ్చందంగా వచ్చి బెయిల్ కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలోనే నాంపల్లి కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేశారు. ఈ మేరకు కొన్ని షరతులను కూడా విధించింది. దీంతో పల్లవి ప్రశాంత్ గత శనివారం సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి బయటకు వచ్చాడు.
భోలే ఇంట్లో.. వాళ్లందరితో: జైలు నుంచి విడుదలైన తర్వాత పల్లవి ప్రశాంత్ తన ఇంటికి వెళ్లకుండా హైదరాబాద్‌లోని భోలే షావలి ఇంట్లోనే ఉండిపోయాడు. అక్కడ అతడిని బిగ్ బాస్ ఏడో సీజన్ కంటెస్టెంట్లు అందరూ కలుసుకున్నారు. ముఖ్యంగా శివాజి, ప్రిన్స్ యావర్, నయనీ పావని, టేస్టీ తేజ, శుభశ్రీ రాయగురులు వచ్చి పల్లవి ప్రశాంత్‌కు ధైర్యం చెప్పారు. ఈ వీడియో తెగ వైరల్ అయిపోయాయి.

సీఎం వ్యాఖ్యలపై క్లారిటీగా: బిగ్ బాస్ విజేతగా నిలిచిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది. గొడవ సమయంలో యూట్యూబర్లతో తనను సీఎం చేయండని అతడు అన్న వ్యాఖ్యలపై ప్రశాంత్ క్లారిటీ ఇచ్చాడు. 'వాళ్లంతా నన్ను 14 ఊర్లకు ఏం చేస్తావు అని అడిగారు. నాకు వచ్చిన డబ్బుతో వాళ్లకు ఏం చేయగలను. అందుకే సీఎంను చేయండి అన్నాను' అని చెప్పాడు.
ప్రతి రూపాయి రైతులకే: ఇదే ఇంటర్వ్యూలో పల్లవి ప్రశాంత్ 'గుండెలపై చేయి వేసుకుని చెప్తున్నాను. నాకు బిగ్ బాస్ వల్ల వచ్చిన రూ.35 లక్షల్లో ప్రతి రూపాయి రైతులకే ఇస్తా. నేను షోలో ఉన్నప్పుడు చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. నా నేల తల్లి సాక్షిగా చెప్తున్నా.. నా పంటచేను సాక్షిగా చెప్తున్నా.. నేను ప్రతి రూపాయి రైతులకే ఖర్చుపెడతాను. ఈ జన్మ ఎత్తిందే రైతుల కోసం' అని తెలిపాడు.

వీడియోలు కూడా చేస్తా: ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ 'నేను ఏ రైతుకు ఎంత డబ్బు ఇచ్చాను అన్న దాన్ని వీడియోలు తీయిస్తాను. వాటిలో అన్ని లెక్కలూ వివరిస్తాను. అసలు నేను బిగ్ బాస్ షోకు నాకోసం పోలేదు. అందులో నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. గతంలో నా దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు ఉంది. కాబట్టి నాకు వచ్చిన రూ. 35 లక్షలు మొత్తం రైతులకే ఉపయోగిస్తాను' అని ప్రకటించాడు.
నాగార్జున సార్‌కూ చెప్పా: ఈ ఇంటర్వ్యూలో పల్లవి ప్రశాంత్ 'నేను నాగార్జున సార్‌కు మాట ఇచ్చాను. ఆ డబ్బంతా నిజంగా రైతులకే పంచుతా అని చెప్పాను. దీన్ని కచ్చితంగా నిలబెట్టుకుంటాను. ఈ డబ్బు కోసమే నేను కసిగా గేమ్ ఆడాను. దాన్ని రైతులకు పంచడం కోసమే ఆడాను. నేను నమ్ముకున్న భూమాత సాక్షిగా చెబుతున్నాను. బరాబర్ చెప్తున్నా.. ఈ డబ్బంతా రైతులకే వాడుతా' అని అన్నాడు.


Click it and Unblock the Notifications











