బిగ్ బాస్ 2 నుంచి బయటకొచ్చి సంచలన విషయాలు చెప్పిన నూతన్ నాయుడు

By Bojja Kumar

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Nutan Naidu Talks About Bigg Boss 2

బిగ్ బాస్ తెలుగు 2 నుండి రెండో వారం ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన నూతన్ నాయుడు మీడియా ఇంటర్వ్యూలతో బిజీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయయన పలు సంచలన విషయాలు చెప్పారు. అసలు బిగ్ బాస్ ఇంట్లో ఏం జరుగుతోంది? తాను ఎలాంటి వాడిని? ఎలిమినేట్ కావడానికి గల కారణాలు ఏమిటి? ఇంట్లో ఉన్న సభ్యులపై తన అభిప్రాయం ఏమిటి? పవన్ కళ్యాణ్‌తో తనకున్న అనుబంధం ఎలాంటిది? ఇలా పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

అదంతా నిజం కాదు

అదంతా నిజం కాదు

కామన్ మ్యాన్ కావడం వల్లనే తనను బయటకు పంపారు అనే దాంట్లో నిజం లేదని నూతన్ నాయుడు తెలిపారు. ఎలిమినేషన్ ప్రాసెస్ అంతా ఓటింగ్ మీద జరుగుతుంది. ప్రేక్షకులు ఎవరికైతే ఓట్లు వేస్తారో వారే గెలుస్తారు. కౌశల్‌కు జరిగిన సంఘటన, వాటి వల్ల ఓట్ల మీద పభావం పడింది. అందుకే కౌశల్‌కు ఓటింగ్ ఎక్కువ జరిగింది. ఆ సమయం, సందర్భంగా ఆయనకు అనుకూలంగా జరుగడంతో ఆయన గెలిచారు. అంతే తప్ప కామన్ మ్యాన్ అవడం వల్ల నన్ను బయటకు పంపారు అనేది నిజం కాదు అని నూనత్ నాయుడు తెలిపారు.

సంజన వాదనతో విబేధించిన నూతన్

సంజన వాదనతో విబేధించిన నూతన్

సంజన బిగ్ బాస్ హౌస్‌లో చాలా రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పడం తన వ్యక్తిగత అభిప్రాయమని నూతన్ నాయుడు అన్నారు. వాస్తవంగా అక్కడ అలాంటివేమీ జరుగవు. అందరూ చాలా చక్కగా ఉంటారు. 24 గంటల్లో గంట మీకు చూపించడానికి కొన్ని డ్రమాటిక్ సీన్స్, సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి చూపిస్తారే తప్ప 24 గంటలూ పరిస్థితి అలాగే ఉండదు. అయితే కొన్ని కాస్త కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కాస్త కాఠిన్యం, అలాగే కాస్త కారుణ్యం కూడా ఉంది. అక్కడున్న వారిలో పెద్దగా అభిప్రాయ విబేధాలు ఎవరికీ లేవు అని నూతన్ నాయుడు తెలిపారు.

పవన్ కళ్యాణ్‌కు వీర భక్తుడిని

పవన్ కళ్యాణ్‌కు వీర భక్తుడిని

గతంలో పీఆర్పీ నుండి పోటీ చేసి ఓడిపోయిన మాట నిజమే. అయితే జనసేనలో నాకు ఎలాంటి సభ్యత్వంకానీ, పదవి కానీ లేవు. పవన్ కళ్యాణ్ అంటే అత్యంత అభిమానం, ఆయనకు వీర భక్తుడిని, ఆయనతో వ్యక్తిగతంగా సాన్నిహిత్యం ఉన్న మాట వాస్తవం. ఆయన, నేను కలిసి మాట్లాడుకుని చాలా సంవత్సరాలైంది. గతంలో మంచి ఆత్మీయులుగా ఉన్నాం. కాలం, పనులు, ఆయన వ్యక్తిగతం, ఆయన రాజకీయం, సినిమాలు, పిల్లతోనూ ఆక్యుపైడ్ గా ఉండటం వల్ల, నేను నా కార్యక్రమాల్లో చాలా ఆక్యుపైడ్‌గా ఉండటం వల్ల జనసేనతో ఏ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరుగలేదు. పవన్ కళ్యాణ్‌ది అమోఘమైన వ్యక్తిత్వం, భగవంతుడి స్వరూపం ఆయన. నేను ఆయన్ను దేవుడిగా భావిస్తాను. ఆయనతో ఉన్న సాన్నిహిత్యంతో నేను తెలుసుకున్నది ఏమిటంటే అటు వంటి వ్యక్తి న బూతో న భవిష్యత్... అని నూతన్ నాయుడు తెలిపారు.

ఆ రోజు నాలో ఉద్రేకం కట్టలు తెంచుకుంది

ఆ రోజు నాలో ఉద్రేకం కట్టలు తెంచుకుంది

నాకు కుటుంబంతో చాలా అనుబంధం ఉంది. తల్లిదండ్రులంటే ఉంతో ఇష్టం. చాలా చిన్న స్థాయి నుండి వచ్చాను. వారి వల్లే నాలుగు వేళ్లు నోట్లోకి వెళుతున్నాయి. మమతానురాగాలు, అనుబంధాలు మధ్యతరగతిలో ఎక్కువగా ఉంటాయి. అది అక్కడ జనాలు గుర్తించలేక పోయారేమో? ఆ రోజు కెప్టెన్ సామ్రాట్ అన్న మాట నాకు మాత్రం అది చాలా గట్టిగా తగిలింది. మానసికంగా కొంత వేదనకు గురి చేసింది. అది ఉద్రేకం రూపంలో, ఆవేశం రూపంలో కట్టలు తెంచుకుంది. అందుకే సామ్రాట్ మీద అరిచాను, మధ్యలో వచ్చిన తనీష్ మీద అరిచాను అని నూతన్ తెలిపారు.

