Bigg Boss Winner: లీకైన అఫీషియల్ ఓటింగ్.. ఫినాలేలో షాకింగ్ రిజల్ట్.. విన్నర్ ఆ కంటెస్టెంటే!

తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు ప్రసారం అయ్యాయి. కానీ, అందులో కొన్ని షోలు మాత్రమే ఈ రంగాన్నే శాశించే విధంగా సూపర్ సక్సెస్ అయ్యాయి. అలాంటి వాటిలో బిగ్ బాస్ ఒకటి. రియాలిటీ ఆధారంగా నడిచే ఈ కార్యక్రమానికి భారీ రెస్పాన్స్ రావడంతో దేశంలో ఏ షోకూ రాని రేటింగ్ వచ్చింది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను నడుపుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ ప్రసారం చేస్తున్నారు. ఇక, ఇందులో విజేతను నిర్ణయించే ఫినాలే వీక్ ఓటింగ్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!

ఫినాలేలోకి ఆరుగురు ఎంటర్

ఫినాలేలోకి ఆరుగురు ఎంటర్

గతంలో ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి మొత్తం 21 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. దీంతో షో చరిత్రలోనే తొలిసారి ఆరుగురు సభ్యులు ఫినాలేలోకి అడుగు పెట్టారు. అందులో రేవంత్, శ్రీహాన్, శ్రీ సత్య, ఆది రెడ్డి, కీర్తి భట్, రోహిత్‌లు ఉన్నారు. వీళ్లంతా చివరి వారం విజేతను నిర్ణయించే ఓటింగ్‌లో నిలిచారు.

బయటకు వెళ్లిపోయిన సత్య

బయటకు వెళ్లిపోయిన సత్య

బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారి ఆరుగురు కంటెస్టెంట్లను ఫినాలే వీక్‌లోకి పంపించారు. అయితే, వీళ్లలో ఒకరు ఈ వారం మధ్యలోనే ఎలిమినేట్ అవుతారని హోస్ట్ నాగార్జున ఆదివారం ఎపిసోడ్‌లో వెల్లడించాడు. ఇందులో భాగంగానే గత ఎపిసోడ్‌లో శ్రీ సత్య షో నుంచి ఎలిమినేట్ అయిపోయింది. దీంతో చివరిగా రేవంత్, శ్రీహాన్, ఆది రెడ్డి, కీర్తి భట్, రోహిత్‌లు ఫినాలేకు చేరారు.

టాప్5 వాళ్లే.. అప్పుడే ప్రకటన

టాప్5 వాళ్లే.. అప్పుడే ప్రకటన

ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఆరో సీజన్‌లో టాప్ 5 కంటెస్టెంట్లను నిర్ణయించే చివరి (మిడ్ వీక్) ఎలిమినేషన్ ప్రక్రియ బుధవారం రాత్రి జరగబోతుందని కూడా నాగార్జున వెల్లడించాడు. కానీ, దీన్ని శుక్రవారం ఎపిసోడ్‌లో చూపించారు. వీళ్లలో విజేతను నిర్ణయించే ఎపిసోడ్ మాత్రం వచ్చే ఆదివారం (డిసెంబర్ 18వ తేదీ) సాయంత్రం ఆరు గంటలను నుంచి ప్రసారం అవబోతుంది.

 రికార్డు ఓటింగ్.. పోటాపోటీగా

రికార్డు ఓటింగ్.. పోటాపోటీగా

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఫినాలే వీక్‌లో ఆరుగురు కంటెస్టెంట్లు టైటిల్ బరిలో నిలిచారు. అందులో శ్రీ సత్యకు కూడా శుక్రవారం ఎపిసోడ్ ముగిసే వరకూ ఓటింగ్ ఓపెన్ అయి ఉంది. దీంతో ప్రేక్షకులంతా తమకు నచ్చిన కంటెస్టెంట్లను గెలిపించేందుకు పోటాపోటీగా ఓట్లను వేశారు. ఫలితంగా ఈ సీజన్ మొత్తంలో తొలిసారి భారీ ఓటింగ్ నమోదు అయినట్లు తాజాగా తెలిసింది.

లీకైన బిగ్ బాస్ విజేత పేరు

లీకైన బిగ్ బాస్ విజేత పేరు

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో రేవంత్ మాత్రమే ఆరంభం నుంచే తనదైన ఆటతీరుతో టైటిల్ ఫేవరెట్‌ అనిపించుకున్నాడు. ఈ క్రమంలోనే ఫినాలే వీక్‌లోనూ అతడికే ఎక్కువ ఓట్లు వచ్చాయని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఫలితంగా ఈ సీజన్‌కు రేవంత్ విజేతగా నిలవబోతున్నాడని సమాచారం. ఇప్పటికే అతడికి కంగ్రాట్స్ అంటూ చెబుతూ చాలా మంది పోస్టులు పెడుతున్నారు.

రన్నరప్ విషయంలో క్లారిటీ

రన్నరప్ విషయంలో క్లారిటీ


బిగ్ బాస్ ఆరో సీజన్ ఫినాలే వీక్‌లో భాగంగా జరిగిన ఓటింగ్‌లో రేవంత్ విజేతగా నిలుస్తాడని అందరికీ ముందే అర్థమైపోయింది. అయితే, రన్నర్ విషయంలో మాత్రం చాలా చర్చలు జరిగాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న శ్రీహాన్ ఈ సీజన్‌లో రన్నర్‌గా నిలవబోతున్నాడట. రేవంత్ తర్వాత అతడికే ఎక్కువ ఓట్లు వచ్చాయని టాక్.

వాళ్ల విషయంలో షాకింగ్‌గానే

వాళ్ల విషయంలో షాకింగ్‌గానే

ఫినాలే వీక్‌కు సంబంధించిన ఓటింగ్‌‌లో మిగిలిన స్థానాల్లో మాత్రం షాకింగ్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సీజన్ ఫినాలే వీక్ పోలింగ్ ముగిసిన తర్వాత ఆది రెడ్డి మూడో స్థానంలో, కీర్తి భట్ నాలుగో స్థానంలో, రోహిత్ ఐదో స్థానంలో నిలిచారని తెలిసింది. ఇక, చివరి ఇద్దరి ఎలిమినేషన్‌కు సంబంధించిన షూట్ శనివారం జరుగుతుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X