Pallavi Prashanth: రైతు బిడ్డ నిజ స్వరూపం ఇది.. ఇంటర్వూ కోసం వెళ్తే బూతులతో వెనక్కి పంపాడు!
బిగ్ బాస్ తెలుగు 7 విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అయితే పల్లవి ప్రశాంత్ గెలిచాక తన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందనే చెప్పాలి. విన్ అయిన రోజే అతని రెండో ముఖం చూపెట్టేస్తున్నాడు. తాజాగా ఆయన ఇంటర్వ్యూ కోసం ఓ యూట్యూబర్ వెళ్తే.. పది గంటలు వెయిట్ చేయించి.. నేను ఇవ్వను పో అంటూ ప్రశాంత్ బూతులు తిట్టారంట. దీంతో ఆ సదరు యూట్యూబర్ మళ్లీ వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది.అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7 షో.. గత సీజన్స్ కంటే డిఫరెంటుగా సాగింది. అంతే కాదు.. ఈసారి ఉల్టా పుల్టా అంటూ షాకులు, ట్విస్టుల మధ్య 105 రోజుల పాటు సాగిన ఈ షో.. డిసెంబర్ 17న ముగిసింది. ఇక ఆ రోజున బిగ్ బాస్ విజేతగా పల్లవి ప్రశాంత్.. ఓ కామన్ మ్యాన్.. రైతు బిడ్డ టైటిల్ కైవసం చేసుకున్నాడు. రన్నరప్ గా అమర్ దీప్ చౌదరి నిలిచాడు. ఇక శివాజీ టైటిల్ విన్నర్ అవ్వాల్సింది కానీ.. మూడో స్థానంలో ఉండిపోయాడు.

ఆ విషయం పక్కన పెడితే.. విజేత అయ్యాక ప్రశాంత్ అసలు రూపం బయటకు వస్తుంది. అతని ఫ్యాన్స్ చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. అమర్ దీప్ ఫ్యామిలీపై, గీతు, అశ్విని కార్లపై దాిడి చేశారు. అంతే కాదు టీఎస్ ఆర్టీసీ బస్సులపై కూడా దాడి చేశారు. అర్దరాత్రి విధ్వంసం సృష్టించారు. ఇక దీనిపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పై, అతనిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ విషయంపై తనకు సంబంధం లేదని.. ఎవరో చేసిన దానికి నన్ను ఎలా బ్లేమ్ చేస్తారని పల్లవి ప్రశాంత్ చెప్పుకువస్తున్నాడు.
ఇక విజేతగా నిలిచిన తర్వాత మామూలుగా యూట్యూబర్స్ ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటారు. అలా ఓ యూట్యూబర్ పల్లవి ప్రశాంత్ ఇంటికి వెళ్లాడు. ఇక ఇంటర్వ్యూకు దాదాపు 10 గంటలు వెయిట్ చేయించిన తర్వాత... లోపలికి పిలిచారంట. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూ ఇవ్వాలని సదరు యూట్యూబర్ రిక్వెస్ట్ చేస్తే.. నాకేం ఇస్తావ్ అంటూ ప్రశ్నించాడు ప్రశాంత్.
రైతుల పేరు చెప్పుకుని గెలిచావ్ కదా.. రైతుల కోసం ఇంటర్వ్యూ ఇవ్వాలని సదరు యూట్యూబర్ అడిగితే.. పల్లవి ప్రశాంత్ బూతులతో రెచ్చిపోయాడు. దీంతో ఆ యూట్యూబర్ అర్దరాత్రి మళ్లీ ఇంటికి బయలు దేరాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా ఆ యూట్యూబర్ నెటిజన్స్ తో పంచుకున్నాడు. పల్లవి ప్రశాంత్ ఇలా దారణంగా బిహేవ్ చేశాడని స్టోరీలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్.. పల్లవి ప్రశాంత్ పై ఫైర్ అవుతున్నారు. కేవలం నువ్వు గెలిచింది బిగ్ బాస్ టైటిల్.. అంతే కానీ ఆస్కార్ కాదు అంటూ ఫైర్ అవుతున్నారు. రైతుల పేరు చెప్పుకుని గెలిచి.. ఇలా రూడ్ గా బిహేవ్ చేయడం తప్పు అంటున్నారు మరికొంత మంది. మరి పల్లవి ప్రశాంత్ లో మార్పు ఏమైనా వస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











