Bigg Boss Winner: లీకైన ఫినాలే షూటింగ్.. బిగ్ ట్విస్టుతో ముగ్గురు ఎలిమినేట్.. అతడికి భారీ దెబ్బ!

టెలివిజన్ హిస్టరీలోనే దేశ వ్యాప్తంగా సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన షో బిగ్ బాస్. ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్న దీనికి ప్రేక్షకుల నుంచి ఆదరణ భారీగానే లభిస్తోంది. అందుకే ఈ షో ప్రసారం అయిన ప్రతిసారీ ఆయా భాషల్లో నెంబర్ వన్ స్థానాన్ని స్థానంలో నిలుస్తోంది.

ముఖ్యంగా తెలుగులో ఇది దేశంలోనే ఎక్కువ రేటింగ్‌ను దక్కించుకుంటోంది. దీంతో నిర్వహకులు ఇప్పుడు ఆరో సీజన్‌ను ఎన్నో ప్రయోగాలతో నడుపుతూ వచ్చారు. ఇందులో నేడు గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. ఆ సంగతులేంటో మీరే చూడండి!

ఐదుగురి మధ్య టైటిల్ పోరు

ఐదుగురి మధ్య టైటిల్ పోరు

భారీ అంచనాలతో మొదలైన బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరిలో మొత్తంగా 15 మంది ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఈ వారం ఆరంభంలో ఆరుగురు సభ్యులు మాత్రమే హౌస్‌లో ఉన్నారు. అందులో మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో శ్రీ సత్య వెళ్లిపోయింది. దీంతో ఇప్పుడు కీర్తి భట్, రేవంత్, రోహిత్, శ్రీహాన్, ఆది రెడ్డి మాత్రమే టైటిల్ రేసులో ఉన్నారు.

లీకైన విన్నర్... రన్నర్‌ పేర్లు

లీకైన విన్నర్... రన్నర్‌ పేర్లు

గతంలో మాదిరిగా కాకుండా బిగ్ బాస్ ఆరో సీజన్ విజేతగా ఎవరు నిలుస్తారు అన్న దానిపై ముందు నుంచే ఓ క్లారిటీ వచ్చేసింది. ఇందులో సింగర్ రేవంత్‌ మాత్రమే విజేతగా నిలిచే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఫినాలేలో అతడే విజేతగా నిలిచాడని ఇప్పటికే న్యూస్ లీకైంది. అలాగే, శ్రీహాన్ రెండో స్థానంలో ఉన్నాడని కూడా తెలిసింది.

గ్రాండ్ ఫినాలేకు అంతా రెడీ

గ్రాండ్ ఫినాలేకు అంతా రెడీ

పదిహేను వారాల పాటు ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ ఆరో సీజన్ డిసెంబర్ 18 అంటే ఆదివారంతో పూర్తి కాబోతుంది. రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇక, ఈ స్పెషల్ ఎపిసోడ్‌ను ఎంతో సందడిగా జరపనున్నారు. దీని కోసం నిర్వహకులు భారీ ఖర్చు చేయడంతో పాటు ఎన్నో సర్‌ప్రైజ్‌లను కూడా ప్లాన్ చేశారని సమాచారం.

శనివారమే షూట్.. సందడిగా

శనివారమే షూట్.. సందడిగా

బిగ్ బాస్ ఆరో సీజన్ గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన షూటింగ్ శనివారమే ప్రారంభం అయింది. ఇందులో మాజీ కంటెస్టెంట్లు ఆటపాటలతో అలరించారు. ముఖ్యంగా వాసంతి సహా పలువురు లేడీస్‌ డ్యాన్స్‌లు అదరగొట్టారని తెలిసింది. ఇక, ఈ ఎపిసోడ్ కోసం బీబీ జోడీ జడ్జ్‌లు రాధ, సదాలు స్టేజ్‌పై సందడి చేశారట. అలాగే, కొందరు హౌస్‌లోకి కూడా వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది.

వాళ్లు ముగ్గురు ఎలిమినేషన్

వాళ్లు ముగ్గురు ఎలిమినేషన్

శనివారం జరిగిన షూటింగ్‌కు సంబంధించిన కొన్ని వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ ఎపిసోడ్ జరిగిన తీరుతో పాటు ఇందులోని ఎలిమినేషన్ వివరాలు కూడా లీక్ అయ్యాయి. ప్రస్తుతం హౌస్‌లో ఐదుగురు కంటెస్టెంట్లు ఉండగా.. ఇందులో ముగ్గురు సభ్యులు రోహిత్, ఆది రెడ్డి, కీర్తి భట్‌లను ఒక్కొక్కరుగా ఎలిమినేట్ చేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

చివర్లో ట్విస్ట్.. ప్లేస్‌లు మార్పు

చివర్లో ట్విస్ట్.. ప్లేస్‌లు మార్పు

వాస్తవానికి శుక్రవారం రాత్రి ఓటింగ్ ముగిసిన తర్వాత రేవంత్ విజయం సాధించగా.. శ్రీహాన్ రన్నర్‌గా నిలిచాడాని లీకులు వచ్చేశాయి. ఆది రెడ్డి మూడో స్థానంలో, కీర్తి భట్ నాలుగో స్థానంలో, రోహిత్ ఐదో స్థానంలో నిలిచారని ప్రచారం జరిగింది. కానీ, నిన్నటి షూటింగ్‌లో మాత్రం కీర్తి మూడో స్థానంలో నిలవగా.. ఆది రెడ్డి నాలుగు, రోహిత్ ఐదో స్థానాలతో సరిపెట్టుకున్నారని తెలిసింది.

ఫినాలే షూట్ ఇద్దరి మధ్యనే

ఫినాలే షూట్ ఇద్దరి మధ్యనే

ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవడంతో ప్రస్తుతం హౌస్‌లో రేవంత్, శ్రీహాన్ మాత్రమే మిగిలారు. వీళ్లిద్దరికి సంబంధించిన షూటింగ్ ఆదివారం మధ్యాహ్నం నుంచి జరగబోతుందని తెలిసింది. ఇందులోనే విజేతను నిర్ణయించబోతున్నారు. ఇక, ఈ షూటింగ్‌ను ఎలాంటి లీకులు బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తల నడుమ జరపబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X