Bigg Boss Winner: రేవంత్‌కు బిగ్ షాక్.. ఫినాలేలో ఊహించని ఎలిమినేషన్.. ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఔట్
రియాలిటీ ఆధారంగా నడుస్తూ.. ఊహించని మలుపులతో సాగుతూ.. దాదాపు 15 వారాల పాటు ప్రేక్షకులకు మజాను పంచుతోన్న ఏకైక షోనే బిగ్ బాస్. ఇండియాలోని ఎన్నో భాషల్లో నడుస్తోన్నా.. తెలుగులో మాత్రమే దీనికి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది అత్యధిక రేటింగ్‌తో దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. అయితే, ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఆరో సీజన్ మాత్రం అంతంత మాత్రంగానే సాగుతోంది. ఇక, ఇది ప్రస్తుతం ఫినాలే వీక్ జరుపుకుంటోంది. ఇందులో ఈరోజు ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. ఆ ఓటింగ్ వివరాలు మీరే చూడండి!

ఫైనల్‌లో అడుగు పెట్టింది వీళ్లే
ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఆరో సీజన్‌లోకి మొత్తం 21 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఈ క్రమంలోనే 14వ వారంలో ఇనాయా సుల్తానా ఎలిమినేట్ అయిపోయింది. ఫలితంగా షో చరిత్రలోనే తొలిసారి ఆరుగురు సభ్యులు ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో రేవంత్, శ్రీహాన్, శ్రీ సత్య, ఆది రెడ్డి, కీర్తి భట్, రోహిత్‌లు ఉన్నారు.

మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ
గతంలో ఎన్నడూ చూడని ఎన్నో ఆసక్తికరమైన ప్రయోగాలను బిగ్ బాస్ నిర్వహకులు ఆరో సీజన్‌లో చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆరుగురు కంటెస్టెంట్లను ఫినాలే వీక్‌లోకి పంపారు. అయితే, వీళ్లలో ఒకరు బుధవారం ఎపిసోడ్‌లోనే ఎలిమినేట్ అవుతారని హోస్ట్ నాగార్జున వెల్లడించాడు. అంటే.. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు మాత్రం ఐదుగురు కంటెస్టెంట్లే ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ఈరోజే ఒకరు.. విన్నర్ అప్పుడే
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో టాప్ 5 కంటెస్టెంట్లను నిర్ణయించే చివరి (మిడ్ వీక్) ఎలిమినేషన్ ప్రక్రియ బుధవారం రాత్రి జరగబోతుందని ముందే చెప్పుకున్నాం. అప్పటి నుంచి టాప్ 5 సభ్యులకు మాత్రమే ఓటింగ్ జరగబోతుంది. వీళ్లలో విజేతను నిర్ణయించే ఎపిసోడ్ మాత్రం వచ్చే ఆదివారం (డిసెంబర్ 18వ తేదీ) సాయంత్రం ఆరు గంటలను నుంచి ప్రసారం కానుందని తెలిసిందే.

సీజన్‌లోనే అత్యధిక ఓటింగ్‌తో
తాజా సీజన్‌లో ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. అందులో ఒకరు బుధవారమే వెళ్లిపోతారు. మిగిలిన వాళ్లలోనూ ఒకరు మాత్రమే విజేతగా నిలబోతున్నారు. దీంతో ప్రేక్షకులంతా తమకు నచ్చిన కంటెస్టెంట్లను గెలిపించేందుకు ఫుల్‌గా ఓట్లు గుద్దేస్తున్నారు. దీంతో ఈ సీజన్‌లోనే తొలిసారి భారీ స్థాయిలో ఓటింగ్ జరుగుతుందని విశ్వసనీయంగా తెలిసింది.

రేవంత్ టాప్.. అంతలోనే షాక్
ఆరో సీజన్‌లోకి మొత్తంగా 21 మంది సభ్యులు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో రేవంత్ మాత్రమే ఆరంభం నుంచే టైటిల్ ఫేవరెట్ అనిపించుకుంటోన్నాడు. ఈ క్రమంలోనే ఫినాలే వీక్‌లోకూ కూడా అతడే ముందంజలో ఉన్నాడు. రేవంత్‌కు ఈ వారం ఆరంభంలో 30 శాతం ఓట్లు వచ్చాయి. అయితే, ఇవి క్రమంగా డౌన్ అవుతున్నాయని తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది.

మిగిలిన స్థానాల్లో ఎవరంటే!
ప్రస్తుతం నడుస్తోన్న బిగ్ బాస్ ఆరో సీజన్ ఫినాలే వీక్‌లో భాగంగా జరుగుతున్న ఓటింగ్‌లో ప్రస్తుతానికి సింగర్ రేవంత్ ఫస్ట్ ప్లేస్‌లోనే ఉన్నాడు. అతడి తర్వాత అంటే రెండో స్థానంలో శ్రీహాన్ చోటూ, మూడో స్థానంలో రోహిత్ ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. అలాగే, కీర్తి భట్ నాలుగో స్థానంలో ఉందని సమాచారం. ఈరోజు సాయంత్రానికి ఈ స్థానాలు మారే ఛాన్స్ కూడా ఉంది.

మిడ్ వీక్‌లో వెళ్లేది ఎవరంటే
ఆరో సీజన్ ఫినాలే వీక్‌కు సంబంధించిన ఓటింగ్‌లో ప్రస్తుతం ఆది రెడ్డి ఐదో స్థానంలో ఉండగా, శ్రీ సత్య ఆరో స్థానంలోనే కొనసాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అంటే ఈ ఇద్దరిలోనే ఒకరు మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే, కీర్తి భట్‌ను కూడా పంపించే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది. మొత్తంగా ఈ ముగ్గురిలోనే ఒకరు వెళ్లిపోతారని టాక్.


Click it and Unblock the Notifications











