బిగ్‌బాస్‌లో మిడ్‌నైట్ మసాలా.. తేజస్వి, బాబు గోగినేనికి పిచ్చ క్లాస్.. ఆ ఇద్దరు సేఫ్!

By Rajababu

తెలుగు బిగ్‌బాస్ షో మిడ్‌నైట్ మసాలాను మించి మైమరిపిస్తున్నది. కొందరు సెలబ్రిటీలు రొమాన్స్ కోసమే బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చారా అనే ఫీలింగ్ కలుగుతున్నది. గతవారం జరిగిన ఎపిసోడ్స్‌ను విశ్లేషిస్తూ ఇంటి సభ్యుల్లో కొందరికీ.. ముఖ్యంగా బాబు గోగినేని, తేజస్వి మదివాడకు క్లాసీ పీకారు. అలాగే రోజు రోజుకు రాటు దేలుతున్న కామన్ మ్యాన్ గణేష్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. శనివారం జరిగిన ఎపిసోడ్స్‌కు సంబంధించిన పూర్తి సమాచారం..

కౌశల్‌కు నాని అభినందన

కౌశల్‌కు నాని అభినందన

బిగ్‌బాస్ హౌస్ ఇంటి కెప్టెన్‌గా ఎంపికైన కౌశల్‌ను హోస్ట్ నాని అభినందించారు. ఈ సందర్భంగా కౌశల్ మాట్లాడుతూ.. గత కెప్టెన్సీ టాస్క్‌లో నాకు ఈ పదవి దక్కితే ఎంజాయ్ చేసేవాడిని కాదు. ప్రస్తుతం ఇంటి సభ్యుల ప్రేమానురాగాల మధ్య కెప్టెన్ పదవి దక్కడం చాలా ఆనందంగా ఉంది. అందుకు అందరీకి థ్యాంక్స్ అని కౌశల్ తెలిపారు.

కౌశల్‌కు నాని షాక్

కౌశల్‌కు నాని షాక్

ఇంటి సభ్యుల ప్రేమ మధ్య కెప్టెన్ పదవి చేపట్టడం ఆనందంగా ఉన్నదని వ్యాఖ్యలు చేసిన కౌశల్‌కు నాని పెద్ద షాక్ ఇచ్చారు. తన గురించి తేజస్వి, బాబు గోగినేని, తనీష్ లాంటి వాళ్లు ఎలా మాట్లాడుకొంటున్నారో అనే వీడియోను చూపించడంతో కౌశల్‌కు నోటమాట రాలేదు. కౌశల్ కెప్టెన్సీ రావడంపై సెటైర్లు విసిరిన ఇంటి సభ్యుల ప్రవర్తనతో కౌశల్ అవాక్కయ్యారు. అయినా ఇంటి సభ్యులపై పాజిటివ్‌గా స్పందించడం గమనార్హం.

బాబు గోగినేనికి నీళ్లు తాగించిన నాని

బాబు గోగినేనికి నీళ్లు తాగించిన నాని

ఇంటి సభ్యులతో మాట్లాడే భాగంగా బాబు గోగినేనికి నాని గట్టిగానే క్లాస్ పీకాడు. దీప్తి నల్లమోతును నామినేట్ చేయడంపై గోగినేనిని నిలదీశాడు. తేజస్వి చెప్పిన మాటల నమ్మి దీప్తిని నామినేట్ చేయడం తప్పు అన్నారు. గోగినేని ఇచ్చిన సమాధానంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన నాని.. ఒకవేళ దీప్తి నామినేట్ అయితే నువ్వే కారణమవుతావు అని హెచ్చరించాడు. దేవుడినే నమ్మని నాస్తికుడిగా తేజస్వి మాటలు ఎలా నమ్ముతావని నిలదీశాడు. దాంతో గోగినేని నీళ్లు నమలుతు కనిపించాడు.

తేజస్వికి పిచ్చ క్లాస్

తేజస్వికి పిచ్చ క్లాస్

కెప్టెన్ కౌశల్‌పై కామెంట్లు చేసిన తేజస్వి మదివాడకు కూడా నాని జబర్దస్త్ క్లాస్ పీకారు. షో ఆరంభంలో అందరితో మంచిగా ఉండే నీవు ప్రస్తుతం బ్యాలెన్స్ తప్పుతున్నావు అని నాని కామెంట్ చేయడంతో తేజస్వికి షాక్ తగిలింది. నేచురల్‌గా దూకుడుతో వ్యవహరించే తేజస్వికి గొంతులో వెలక్కాయ పడినట్లయింది. ఇదే కొనసాగితే ఎలిమినేషన్ తప్పదనే విధంగా నాని వార్నింగ్ ఇచ్చారు.

దీప్తి సునైనకు చురకలు

దీప్తి సునైనకు చురకలు

అర్ధరాత్రి తనీష్‌తో సరసాలు అడటంపై సునైనాకు నాని చురకలు అంటించారు. మిడ్‌నైట్ లేచి వెళ్లి పడుకొన్న తనీష్ చెవిలో గుసగుసలాడటాన్ని నాని ఎత్తిచూపారు. నీకు నిద్రలో నడిచే అలవాటు ఉందా అని నిలదీశారు. అలాగే మీకు చీకటి ఉండవచ్చు.. కానీ మాకు నైట్ విజన్ కెమెరాల ద్వారా అంత కనిపిస్తుందని హెచ్చరించారు.

గణేష్ సేఫ్

గణేష్ సేఫ్

బిగ్‌బాస్ మొదలైనప్పటి నుంచి ప్రతీ వారం ఎలిమినేషన్‌లో ఉండే గణేష్‌కు ఈ వారం కొంత ఊరట లభించింది. చివరి వరకు టెన్షన్ లేకుండా యూ ఆర్ ప్రొటెక్టెడ్ అని గణేష్‌కు ఎలిమినేషన్ నుంచి విముక్తి కలిగించడం ఆయనకు ఉపశమనంగా మారింది.

గీతా మాధురి ప్రొటెక్టెడ్

గీతా మాధురి ప్రొటెక్టెడ్

అలాగే ఈ వారం ఎలిమినేషన్ జాబితాలో చాంతాండత లిస్టు ఉంది. ఈ జాబితాలో నుంచి సింగర్ గీతా మాధురిని తప్పించి ప్రొటెక్టెడ్ జోన్‌లోకి పంపించడంతో ఎలిమినేషన్ నుంచి విముక్తి లభించింది.

ఎలిమినేషన్ ఎవరు

ఎలిమినేషన్ ఎవరు

ఆదివారం ( జూలై 8న) జరిగే ఎలిమినేషన్ ప్రక్రియలో బాబు గోగినేని, తేజస్వి, దీప్తి నల్లమోతు, కౌశల్, తనీష్, శ్యామల తదితరులు ఉన్నారు. వీరిలో నుంచి ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్లారనే విషయం ఆసక్తిగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X