Bigg Boss winners: ఇప్పటివరకు గెలిచిన వారిలో ఒక్కరు తప్పితే అందరూ ఫ్లాప్.. మరి సన్నీ ఫ్యూచర్ ఏంటీ?
టెలివిజన్ రంగంలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ దాదాపు అన్ని లాంగ్వేజెస్ లో సక్సెస్ అయ్యింది. ఇక తెలుగులో మొదలైనప్పుడు అసలు ఎక్కువ రోజులు కొనసాగుతుందా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. కానీ బిగ్ బాస్ సరైన ప్లానింగ్ తోనే భారీ స్థాయిలో క్రేజ్ అందుకునేలా గేమ్ డిజైన్ చేసుకుంటూ వచ్చారు. అయితే బిగ్ బాస్ లో భాషతో సంబంధం లేకుండా మంచి కెరియర్ ను సెట్ చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది సక్సెస్ అయ్యారు. అయితే తెలుగులో మాత్రం ఇప్పటి వరకు వచ్చిన ఐదు సీజన్లలో గెలిచిన వారిలో ఒక్కరు తప్పితే మిగతా వారందరూ కూడా కెరీర్ ను ఒక ట్రాక్ లో చేసుకోవడంలో విఫలమయ్యారు. ఇక ఇప్పుడు సన్నీ పరిస్థితి ఏమిటి అనేది హాట్ టాపిక్ గా మారింది.
Recommended Video

క్రేజ్ వచ్చింది కానీ..
సినిమా ప్రపంచంలో లేదా ఇతర ఎంటర్టైన్మెంట్ క్యాటగిరీలో సక్సెస్ అవ్వాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే అలాంటి వారికి బిగ్ బాస్ వేదిక ఒక మంచి అవకాశం అనే చెప్పాలి. కేవలం క్రేజ్ అందుకోవడానికి మాత్రమే కాకుండా మంచి ఆదాయం కూడా అందుకునే ఛాన్స్ ఉంటుంది. టాలెంట్ ఉంటే బిగ్ బాస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఎంతో పోరాడి గెలిచిన కొంతమంది మాత్రం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోతున్నారు.

సీజన్ వన్ శివ బాలాజీ ఎక్కడ?
బిగ్ బాస్ సీజన్ వన్ ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలైనవి విషయం తెలిసిందే. అయితే మొదట్లో చాలా తక్కువ రోజులే కొనసాగిన ఈ షోలో శివబాలాజీ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. అయితే అతను అంతకు ముందు నుంచి సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని హీరోగా పలు సినిమాలు కూడా చేశాడు. అయితే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయిన తర్వాత కూడా శివ బాలాజీ కి ఏ మాత్రం నిలదొక్కుకేకపోయాడు.

కౌశల్ హడావుడి మాయం
ఇక రెండో సీజన్ కు నాని హోస్ట్ గా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సీజన్ లో నాని హోస్ట్ కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. ఇక రెండో సీజన్ లో బిగ్ బాస్ విజేతగా కౌశల్ మండా టైటిల్ అందుకున్నాడు నిజానికి బిగ్ బాస్ ద్వారా అతనికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రత్యేకంగా ఆర్మీలు అంటూ రోడ్ ర్యాలీలు, సభలు నిర్వహించడం విశేషం. అయితే అతను బయటకు వచ్చిన తర్వాత ఆ హడావిడి ఎక్కువ రోజులు కనిపించ లేదు. కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కౌశల్ కు సరైన అవకాశాలు దక్కలేదు.

రాహుల్ ఒక్కడే..
సీజన్ 2 ముగిసిన తర్వాత మూడో సీజన్లో ద్వారా బిగ్ బాస్ హోస్ట్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన నాగార్జున 5వ సీజన్ వరకు విజయవంతం గానే వచ్చారు. ఇక మూడవ సీజన్ లో విజేత గా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సింగర్ గా ఇతనొక్కడే ఇండస్ట్రీలో చాలా పాపులర్ అవుతున్నాడు. అంతకుముందే సింగర్ గా రాహుల్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నప్పటికి ఆ తర్వాత అతడి స్థాయి మరికొంత ఎక్కువగా పెరిగింది అనే చెప్పాలి.

అభిజిత్ కూడా..
ఇక నాలుగవ సీజన్ కు కూడా నాగార్జునను హోస్ట్ గా కొనసాగించిన విషయం తెలిసిందే. మొత్తానికి అభిజిత్ అనుకున్నట్లే ఆ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. కానీ అతను కి బిగ్ బాస్ ఏ విధంగానూ ఉపయోగ పడలేదు. ఒక విధంగా అతనికంటే టాప్ ఫైవ్ లో కి వచ్చిన మిగతా వారికి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. కానీ అభి మాత్రం సరైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాలేకపోయాడు.

సన్నీ ఏం చేస్తాడో మరి..?
ఇప్పుడు ఐదో సీజన్ విజేతగా నిలిచిన సన్ని తన కెరీర్ ను ఏ విధంగా మలుచుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రైజ్ మనీ తో పాటు 15 లక్షలకు పైగా పారితోషికం కూడా వచ్చింది అంతేకాకుండా 25 లక్షలు ఫ్లాట్ తో పాటు మరో రెండు లక్షల విలువచేసే బైక్ కూడా సొంతమైంది. మొత్తానికి సన్నీ విజేతగా లాభాలను బాగానే అందుకున్నాను. ఇక సన్నీ తన కెరీర్ మళ్ళీ విజేగా కొనసాగిస్తాడా లేక జర్నలిస్టుగా కొనసాగిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. అతని హడావిడి చూస్తుంటే మళ్లీ సినిమాల్లో ట్రై చేసేలా ఉన్నాడు అనిపిస్తుంది. కానీ సన్నీ బిగ్ బాస్ తర్వాత ప్రేక్షకులు ఎంతమేరకు ఆదరిస్తారో అనేది మరొక పెద్ద సందేహం. మరి అతను ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వేళ్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











