గీతా, కౌశల్ మళ్లీ ఫైట్.. కారులో ఇంటి సభ్యుల బందీ.. కౌశల్‌కు ఎదురుదెబ్బ
Recommended Video

బిగ్‌బాస్2 తెలుగు రియాలిటీ షోలో 87, 88వ రోజు ఆసక్తికరంగానే ముగిసింది. టాలీవుడ్ మారథాన్ అనే లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ను గురువారం ముగించాడు. ఇంట్లో సభ్యుల జర్నీని చూపించాడు. ఆ తర్వాత బిగ్‌బాస్ ఫినాలే టికెట్ అనే టాస్క్‌ను ప్రారంభించారు. చిన్న చిన్న గొడవలతో ఆసక్తికరంగా సాగింది. ఇంకా ఏమి జరిగిందంటే..

బిగ్‌బాస్ ఎలా ఉంటాడంటే
బిగ్‌బాస్‌లో ఇంటి సభ్యులకు ఓ ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చాడు. బిగ్‌బాస్ ఎలా ఉంటాడనే అంశంపై చిత్ర లేఖనం పోటీని నిర్వహించాడు బిగ్‌బాస్. ఇంటిలోని సభ్యులందరూ తమకు నచ్చిన విధంగా, తోచిన విధంగా బిగ్‌బాస్ బొమ్మను గీసి చూపించారు.

టాలీవుడ్ మారథాన్ పూర్తి
టాలీవుడ్ మారథాన్ టాస్క్ పోటీ గురువారం కూడా సాగింది. చివరిసారిగా లేట్స్ డూ కుమ్ముడు అనే పాటకు డ్యాన్స్ చేయగా, ఇంతటితో ఆ టాస్క్ ముగిసింది అని ప్రకటించాడు. ఈ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేసిన సభ్యులను బిగ్‌బాస్ అభినందించాడు

గీత, కౌశల్ గొడవ
ఎప్పటిలానే ఇంటిలో గీతా మాధురి, కౌశల్ మధ్య గొడవ జరిగింది. చక్కగా ఓ కునుకు తీయడంతో ఫ్రెష్‌గా కనిపిస్తున్నారు అని కౌశల్ అనగా.. గీతా కోపంతో ఊగిపోయింది. నన్ను ఎందుకు సాధిస్తావు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. గీతాకు సామ్రాట్, తనీష్ మద్దతు పలికారు.

ఇంటిలో లైఫ్ జర్నీ
ఇంటి సభ్యులతో సమావేశమైన బిగ్‌బాస్ వారి 88 రోజుల లైఫ్ జర్నీని చూపించాడు. గత 13 వారాలు సాగిన జర్నీని చూసి ఇంటి సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. ఇంటిలో జరిగిన తీపి, చేదు గుర్తులను చూసి ఆనంద పడ్డారు.

టికెట్ ఫర్ ఫినాలే టాస్క్
ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. టికెట్ ఫర్ ఫినాలే అనే టాస్క్‌కు శ్రీకారం చుట్టాడు. ఇంటి బయట ఓ కారును పెట్టి టాస్క్‌ను ప్రారంభించాడు. కారులో ముందుగా కూర్చొన్న ఐదుగురు సభ్యుల పోటీకి అర్హత సాధిస్తారు. 24 గంటలపాటు ఎవరైతే కూర్చొని ఉంటారో వారికి ఫైనల్ వరకు ఉండే టికెట్ లభిస్తుంది. ఒకరికంటే ఎక్కువ ఉంటే ఈ పోటీ వర్తించదు అని చెప్పాడు.

కౌశల్‌కు ఎదురుదెబ్బ
బిగ్‌బాస్2 సీజన్‌కు నామినేట్ అయిన కౌశల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. టికెట్ ఫర్ ఫినాలే పోటీలో పాల్గోనేందుకు అర్హత లేదని బిగ్‌బాస్ చెప్పడంతో కౌశల్ షాక్ తిన్నాడు. కాసేపు అసహనంతో ఊగిపోయాడు. తాను ఆ పోటీలో లేననే బాధ అతడి ముఖంలో స్పష్టంగా కనిపించింది.

కారులో బందీ అయిన సామ్రాట్, గీత
బిగ్‌బాస్ హారన్ మోగించగానే ఇంటి సభ్యులు తోసుకుంటూ లోనికి దూరారు. ముందు సీట్లో తనీష్, దీప్తి, వెనుక సీట్లో గీతా మాధురి, సామ్రాట్, శ్యామల ఉన్నారు. ఈ పోటీకి కౌశల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.


Click it and Unblock the Notifications











