వేట మొదలుపెట్టిన పల్లవి ప్రశాంత్: వాళ్లపై పరువు నష్టం కేసు.. ఆ కంటెస్టెంటే అసలు టార్గెట్

తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా మారుమ్రోగిపోతోన్న పేర్లలో 'పల్లవి ప్రశాంత్' ఒకటి. సామాన్య రైతు కుటుంబానికి చెందిన అతడు.. కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఎవరూ ఊహించని ఆటతీరుతో విజేతగా నిలిచాడు. అయితే, ఆ తర్వాత జరిగిన అనుకోని సంఘటన వల్ల అతడు జైలుకు వెళ్లాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఇక, బెయిల్‌తో బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్.. వేటను మొదలు పెట్టినట్లు ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఇందులో భాగంగానే అతడు కొందరిపై కేసు వేయబోతున్నాడట. అ సంగతులేంటో మీరే చూడండి!

జైలుకు బిగ్ బాస్ ప్రశాంత్
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత జరిగిన అహింసకు బాధ్యుడిని చేస్తూ విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం పల్లవి ప్రశాంత్ నివాసానికి చేరుకుని అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం 14 రోజుల రిమాండ్‌పై అతడిని చంచల్‌గూడ జైలుకు పంపారు.

Bigg Boss Winner Pallavi Prashanth Ready to File defamation suit Against Youtubers

బెయిల్‌పై వచ్చిన విన్నర్
పలు సెక్షన్ల కింద అరెస్ట్ అయి జైలు పాలైన పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ కోరుతూ పలువురు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై జరిగిన విచారణలో జడ్జ్ అతడికి బెయిల్ మంజూరు చేశారు. ఈ మేరకు కొన్ని షరతులను కూడా విధించిన విషయం తెలిసింే. దీంతో పల్లవి ప్రశాంత్ శనివారం సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యాడు.

మళ్లీ తప్పు చేసిన ఫ్యాన్స్
వాస్తవానికి బిగ్ బాస్ తర్వాత జరిగిన న్యూసెన్స్‌లో పల్లవి ప్రశాంత్ ప్రత్యక్షంగా పాల్గొనలేదు. అయినప్పటికీ అతడు జైలు పాలయ్యాడు. దీనికి కారణం అతడి అభిమానుల ఓవర్ యాక్షనే అని తెలిసిందే. ఇక, బెయిల్‌పై విడుదల అయిన తర్వాత కూడా జైలు వద్దకు చాలా మంది అభిమానులు చేరుకుని రచ్చ చేశారు. ప్రశాంత్ మాత్రం ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు.

Bigg Boss Winner Pallavi Prashanth Ready to File defamation suit Against Youtubers

ప్రశాంత్ వేట మొదలని
బిగ్ బాస్ ఏడో సీజన్ విజేతగా నిలిచిన ఆనందం ఎంతో సేపు లేకుండా పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇక, ఇప్పుడు అతడు బెయిల్‌పై బయటకు వచ్చిన వెంటనే వేటను మొదలు పెట్టినట్లు, ఇందుకోసం తనపై తప్పుడు ప్రచారం చేసిన వాళ్లను గుర్తిస్తున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాళ్లపై పరువు నష్టం కేస్
బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ జైలుకు వెళ్లిన వార్త దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయింది. ఈ నేపథ్యంలో అతడిపై కొందరు దృష్ప్రచారం చేసినట్లు, వాళ్లపై పరువు నష్టం దావా కేసు వేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తనపై తప్పుడు ప్రచారం చేసిన కొందరు యూట్యూబర్లపై ప్రశాంత్ ఈ కేసును వేయబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

Bigg Boss Winner Pallavi Prashanth Ready to File defamation suit Against Youtubers

అతడే ఎక్కువ టార్గెట్?
పల్లవి ప్రశాంత్ కోసం పని చేస్తున్న 50 మంది లాయర్లు ఇప్పుడు పరువు నష్టం కేసుకు సంబంధించిన వర్క్‌తో బిజీగా ఉన్నారని తెలిసింది. ముఖ్యంగా ఓటీటీ సీజన్ కంటెస్టెంట్‌, ప్రముఖ యాంకర్ శివపై పల్లవి ప్రశాంత్ లాయర్లు టార్గెట్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ.. ఇప్పుడీ న్యూస్ హాట్ టాపిక్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X