‘బిగ్ బాస్ షో కాదు.. నిబ్బా షో’.. రగిలిపోయిన వీజే సన్నీ

బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు వీజే సన్నీ. తొలుత ఆయన టీవీ సీరియల్స్, టెలివిజన్ షూస్ తో స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ లో తనకుంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తూ వెండితెరపై అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో మంచి క్రేజ్ దక్కించుకున్న విషయం విదితమే. అయితే బిగ్ బాస్ షో సీజన్ 9 త్వరలో ప్రారంభం కానుండటంతో బిగ్ బాస్ విన్నర్స్ కు సంబంధించిన కామెంట్స్ ట్రెండింగ్ లో వచ్చాయి. ఈ క్రమంలో వీజే సన్నీ కామెంట్స్ వైరల్ గా మారాయి. బిగ్ బాస్ షోపై తన అభిప్రాయాన్ని చెప్పడం షాకింగ్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ 5 విన్నర్ గా..
టీవీ ప్రేక్షకులను వీజే సన్నీ కళ్యాణ వైభోగమే అనే డైలీ సీరియల్ తో పరిచయం అయ్యారు. ఆ సీరియల్ 2017లో జీ తెలుగులో ప్రసారం అయ్యింది. వీజే సన్నీ పాత్ర చాలా సరదాగా ఉంటుంది. దాంతో బుల్లితెర ఆడియెన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకో గలిగాడు. ఆ సీరియల్ ముగిసిన తర్వాత ఏకంగా పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకున్నారు. షో చివరి వరకు తనదైన శైలిలో టాస్క్ లు ఆడి వినోదాన్ని పంచారు. ఇక షో చివరి అన్ని అన్ని పోటీల్లో నెగ్గి టైటిల్ ను సాధించుకున్నారు. బిగ్ బాస్ తెలుగు 5 విజేతగా నిలిచాడు.

Bigg Boss Winner VJ Sunny Shocking Comments

బిగ్ బాస్ షోపై షాకింగ్ కామెంట్స్..
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదోక కంటెంట్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక మంచి కన్న చెడునే ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోపై వీజే సన్నీ చేసిన కొన్ని షాకింగ్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 'బిగ్ షోను తను పెద్దగా చూసే వాడిని కాదని, ఇక ఒకరు బిగ్ బాస్ షో గురించి అడిగిన సమయంలో అది బిగ్ బాస్ షో కాదు.. నిబ్బా షో అని అన్నాను. బిగ్ బాస్ షో తర్వాత లైఫ్ మారిపోతుందనుకుంటే భిన్నంగా మారిపోయిందని అభిప్రాయ పడ్డారు.

ఒక సినిమా ఆఫీస్ లో సినిమా కోసం, హీరోగా అవకాశం కోసం వెళ్లిన సమయంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎందుకు అంటూ పక్కకు పెట్టారు. అది చాలా బాధగా అనిపించింది.' అని చెప్పుకుంటూ వచ్చారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం కాబోతున్న వేళ సోషల్ మీడియాలో షోకు సంబంధించిన మాజీ కంటెస్టెంట్స్ వ్యక్తం చేసిన నెగెటివ్ అభిప్రాయాలు వ్యాప్తి చెందుతుండటం ఆశ్చర్యకరంగా మారింది.

ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక వేగవంతమైంది. సెప్టెంబర్ మొదటి వారంలోనే బిగ్ బాస్ 9 సీజన్ ప్రారంభం కాబోతుండటం విశేషం. ఈసారి హౌజ్ లోకి ఇద్దరు కామన్ మెన్ లకు కూడా అవకాశం ఇస్తున్నారు. దీంతో షోపై మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ సీజన్ కు కూడా అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తుండటం విశేషం. షో గ్రాండ్ లాంఛ్ ఎప్పుడవుతుందా? అని బిగ్ బాస్ అభిమానులు, టీవీ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X