బిగ్‌బాస్‌లో కుట్రలు, కుతంత్రాలు.. కౌశల్, దీప్తి, అమిత్, శ్యామల నామినేట్.. అమిత్ డబుల్ గేమ్
Recommended Video

బిగ్‌బాస్‌లో 86వ రోజు ఇంటి సభ్యుల మధ్య అసలు రూపాలు బయటపడ్డాయి. ఒకరిపై మరోకరు ఆరోపణలు, లోపాలు ఎత్తుచూపేందుకు అవకాశాలను వాడుకొన్నారు. లవ్, హేట్ అనే ఆటను ఇంటి సభ్యులతో బిగ్‌బాస్ ఆఢించారు. అలాగే నామినేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. నామినేషన్ ప్రక్రియ పూర్తిఇకాగానే ఇంటి సభ్యుల మధ్య గొడవలు యధావిదిగా కొనసాగాయి. అసలేం జరిగిందంటే...

లవ్, హేట్ గేమ్
ఇంటి సభ్యుల మధ్య ప్రేమ, విద్వేషాన్ని అంచనా వేయడానికి లవ్, హేట్ గేమ్ ఆడించారు. ఎక్కవ మంది కౌశల్‌ను హేట్ చేశారు. మిగితా అందరు తమకు నచ్చిన వారు పేరు చెప్పి లవ్ చేస్తున్నామని చెప్పారు. సామ్రాట్ అంటే ఇష్టమని తనీష్.. శ్యామల అంటే నాకు ఇష్టమని గీతా మాధురి చెప్పారు.

గీత అంటే ఇష్టమని కౌశల్
లవ్, హేట్ అనే గేమ్‌లో కౌశల్ మాట్లాడుతూ.. గీతా అంటే నాకు చాలా ఇష్టం. పదేళ్లకు పైగా పరిచయం ఉంది. అంతేకాకుండా ఇంట్లో నాకు బాగా పరిచయమైన వ్యక్తి కూడా గీతానే. అందుకే ఆమె అంటే నాకు లవ్. అలాగే నాపై అనేక ఆరోపణలు చేస్తుండటంతో ఆమెను నేను హేట్ కూడా చేస్తున్నాను అని కౌశల్ చెప్పాడు.

నామినేషన్ నుంచి సామ్రాట్ సేఫ్
లవ్, హేట్ గేమ్ తర్వా నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇంటి సభ్యుల ముగ్గురి ఫోటోలను ఇంటి బయట ఉంచిన బోర్డ్‌పై ఉంచి నామినేట్ చేసి, ఒకరిని సేవ్ చేయమని బిగ్‌బాస్ కోరాడు. ఆ తర్వాత సేవ్ ఓట్లు ఎక్కువగా రావడంతో సమ్రాట్ ఈ వారం నామినేషన్ నుంచి తప్పించుకొన్నాడు.

గీతా మాధురి సేఫ్.. కౌశల్ నామినేటెడ్
మర్డర్ టాస్క్‌లో గీతా మాధురి సూచన వల్ల ఈ సీజన్ మొత్తానికి కౌశల్ నామినేట్ అయ్యారు. దాంతో నామినేషన్ ప్రక్రియలో ఆయన పేరును, మర్డర్ టాస్క్ గెలిచినందున గీతా మాధురి పేరును తొలగించారు. ఈ వారం కౌశల్‌తో నామినేట్ అయిన వారిలో దీప్తి, శ్యామల, అమిత్, కౌశల్ ఉన్నారు.

దీప్తి కంటతడి
కెప్టెన్సీ టాస్క్ సందర్బంగా తాను సరిగా వ్యవహరించలేదని, అలాగే కెప్టెన్సీని సరిగా నిర్వర్తించలేకపోవడం తన లోపమని కౌశల్‌తోపాటు పలువురు అనడంతో దీప్తి కంటతడి పెట్టుకొంది. శ్యామల, రోల్ రైడా సర్దిచెప్పడంతో ఏడుపును ఆపింది. గణేష్ ఏడువ వద్దని చెప్పాడు. నేను ఏడిస్తే నా కొడుకు కూడా ఏడుస్తాడు అని దీప్తి చెప్పుకోవడం గమనార్హం.

కౌశల్‌పై దీప్తి నల్లమోతు సీరియస్
నామినేషన్ ప్రక్రియలో తనపై కౌశల్ కామెంట్ చేయడంతో దీప్తీ సీరియస్ అయింది. కెప్టెన్సీ టాస్క్ డిజాస్టర్ అని కౌశల్ అనడంపై దీప్తి మండిపడింది. ఓ దశలో కౌశల్‌తో గొడవ పడి వెళ్లిపోయింది. తాను ఏది చెప్పితే అది కరెక్ట్ అని కౌశల్ అనుకొంటాడు అని గీతాతో దీప్తి చెప్పింది.

అమిత్ తివారీ డబుల్ గేమ్
ఓ వైపు కౌశల్‌ను విమర్శిస్తూనే మరోపక్క నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు అని అమిత్ అనడం ద్వంద ప్రమాణాలకు అద్దం పట్టింది. తనీష్‌తో కౌశల్ గురించి చెడుగా మాట్లాడుతూనే మరో పక్క నేను నీ ఫ్రెండ్ అని చెప్పడం కన్‌ఫ్యూజన్‌కు గురిచేసింది. జాకెట్ వ్యవహారాన్ని పూర్తిగా మరిచిపోయానని చెప్పడం గమనార్హం.


Click it and Unblock the Notifications