ఆ సీన్లు చూపించలేదు

ఆ సీన్లు చూపించలేదు

ఆ గొడవ తర్వాత వారితో మాట్లాడాను, నా పరిస్థితి గురించి వివరించాను. వారు కూడా దానికి చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. కానీ షోలో అది చూపించలేదంట. ఆ తర్వాత మేము కౌగిలించుకున్నాం, మాట్లాడుకున్నాం, జోకులేసుకున్నాం. తర్వాత వారు నన్ను బాసూ నువ్వు గబ్బర్ సింగ్, నరసింహ నాయుడు,, ఠాగూర్ అంటూ మాట్లాడటం చాలా సంతోషంగా అనిపించింది. 24 గంటల్లో గంట చూపించడం వల్లనే మీకు ఆ అభిప్రాయం కలుగుతుంది. 24 గంటలు చూపిస్తే ఆ ఇల్లు స్వర్గసీమ లాగే ఉంటుంది... అని నూతన్ తెలిపారు.

బిగ్ బాస్ 2 మీద ఆసక్తి తగ్గిందా?

బిగ్ బాస్ 2 మీద ఆసక్తి తగ్గిందా?

బిగ్ బాస్ 1 మొదటిది అవ్వడం వల్ల, కొత్తది అవ్వడం వల్ల ఎక్కువ మంది అందులో ఏమి చూపిస్తారో అని ఆసక్తిగా చూశారు. రెండో సీజన్ వచ్చే సరికి కొంత ఆసక్త తగ్గడం సహజం. అయితే రెండో సీజన్ వెంటనే అందుకుంటుంది. త్వరలోనే పికప్ అవుతుంది.... అని నూతన్ తెలిపారు.

ఎన్టీఆర్, నానిపై కామెంట్ చేసే స్థాయి లేదు

ఎన్టీఆర్, నానిపై కామెంట్ చేసే స్థాయి లేదు

ఎన్టీఆర్, నాని లాంటి వారిని కంపేర్ చేసేంత అర్హత, స్థాయి నాకు లేదు. ఆ ఇద్దరూ మహానుభావులు. తారక్ గారి యాక్షన్, డైలాగ్ డెలివరీ, డిక్షన్, టోన్, బాడీ లాంగ్వేజ్‌కు ఎవరూ దరి దాపుల్లోకి రాలేరు. నాని గారి విషయంలో ఆయనంత నేచురాలిటీ, కష్టపడి పైకొచ్చే విధానం, సొంత కాళ్ల మీద నిలబడటం, ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన నిరూపించుునే సందర్బంగా, ఆయన చేసిన సినిమాలు ఆయనకంటూ ఏర్పరుచుకున్న మార్కెట్ విధానం అద్భుతం. ఎవరి వారే సాటి... అని నూతన్ తెలిపారు.

బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవ్వాలంటే...

బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవ్వాలంటే...

బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవ్వాలని కోరుకుంటున్నారు అనే దానిపై నూతన్ స్పందిస్తూ.... దీప్తి నల్లమోతు లేదా కౌశల్ అవ్వాలని కోరుకుంటున్నాను. వారిద్దరు నాకు స్నేహితులు. దీప్తి సహనం, ఆమె వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆమె విన్నర్ అయితే ఇంకా బావుంటుంది అని నూతన్ తెలిపారు.

బాబు గోగినేనికి అమ్మాయిల పిచ్చి ఉందనే సంజన కామెంటుపై..

బాబు గోగినేనికి అమ్మాయిల పిచ్చి ఉందనే సంజన కామెంటుపై..

మొదట ఎలిమినేట్ అయిన సంజన....బాబు గోగినేనికి అమ్మాయిలు నైస్ చేస్తేనే నచ్చుతారు, ఆయనకు అమ్మాయిల పిచ్చి ఉందన్నట్లు మాట్లాడారు. ఇది నిజమేనా? అనే ప్రశ్నకు నూతన్ స్పందిస్తూ... ఆయనకు 51 సంవత్సరాల వయసు. ఆయన నా తండ్రి సమానులు. చాలా మంచి వ్యక్తి. జ్ఞానం, విజ్ఞానం ఉన్న వ్యక్తి, అనేక సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నాకైతే ఆయనపై అలాంటి అభిప్రాయం ఎప్పుడూ కలగలేదు. అలా ఆయన ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఇది ఎవరు కామెంట్ చేశారో అది వారి వ్యక్తిగతం.... అని నూతన్ అన్నారు.

ఆ రోజు అందుకే భోజనం మానేశా

ఆ రోజు అందుకే భోజనం మానేశా

భోజనం వద్ద తేజు అన్న మాటలు బాధించాయి. వాస్తవానికి అది నన్ను అనలేదు. ఎందుకంటే నేను రైస్ చాలా తక్కువ తింటాను. అయితే అది ఎవరిని అన్నారో తెలియదు. కానీ అలా మాట్లాడటం నచ్చలేదు. అందుకే ఆ రోజు భోజనం మానేశాను అని నూతన్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X