»   » తనీష్ తమ్ముడి నోటి దురుసు.. కౌశల్‌పై అక్కసు.. గీతా నీ నా పిల్లవు అని అంటూ..

తనీష్ తమ్ముడి నోటి దురుసు.. కౌశల్‌పై అక్కసు.. గీతా నీ నా పిల్లవు అని అంటూ..

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    బిగ్‌బాస్ ఇంటిలో 94, 95లో భావోద్వేగాలు వ్యక్తమయ్యాయి. ఇంటిలో లగ్జరీ బడ్జెట్ టాస్క్ రెండో రోజు కొనసాగింది. ఇంటి సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో ఆనందంతో కంటతడి పెట్టారు. బిగ్‌బాస్ నిబంధనలకు వ్యతిరేకంగా కౌశల్‌పై తనీష్ తమ్ముడు క్రిష్ కామెంట్లు చేయడం కొంత వివాదంగా మారింది. క్రిష్ చెప్పిన విషయాలు విని ఇంటి సభ్యులు నోళ్లు వెళ్లబెట్టారు. ఇంకా ఏమి జరిగిందంటే...

    క్రితం రోజుకు కొనసాగింపుగా

    క్రితం రోజుకు కొనసాగింపుగా

    క్రితం రోజుకు కొనసాగింపుగా లగ్జరీ బడ్జెట్ టాస్క్ సాగింది. ఇంటి సభ్యులతో ఫ్రీజ్, ఫాస్ట్ ఫార్వర్డ, రివర్స్ లాంటి టాస్కులతో సరదాగా సాగింది. కొందరు ఇంటి సభ్యులు టార్గెట్‌గా చేసి బిగ్‌బాస్ ఫ్రీజ్, రివర్స్ అంటూ ముప్పతిప్పలు పెట్టించారు. ప్రధానంగా గీతా మాధురి చాలా ఇబ్బంది పడింది.

    తనీష్‌ను పలకరించేందుకు క్రిష్

    తనీష్‌ను పలకరించేందుకు క్రిష్

    తనీష్ పలకరించేందుకు అతడి తమ్ముడు క్రిష్ వచ్చాడు. వచ్చి రాగానే ఇంటి సభ్యులందరితో మాట్లాడాడు. తనీష్‌తో ఒంటరిగా మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అంతలోనే కౌశల్‌ను ఓ ప్రశ్న అడుగుతానని చెప్పి లేచాడు. కౌశల్ దగ్గరికి వెళ్లి అందరి ముందు గతంలో జరిగిన విషయాలు చెప్పి ఇంట్లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించాడు.

    కౌశల్ దగ్గరికి క్రిష్ వెళ్లి..

    కౌశల్ దగ్గరికి క్రిష్ వెళ్లి..

    కౌశల్ దగ్గరికి క్రిష్ వెళ్లి.. దీప్తి కెప్టెన్సీని బిగ్‌బాస్ వెనుకకు తీసుకొన్న తర్వాత నీవు ఎందుకు వెళ్లి నాకు ఇవ్వమని అడిగావు అని అడిగాడు. దాంతో నాకు ఆ అర్హత ఉంది అని కౌశల్ బదులివ్వడంతో కొంత వాగ్వాదం సాగింది. అందర్ని ఫ్రీజ్ చేసి క్రిష్‌ను ఇంటి నుంచి పంపించాడం గమనార్హం.

    క్రిష్ వెళ్లిపోయాక ఇంట్లోకి

    క్రిష్ వెళ్లిపోయాక ఇంట్లోకి

    క్రిష్ వెళ్లిపోయాక ఇంట్లోకి ప్రైవేటు వ్యక్తుల వచ్చి హంగామా చేశారు. ముగ్గురు యువకులు వచ్చి అందరూ ఫ్రీజ్‌లో ఉండగా సెల్ఫీలు దిగారు. మరి కొందరు వచ్చి బిగ్‌బాస్ ఇంటిని కొనుగోలు చేస్తామని బేరసారాలు చేశారు. చివరికి ఇంట్లో సామాను తీసుకొని వెళ్లిపోయారు.

    కౌశల్ కొడుకు, కూతురు

    కౌశల్ కొడుకు, కూతురు

    ఇలా జరుగుతుంటే కౌశల్ కొడుకు, కూతురు ప్రవేశించారు. పప్పా (డాడీ) అంటూ కన్ఫెషన్ రూం నుంచి మైక్‌లో మాట్లాడటంతో కౌశల్ కంటతడి పెట్టుకొన్నాడు. ఫ్రీజ్ నుంచి రిలీఫ్ అయి వారిని ఎత్తుకొని ఆనందంలో మునిగిపోయాడు. ఆ తర్వాత కౌశల్ భార్య ప్రవేశించింది. నీవు బాగా ఆడుతున్నావు.. ఎవరికి సలహాలు ఇవ్వకు.. తీసుకోకు. నీ ఆట నీవు ఆడు అంటూ సలహా ఇచ్చింది. అనంతరం బయటకు వెళ్లిపోయారు.

     రోల్ రైడా చెల్లెలు

    రోల్ రైడా చెల్లెలు

    అనంతరం రోల్ రైడా చెల్లెలు ఇంటిలోకి ప్రవేశించింది. చెల్లెల్ని ముద్దులతో ముంచెత్తాడు. ఆప్యాయంగా మాట్లాడుకొన్నారు. రాఖీ కట్టినందుకు కాళ్లు మొక్కారు. అరుపు వీడియో గురించి చెప్పింది. బాగా సక్సెస్ అయింది అని వివరించింది. బిగ్‌బాస్ ఆదేశాల మేరకు ఇంటిని వదిలి వెళ్లింది.

    గీతా మాధురిని కలిసేందుకు

    గీతా మాధురిని కలిసేందుకు

    ఇక గీతా మాధురిని కలిసేందుకు నందు ఇంటిలోకి ప్రవేశించాడు. కన్ఫెషన్ రూంలో నుంచి గీతాతో మాట్లాడాడు. ఆ సమయంలో గీతా ఫ్రీజ్ అయి ఉంది. నీవు నా పిల్లవు. గొప్పగా ఆడుతున్నావు. ఇప్పుడు గీతా మాధురి భర్తను అని గొప్పగా చెప్పుకొంటాను అంటూ ఎమోషనల్ అయ్యాడు. కానీ ఇంట్లోకి రాకుండా వెళ్లిపోయాడు. నందు కోసం చాలా సేపు వెతికింది. అయితే రేపటి ఎపిసోడ్‌లో నందు, గీతామాధురి కలుసుకొన్నారు.

    English summary
    Bigg Boss2 Telugu 93,94 day Telugu highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. After 91 days of the game, Shyamala Eliminated from the house. 94th Luxury Budget task organised. Tanish, Kaushal, Roll Rida family entered in house.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more