Bigg Boss Winner: ఫినాలే వీక్‌లో షాకింగ్ ఓటింగ్.. అతడికే అన్ని ఓట్లా.. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరంటే!

తెలుగు టెలివిజన్‌పై సెన్సేషన్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ.. టాప్ రేటింగ్‌ను రాబడుతూ.. నెంబర్ వన్ షోగా సత్తా చాటుతోంది బిగ్ బాస్. అంతేకాదు, ఎప్పటికప్పుడూ భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటూ దేశంలోనే టాప్ ప్లేస్‌ షోగా వెలుగొందుతోంది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో కొత్త సీజన్లను తీసుకు వస్తున్నారు. ఇలా ఇప్పుడు ఆరో సీజన్‌ను విజయవంతంగా నడుపుతున్నారు. ఇందులో చివరి వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్‌ పెట్టి షాకివ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో ఓటింగ్ డీటేల్స్ బయటకు వచ్చాయి? ఆ పూర్తి వివరాలేంటో మీరే చూసేయండి!

చివరి వారంలో 6గురు ఎంట్రీ

చివరి వారంలో 6గురు ఎంట్రీ


బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి మొత్తం 21 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఏడుగురు సభ్యుల్లో ఇనాయా సుల్తానా గత వారంలో ఎలిమినేట్ అవడంతో.. షో చరిత్రలోనే తొలిసారి ఆరుగురు సభ్యులు ఫినాలేలోకి అడుగు పెట్టారు. అందులో రేవంత్, శ్రీహాన్, శ్రీ సత్య, ఆది రెడ్డి, కీర్తి భట్, రోహిత్‌లు ఉన్నారు.

 మధ్యలోనే ఒకరు బయటకు

మధ్యలోనే ఒకరు బయటకు


బిగ్ బాస్ ఆరో సీజన్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరుగురు కంటెస్టెంట్లను ఫినాలే వీక్‌లోకి పంపించారు. అయితే, వీళ్లలో ఒకరు ఈ వారం మధ్యలోనే ఎలిమినేట్ అవుతారని హోస్ట్ నాగార్జున ఆదివారం ఎపిసోడ్‌లో వెల్లడించాడు. ఇందుకోసం అదే రోజు నుంచి ఓటింగ్ లైన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అంటే.. గ్రాండ్ ఫినాలేలో ఐదుగురు సభ్యులే ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

బుధవారం ఔట్.. విజేతనలా

బుధవారం ఔట్.. విజేతనలా


ప్రస్తుతం నడిచే సీజన్‌లో టాప్ 5 కంటెస్టెంట్లను నిర్ణయించే చివరి (మిడ్ వీక్) ఎలిమినేషన్ ప్రక్రియ బుధవారం రాత్రి జరగబోతుందని కూడా నాగార్జున వెల్లడించాడు. అప్పటి నుంచి టాప్ 5 సభ్యులకు మాత్రమే ఓటింగ్ జరగబోతుంది. వీళ్లలో విజేతను నిర్ణయించే ఎపిసోడ్ మాత్రం వచ్చే ఆదివారం (డిసెంబర్ 18వ తేదీ) సాయంత్రం ఆరు గంటలను నుంచి ప్రసారం కాబోతుంది.

ఫుల్ ఓటింగ్.. మార్పులతోనే

ఫుల్ ఓటింగ్.. మార్పులతోనే


బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఇప్పుడు ఆరుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. అందులో ఒకరు మధ్యలోనే ఎలిమినేట్ అవుతారు. మిగిలిన వాళ్లలోనూ ఒకరు మాత్రమే విజేతగా నిలబోతున్నారు. దీంతో ప్రేక్షకులంతా తమకు నచ్చిన కంటెస్టెంట్లను గెలిపించేందుకు విశ్వ ప్రయత్నాలు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎపిసోడ్‌కు గతంలో కంటే ఎక్కువగా ఓటింగ్ జరుగుతుందని తెలిసింది.

టైటిల్ రేసులో అతడే ఫస్ట్

టైటిల్ రేసులో అతడే ఫస్ట్


తాజా సీజన్‌లోకి మొత్తం 21 మంది సభ్యులు ఎంట్రీ ఇచ్చారు. అందులో రేవంత్ మాత్రమే ఆరంభం నుంచే తనదైన ఆటతీరుతో టైటిల్ ఫేవరెట్‌గా నిలుస్తున్నాడు. దీంతో అతడు పలుమార్లు ఎలిమినేషన్ తప్పించుకుని ఫినాలేకు చేరాడు. ఈ క్రమంలోనే ఫినాలే వీక్‌లోకూ కూడా అతడే ముందంజలో ఉన్నాడు. కేవలం అతడికి మాత్రమే 30 శాతం ఓట్లు వస్తున్నాయని సమాచారం.

 ఎవరు ఏ స్థానంలో అంటే

ఎవరు ఏ స్థానంలో అంటే


బిగ్ బాస్ ఆరో సీజన్ ఫినాలే వీక్‌లో భాగంగా జరుగుతున్న ఓటింగ్‌లో ప్రస్తుతానికి సింగర్ రేవంత్ ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతోన్నాడు. అతడి తర్వాత అంటే రెండో స్థానంలో శ్రీహాన్ చోటూ, మూడో స్థానంలో రోహిత్ సాహ్నీ ఉన్నాడని తెలిసింది. అలాగే, కీర్తి భట్ నాలుగో స్థానంలో ఉందని బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. తద్వారా వీళ్లంతా తుది దశకు చేరే అవకాశం కనిపిస్తోంది.

ఆ ఇద్దరిలోనే ఒకరు ఔట్

ఆ ఇద్దరిలోనే ఒకరు ఔట్


ఫినాలే వీక్‌కు సంబంధించిన ఓటింగ్‌‌లో ప్రస్తుతం ఆది రెడ్డి ఐదో స్థానంలో ఉండగా, శ్రీ సథ్య ఆరో స్థానానికి పడిపోయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అంటే ఈ ఇద్దరిలోనే ఒకరు మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే, ఈ సారి ఓటింగ్‌ను బట్టి కాకుండా ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. దీంతో ఎవరైనా వెళ్లే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X