బిగ్‌బాస్‌లో దారుణం.. శ్యామల, దీప్తిపై తనీష్, సామ్రాట్ దాడి.. కారులోనే మూత్రం!

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 90 Day Highlights | Ticket To Finale Task

బిగ్‌బాస్‌లో 88, 89 రోజు టికెట్ టూ ఫినాలే వీక్ టాస్క్ రసాభసాగా మారింది. ఇంటి సభ్యులు ఒకరిపై మరొకరు బలప్రయోగం చేసుకోవడం చూడటానికి ఎబ్బెట్టుగా కనిపించింది. మహిళలపై పురుషులు దారుణంగా ప్రవర్తించడమేమిటి అనే విధంగా రోతపుట్టించింది. గేమ్‌ను గేమ్‌గా ఆడటంలో సామ్రాట్, తనీష్ విఫలయ్యారు. వారి ప్రవర్తన గేమ్‌కే మచ్చ తెచ్చే విధంగా మారింది. ఇంతకు గేమ్‌లో ఏం జరిగిందంటే..

టాస్క్ నుంచి గీతా మాధురి అవుట్

టాస్క్ నుంచి గీతా మాధురి అవుట్

బిగ్‌బాస్ ఇంటిలో కారులో జరుగుతున్న ఫినాలే టికెట్ టాస్క్ శుక్రవారం కూడా కొనసాగింది. కారులో గీతా మాధురి నిద్రపోవడంతో కుక్కలు మొరిగాయి. దాంతో కౌశల్‌ను ఈ పోటీలో అనర్హురాలిగా ప్రకటించారు. దాంతో గీతా మాధురి ఈ టాస్క్‌ నుంచి వైదొలిగింది.

గీతా, కౌశల్ మధ్య గొడవ

గీతా, కౌశల్ మధ్య గొడవ

గీతా మాధురి కారు నుంచి బయటకు రావడంతో కారులో నలుగురే మిగిలారు. బయటకు వచ్చిన తర్వాత టాస్క్‌ గురించి కౌశల్, గీతా మధ్య వాగ్వాదం జరిగింది. నీ తీరు వల్ల నాకు ఉన్న ఇంప్రెషన్ పోయిందంటూ మండిపడింది.

శ్యామల, దీప్తిపై దాడి, బలప్రయోగం

శ్యామల, దీప్తిపై దాడి, బలప్రయోగం

కారులో ఉన్న దీప్తిపై తనీష్, శ్యామలపై సమ్రాట్ బలప్రయోగం చేశారు. కారు నుంచి బయటకు తోయడానికి ఇద్దరు ప్రయత్నించారు. సామ్రాట్, తనీష్ చేష్టలు రోత పుట్టించాయి. వారిని దీప్తి, శ్యామల బలంగా ఎదురించడంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి.

తనీష్ అసభ్యంగా

తనీష్ అసభ్యంగా

కారులో కూర్చున్న తనీష్ అసభ్యంగా ప్రవర్తించాడు. పక్కన దీప్తి ఉందనే ధ్యాస లేకుండా దీప్తి పక్కనే మూత్రం పోశాడు. ఇంటి సభ్యులందరూ ఈ తతంగాన్ని చూశారు. ఏమిటీ వింత ప్రవర్తన అంటూ మాట్లాడుకొన్నారు.

తనీష్‌కు బిగ్‌బాస్ షాక్

తనీష్‌కు బిగ్‌బాస్ షాక్

దీప్తి వెంట్రుకలు కింద నేలను తాకాయి. కావున ఆమె ఈ పోటికి అనర్హురాలు అని తనీష్ చేసిన వాదనను కౌశల్ తోసిపుచ్చాడు. కానీ తనీష్ మొండిగా వాదించడంతో కౌశల్ ఒప్పుకోలేదు. అంతలోనే బిగ్‌బాస్ స్పందిస్తూ కాలు కిందపెడితేనే అనర్హురాలు అవుతారు అని చెప్పడంతో తనీష్, సామ్రాట్‌కు తగిన బుద్ధి చెప్పినట్టయింది.

సామ్రాట్ టాస్క్ నుంచి

సామ్రాట్ టాస్క్ నుంచి

టికెట్ ఫర్ ఫినాలే వీక్ టాస్క్‌లో చివరి దశకు చేరుకొన్న సమయంలో సామ్రాట్ అనూహ్యంగా బయటకు వచ్చారు. తనకు మూత్రం పోయాల్సి ఉందని, అందుకే బయటకు వచ్చాను అని చెప్పడంతో ఈ టాస్క్ నుంచి బయటకు వచ్చిన రెండో సభ్యుడిగా మారారు.

ఎవరికి దక్కని ఫినాలే టికెట్

ఎవరికి దక్కని ఫినాలే టికెట్

కారులో ఉండే వ్యవధి 24 గంటలు కావడం, ఆ గడువు పూర్తి కావడంతో టికెట్ ఫర్ ఫినాలే టాస్క్ ముగిసింది. ఈ టాస్క్‌లో ఒక్కరు ఉంటేనే ఆ టాస్క్‌కు ప్రయోజనం చేకూరుతుంది. అయితే చివర్లలో కారులో ముగ్గురు ఉండటంతో ఎవరికీ లాభం లేకుండా పోయింది. దాంతో ఫైనల్‌కు ఓ సభ్యుడు వెళ్లే అవకాశం జారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X