జిగేల్ రాణిగా గీతా.. సర్దార్ గబ్బర్ సింగ్‌గా కౌశల్.. అమ్ముడు లెట్స్ డూ అంటూ కుమ్మేసిన సెలబ్రీటీలు

By Rajababu

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 88 Highlights

బిగ్‌బాస్ హౌస్‌ 86వ రోజు రికార్డింగ్ డ్యాన్స్ సెంటర్‌గా మారిపోయింది. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులకు టాలీవుడ్ సినిమా పాటలకు డ్యాన్స్ చేయాలని బిగ్‌బాస్ సూచించాడు. దానికనుగుణంగా ఇంటిని సినిమా హాలు మాదిరిగా పోస్టర్లతో నింపేశాడు. డ్యాన్స్ ఫ్లోర్ ఏర్పాటు చేశాడు. దానిపై డ్యాన్స్ చేయడానికి ఒక్కొక్కరికి ఓ పాటను కేటాయించాడు.

లగ్జరీ బడ్జెట్ టాస్క్

లగ్జరీ బడ్జెట్ టాస్క్

డ్యాన్స్ గేమ్‌లో భాగంగా గీతా మాధూరి జిగేల్ రాణి (రంగస్థలం), కౌశల్ తౌబా తౌబా (సర్దార్ గబ్బర్ సింగ్), తనీష్ సరైనోడు (సరైనోడు), రోల్ రైడా నైరే నైరే నైనైరే బాబా (ఆంధ్రావాలా), శ్యామల జంక్షన్ జంక్షన్‌లో (ఆగడు), దీప్తి నల్లమోతు అ అంటే అమలాపురం (ఆర్య), అమిత్‌కు ట్రింగ్ ట్రింగ్ (జై లవకుశ), సామ్రాట్ సీటీ మార్ (డీజే) పాటలను కేటాయించాడు.

సెలబ్రీటీలు గ్రూప్ డాన్యులు

సెలబ్రీటీలు గ్రూప్ డాన్యులు

టాస్క్‌లో భాగంగా గ్రూప్‌గా ఖైదీ నంబర్ 150, పురుషులు మాత్రమే గ్రూప్‌గా అదరగొట్టు, అదరగొట్టు, మహిళ సెలబ్రిటీలు కెవ్వు కేక పాటలకు డ్యాన్స్‌లు చేయాలని సూచించాడు. వాటికి అనుగుణంగా ఇ:టి సభ్యులకు దానికి సంబంధించిన క్యాస్టూమ్స్‌ను కేటాయించాడు.

జిగేల్ రాణిగా గీతా మాధురి

జిగేల్ రాణిగా గీతా మాధురి


గీతా మాధూరి జిగేల్ రాణిగా మారిపోయింది. జిగేల్ రాణి పాటకు లయబద్దంగా స్టెప్పులు వేసింది. జిగేల్ పాటకు అనుగుణంగా ఇంటి సభ్యులు నాట్యం చేశారు. గీతా డ్యాన్స్‌తో కాకుండా హావభావాలతో అదరగొట్టింది.

కౌశల్ సర్దార్ గబ్బర్ సింగ్ పాటకు

కౌశల్ సర్దార్ గబ్బర్ సింగ్ పాటకు

కౌశల్‌కు సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో తౌబా తౌబా పాటకు డ్యాన్స్ చేశాడు. పాటకు అనుగుణంగా స్టెప్లులు వేసి ఆలరించాడు. డ్యాన్స్ ఫ్లోర్‌ను దడదడలాడించాడు.

తనీష్ సరైనోడు

తనీష్ సరైనోడు

తనీష్ సరైనోడు చిత్రంలో సరైనోడు టైటిల్‌కు డ్యాన్స్ చేశాడు. స్టెప్పులతో ఇరగదీశాడు. రోల్ రైడా ఆంధ్రావాల చిత్రంలో నైరే నైరే నైనైరే బాబా పాటకు డ్యాన్స్ చేశాడు. వీరిద్దరు తమ మాస్ స్పెప్పులతో ఆకట్టుకొన్నారు.

జంక్షన్‌లో పాటకు శ్యామల

జంక్షన్‌లో పాటకు శ్యామల


శ్యామల ఆగడు చిత్రంలోని జంక్షన్ జంక్షన్‌ అనే పాటకు డ్యాన్స్ చేసి అదరగొట్టింది. చాలా ఫ్రొఫెషనల్‌గా డ్యాన్స్ చేసి ఆకట్టుకొన్నది. సినీతారలకు ఏ మాత్రం తగ్గకుండా తనదైన శైలిలో డ్యాన్స్ చేసి మెప్పించింది.

అమిత్ ట్రింగ్ ట్రింగ్

అమిత్ ట్రింగ్ ట్రింగ్

అమిత్ జై లవకుశ చిత్రంలోని ట్రింగ్ ట్రింగ్ పాటకు, సామ్రాట్ డీజే చిత్రంలోని సీటీ మార్ సీటీ మార్ పాటకు డ్యాన్స్ చేశారు. సామ్రాట్ జోష్‌తో డ్యాన్స్ చేయగా, అమిత్ మాస్ స్టెప్పులతో అలరించాడు.

అందరూ లెట్స్ డు కుమ్ముడు

అందరూ లెట్స్ డు కుమ్ముడు


ఇంటి సభ్యులందరూ ఖైదీ నంబర్ 150లోని అమ్ముడు లేట్స్ కుమ్ముడు గ్రూప్‌గా డ్యాన్స్ చేశారు. శ్యామల, దీప్తి, సామ్రాట్, కౌశల్ తనదైన మార్కు స్టెప్పులను వేశారు. పాటలపై డ్యాన్సులను సభ్యులు ఫుల్లుగా ఎంజాయ్ చేయడం గమనార్హం

లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో

లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో

లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా కేవలం పురుషులు మాత్రమే అదరగొట్టు, అదరగొట్టు అనే పాటకు గ్రూప్‌గా డ్యాన్స్ చేశారు. మేల్ సెలబ్రీటలందరూ చక్కగా స్పెప్పులు వేశారు.

కేవలం మహిళా సెలబ్రీటలు

కేవలం మహిళా సెలబ్రీటలు

ఇదే టాస్క్‌లో కేవలం మహిళా సెలబ్రీటలు గబ్బర్ సింగ్ చిత్రంలోని కెవ్వు కేక పాటకు దుమ్మురేపేలా డ్యాన్స్ చేశారు. శ్యామల, దీప్తి నల్లమోతు సహజంగా నృత్యాలు చేశారు.

నిద్ర మత్తులోనే ఇంటి సభ్యులు

నిద్ర మత్తులోనే ఇంటి సభ్యులు

అర్ధరాత్రి నిద్రలో ఉండగా కూడా పాటలను ప్లే చేసి సెలబ్రీటలతో బిగ్‌బాస్ ఆడుకొన్నాడు. నిద్ర మత్తులోనే ఇంటి సభ్యులు డ్యాన్స్ ఫ్లోర్ మీదకు వచ్చి డ్యాన్స్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X